New Year Eve: కాణిపాకంలో భక్తుల కోసం అధికారుల వినూత్న ప్రయోగం
ABN , Publish Date - Jan 01 , 2025 | 11:04 AM
కొత్త సంవత్సరంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాణిపాకంలో ఆలయ అధికారులు భక్తుల కోసం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. క్యూలైన్లలోని భక్తులకు బిస్కెట్లు , బాదంపాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆలయ ఈవో పెంచల కిషోర్ ప్రారంభించారు. ఇకపై ప్రతినిత్యం ఈ కార్యక్రమం కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు.
చిత్తూరు జిల్లా: కొత్త సంవత్సరంలో (New Year) ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాణిపాకం (Kanipakam)లో ఆలయ అధికారులు (Officials) భక్తుల (Devotees) కోసం వినూత్న ప్రయోగానికి (innovative experiment) శ్రీకారం చుట్టారు. క్యూలైన్లలోని భక్తులకు బాదంపాలు, బిస్కెట్లు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో క్యూలైన్లలోని భక్తులకు బిస్కెట్లు , బాదంపాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆలయ ఈవో పెంచల కిషోర్ ప్రారంభించారు. ఇకపై ప్రతినిత్యం ఈ కార్యక్రమం కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు దర్శనం కోసం వచ్చి క్యూ లైన్‌లలో నిరీక్షిస్తున్న వారి సౌకర్యార్థం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇది భక్తులకు మంచి శుభవార్త.
కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో న్యూ ఇయర్ సందడి
కాగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బుధవారం న్యూ ఇయర్ సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకోడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్థానికంగా కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ స్వామివారిని దర్శించుకుని ఏర్పాట్లును పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని ఆలయ ఈవో పెంచల కిషోర్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకోడానికి తరలివస్తున్నారు. కాగా నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం కాణిపాక ఆలయానికి విచ్చేసే ప్రతి భక్తుడికీ స్వామి దర్శన భాగ్యం కల్పిస్తామని ఈవో పెంచల కిషోర్ తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు ఉభయదారుల ఆధ్వర్యంలో అభిషేకం, అనంతరం మూల విరాట్‌కు చందనాలంకారం నిర్వహించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం వేకువ జామున 3 గంటలకే స్వామి దర్శనాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఉచిత దర్శనంతో పాటు రూ.100, రూ.150 దర్శన కూలైన్లను ఏర్పాటు చేశామని, భక్తుల కోసం 8 వేల పెద్దలడ్డూలు, 80 వేల చిన్న లడ్డూలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రసాదాలను భక్తులు కొనుగోలు చేయడానికి కౌంటర్లను సిద్ధం చేస్తున్నట్లు ఈవో పెంచలకిషోర్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాణిపాక వినాయక ఆలయానికి పోటెత్తిన భక్తులు
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు
న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News