CM Chandrababu Naidu: సముద్రతీరంలో యుద్ధ ట్యాంకులు.. సీఎం చంద్రబాబు రియాక్షన్ చూడండి..
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:45 PM
ఒక్కసారిగా సముద్రతీరంలో యుద్ధ ట్యాంకులు ప్రత్యక్షమయ్యాయి.. అటు గాల్లో చూస్తే రివ్వున దూసుకెళ్తున్న ఫైటర్ జెట్స్. నీటి అడుగు నుంచి దూసుకొస్తున్న జలాంతర్గాములు. వాటిని చూసి సీఎం చంద్రబాబు ఎలాంటి రియాక్షన్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం..

ఒక్కసారిగా సముద్రతీరంలో యుద్ధ ట్యాంకులు ప్రత్యక్షమయ్యాయి.. అటు గాల్లో చూస్తే రివ్వున దూసుకెళ్తున్న ఫైటర్ జెట్స్. నీటి అడుగు నుంచి దూసుకొస్తున్న జలాంతర్గాములు. ఇదంతా జరిగింది మరెక్కడో కాదు.. మన విశాఖపట్నంలోనే. నేవీ డే ఉత్సవాల్లో భాగంగా ఇదంతా చోటుచేసుకుంది. నేవీ డే సందర్భంగా విన్యాసాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ కూడా సెలబ్రేషన్స్‌కు అటెండ్ అయ్యారు.
పాక్‌పై గెలుపునకు గుర్తుగా..
పాకిస్థాన్‌పై విజయానికి గుర్తుగా నేవీ నిర్వహిస్తున్న ఉత్సవాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రతి ఏడాది ఆనవాయితీ ప్రకారం జనవరి 4వ తేదీన ఈ వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఈవెంట్‌కు అటెండ్ అయిన ముఖ్యమంత్రి.. నేవీ సెయిలర్ల విన్యాసాలను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఉగ్రవాదులను తుదముట్టించడం, ప్రత్యర్థి దాడులను తిప్పికొట్టడం, భూమి.. నీరుతో పాటు గాల్లో అటాక్స్‌ను తట్టుకునే తీరు.. ఇలా ఈ వేడుకల్లో నేవీ సెయిలర్లు, పైలట్లు అనేక విన్యాసాలు చేశారు. వీటిని శ్రద్ధగా, ఆసక్తిగా తిలకిస్తూ కనిపించారు చంద్రబాబు.