Share News

Thirupati : నేడు తిరుపతికి సీఎం రాక

ABN , Publish Date - Jan 12 , 2025 | 05:50 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తిరుపతి రానున్నారు. విజయవాడ నుంచి విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 3.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.

Thirupati : నేడు తిరుపతికి సీఎం రాక

తిరుపతి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తిరుపతి రానున్నారు. విజయవాడ నుంచి విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 3.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన తిరుచానూరు చేరుకుంటారు. అక్కడ ఏజీ అండ్‌ పీ (అట్లాంటిక్‌ గల్ఫ్‌ అండ్‌ పసిఫిక్‌) కంపెనీకి సంబంధించి ఇళ్లకు పీఎన్‌జీ (పైప్డ్‌ నాచురల్‌ గ్యాస్‌) సరఫరాను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఓ వినియోగదారుడి ఇంటికి వెళ్లి గ్యాస్‌ సరఫరాను పరిశీలిస్తారు. 4.30 గంటలకు తాజ్‌ హోటల్‌కు చేరుకుని ఆ కంపెనీ ఏర్పాటు చేసిన సీఎన్‌జీ ఆటో, ఎల్సీవీ వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తారు. హోటల్‌లో ఆ కంపెనీ ప్రతినిధులతోనూ, జపాన్‌కు చెందిన పెట్టుబడిదారులతోనూ సమావేశమవుతారు. సాయంత్రం 6 గంటలకు బయల్దేరి స్వగ్రామమైన నారావారిపల్లికు చేరుకుంటారు. 15న విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు. సీఎం చంద్రబాబు మూడు రోజుల పాటు జిల్లాలో గడపనుండడంతో జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది.

Updated Date - Jan 12 , 2025 | 05:50 AM