Konaseema: నరాలు తెగే ఉత్కంఠ రేపిన డ్రాగన్ పడవల రేస్ ఫైనల్స్ పోరు..
ABN , Publish Date - Jan 13 , 2025 | 04:38 PM
ఆత్రేయపురం వద్ద గోదావరి ప్రధాన కాలువలో మూడ్రోజులుగా వాటర్ స్పోర్ట్స్ ఉత్సాహంగా సాగుతున్నాయి. మెుత్తం 11 జిల్లాలకు చెందిన 180 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దగ్గరుండి మరీ పడవ పోటీలను నిర్వహించారు.
అంబేడ్కర్ కోనసీమ: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి (Sankranti) వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కోడి పందేలు సహా పలు పోటీలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక, ఆత్రేయపురం (Atreyapuram)లో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన పడవ పోటీలు ఉత్కంఠను రేకెత్తించాయి. ఎంతో ఉషారుగా సాగిన డ్రాగన్ పడవల రేస్ (Gragon Boat Race) ఫైనల్స్ పోరు నరాలు తెగే ఉత్కంఠను రేపింది. 11 జిల్లాలకు చెందిన 12 జట్లు పోటీ పడగా.. చివరికి జంగారెడ్డిగూడెం, పల్నాడు జిల్లాల జట్లు ఉమ్మడి విజేతలుగా నిలిచారు.
Kukkuta Sastram: కోడి పందాల్లో గెలవాలంటే.. ఇలా చేయండి
ఆత్రేయపురం వద్ద గోదావరి ప్రధాన కాలువలో మూడ్రోజులుగా వాటర్ స్పోర్ట్స్ ఉత్సాహంగా సాగుతున్నాయి. మెుత్తం 11 జిల్లాలకు చెందిన 180 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు (MLA Bandaru Satyananda Rao) దగ్గరుండి మరీ పడవ పోటీలను నిర్వహించారు. కాగా, ఇవాళ (సోమవారం) జరిగిన ఫైనల్స్ పోటీలు ఉత్కంఠను రేకెత్తించాయి. నేడు పలు జట్లు పోటీ పడగా.. జంగారెడ్డిగూడెం, పల్నాడు జిల్లా జట్లు మెుదటి స్థానంలో నిలిచాయి. రెండో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా జట్టు విజయ కేతనం ఎగరవేసింది. అయితే ఫస్ట్ ప్రైజ్ కొట్టిన రెండు జట్లకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చెరో రూ.లక్ష చొప్పున అందజేశారు.
Sankranti - Pandem Kollu: పందెం కోళ్లు ఎన్ని రకాలో తెలుసా..?
కాగా, ఈ పోటీలను తిలకించేందుకు స్థానికులు సహా పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ.. వాటర్ స్పోర్ట్స్ ద్వారా కోనసీమలో పర్యాటకం అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కేరళను మరిపించే విధంగా ఆత్రేయపురంలో ఈ సంక్రాంతికి పడవ పోటీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది నుంచి మరింత పెద్దస్థాయిలో పడవ పోటీలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. తద్వారా ఏపీలో పర్యాటకం అభివృద్ధి చెందుతుందని, ప్రజలు కూడా సంతోషంగా పండగ నిర్వహించుకున్నట్లు ఉంటుందని ఎమ్మెల్యే సత్యానందరావు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
AP News: ఎక్కడున్నా వదిలిపెట్టను.. డిఎస్పీని బెదిరించిన జగన్..!
AP News: ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు..