Share News

GST Authorities : రూ.కోటి విలువైన నకిలీ సిగరెట్లు, ఖైనీ సీజ్‌

ABN , Publish Date - Jan 20 , 2025 | 04:03 AM

విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌, రూరల్‌ మండలం అంబాపురంలో అనధికారికంగా నిల్వ చేసిన నకిలీ సిగరెట్లు, ఖైనీ ప్యాకెట్లను సెంట్రల్‌

GST Authorities : రూ.కోటి విలువైన నకిలీ సిగరెట్లు, ఖైనీ సీజ్‌

విజయవాడ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌, రూరల్‌ మండలం అంబాపురంలో అనధికారికంగా నిల్వ చేసిన నకిలీ సిగరెట్లు, ఖైనీ ప్యాకెట్లను సెంట్రల్‌ జీఎస్టీ అధికారులు సీజ్‌ చేశారు. సెంట్రల్‌ జీఎస్టీలో యాంటీ ఎవేషన్‌, కస్టమ్స్‌ కమిషనరేట్‌ (ప్రివెంటివ్‌) అధికారులు.. శనివారం రాత్రి అంబాపురంలోని మారుమూల ప్రాంతాలు, అజిత్‌సింగ్‌నగర్‌లో ఉన్న గోడౌన్లలో సోదాలు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా తయారుచేసిన సిగరెట్లు, ఖైనీ ప్యాకెట్లు భారీగా ఉండటాన్ని గుర్తించారు. 102 సంచుల్లో 25.38 లక్షల జీటీపీఎల్‌ విమల్‌, గోల్డ్‌ విమల్‌, గోల్డ్‌ప్లేక్‌, పారిస్‌ సిగరెట్లు ఉన్నాయి. వాటి విలువ రూ.96.82 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. 23 సంచుల్లో 46 వేల స్పిట్‌ టుబాకో (ఖైనీ) ప్యాకెట్లు ఉన్నాయి. ఈ మొత్తం సరుకుకు ఎలాంటి ఈ-వే బిల్లులు లేకపోవడంతో అధికారులు సీజ్‌ చేశారు.

Updated Date - Jan 20 , 2025 | 04:03 AM