Share News

CM Chandrababu: గ్రీన్ ఎనర్జీ రూపంలో ఏపీకి రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - Jan 11 , 2025 | 01:51 PM

CM Chandrababu: ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం సౌర ఫలకాల ఏర్పాటు ఉచితంగా పెడుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. మిగిలిన వారికి కూడా సౌర ఫలకాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ రాయితీ పోను మిగిలిన ఫలకాలను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు.

CM Chandrababu: గ్రీన్ ఎనర్జీ రూపంలో ఏపీకి రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు
CM Chandrababu

అమరావతి: రాష్ట్రానికి రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రూపంలో రానున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ తయారవుతుందని అన్నారు. మిగిలిన ప్రాంతాల్లో తయారయ్యే సౌర, పవన, పoపడ్ స్టోరేజ్ విద్యుత్‌ను పూడిమాడకకు తెస్తే వాటి ద్వారా హెడ్రోజన్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఉత్పత్తయ్యే హైడ్రోజన్‌తో ఎరువులు, రసాయనాలు తయారవుతాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ(శనివారం) మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. హరిత ఇంధనం ద్వారా తయారయ్యే వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని దీంతో ఎగుమతులు పెరిగి మనకు లాభం వస్తుందని చెప్పారు. అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తికి హైడ్రోజన్ వాడితే వేడి బాగా తగ్గుతుందని తెలిపారు. ఎన్టీపీసీలో బొగ్గు మండించటం ద్వారా వచ్చే కార్బన్ డైయాక్సైడ్‌ని పూడిమడక తెచ్చి హైడ్రోజన్ ఉత్పత్తికి వాడితే కాలుష్యం తగ్గుతుందన్నారు. గ్రీన్ కో కంపెనీ కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్స్‌ను టెకోవర్ చేసి గ్రీన్ ఆమోనియా తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారని చెప్పారు. ఈ ప్లాంట్ మీద రూ.25వేలకోట్ల పెట్టుబడులు పెడుతున్నారన్నారు. కాకినాడ పోర్టు ద్వారా ఎగుమతులు జరుగుతాయని చెప్పారు. రిలయన్స్ కంపెనీ బయో కంప్రెస్సెడ్ గ్యాస్ తయారీకి 500కేంద్రాలు పెడుతోందని వివరించారు. ఒక్కో కేంద్రం రూ.130కోట్ల పెట్టుబడి పెడుతున్నారని చెప్పారు. బయోగ్యాస్‌కు ఉపయోగపడే గడ్డి ద్వారా ఇది తయారవుతుందని తెలిపారు. ఈ గడ్డి పెంచటానికి ఎకరాకు రూ.30వేల కౌలు రైతులకు రిలయన్స్ చెల్లిస్తుందన్నారు. ఈ కేంద్రాల వల్ల ఉద్యోగాలు వచ్చి, గ్యాస్ ఉత్పత్తిలో వచ్చే వ్యర్థాలు భూసారం పెంచేందుకు ఎరువు గానూ ఉపయోగపడుతుందని చెప్పారు. బెంగుళూరుకు చెందిన ఓ సంస్థ స్వాపింగ్ బ్యాటరీలు మోడల్‌ను కుప్పంకి తెచ్చిందన్నారు. కుప్పంలో సూర్యఘర్ అమల్లో ఉన్న ఇళ్లకు స్వాపింగ్ బ్యాటరీలు ఛార్జింగ్ చేసుకునేందుకు ఇంటి యజమానికి డబ్బులు చెల్లిస్తుందని అన్నారు. ఇది కుప్పం సూర్యఘర్ ఇంటి వాసులకు అదనపు ఆదాయం కానుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


సూర్యఘర్‌తో అదనపు ఆదాయం..

‘‘ఈ కేంద్రాల వల్ల ఉద్యోగాలు వచ్చి, గ్యాస్ ఉత్పత్తిలో వచ్చే వ్యర్థాలు భూసారం పెంచేందుకు ఎరువు గానూ ఉపయోగపడుతుంది. బెంగుళూరుకు చెందిన ఓ సంస్థ స్వాపింగ్ బ్యాటరీలు మోడల్‌ని కుప్పంకి తెచ్చింది. కుప్పంలో సూర్యఘర్ అమల్లో ఉన్న ఇళ్లకు స్వాపింగ్ బ్యాటరీలు ఛార్జింగ్ చేసుకునేందుకు ఇంటి యజమానికి డబ్బులు చెల్లిస్తుంది. ఇది కుప్పం సూర్యఘర్ ఇంటి వాసులకు అదనపు ఆదాయం కానుంది. సౌర విద్యుత్ ఉత్పత్తిపై కొత్త ఆలోచనలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం సౌర ఫలకాల ఏర్పాటు ఉచితంగా పెడుతున్నాం. మిగిలిన వారికి కూడా సౌర ఫలకాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ రాయితీ పోను మిగిలిన ఫలకాలను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వ పెట్టుబడి తిరిగి వచ్చే వరకూ కొంత మొత్తం విద్యుత్ వెనక్కి తీసుకుంటాం. ప్రభుత్వ పెట్టుబడి తిరిగి వచ్చాక యూనిట్ మొత్తం ఇంటి యజమానికి అప్పగిస్తాం. కుప్పంలో కొంతమందికి మానసిక ఎదుగుదల సమస్యలు, వినికిడి, మాటలు రాని సమస్యలు ఉన్నాయి. పిల్లల్లో సృజనాత్మకత పెంచటానికి యాప్‌ల సాయంతో శిక్షణ ఇస్తున్నారు. ఇది సత్ఫలితాలు ఇస్తున్నందున రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తాం’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Chandrababu: బ్రాండ్‌ ఏపీ!

Pawan Kalyan: క్షమాపణలు చెప్పాల్సిందే!

Vadde Obanna: రేనాటి వీరుడా వందనం!

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 11 , 2025 | 02:04 PM