Vidadala Rajini: ఆయనకు నాపై చాలా కోపం.. ఎందుకో తెలియదు
ABN , Publish Date - Mar 23 , 2025 | 04:50 PM
Vidadala Rajini: ఏసీబీ కేసు నమోదు కావడంతో మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజిని స్పందించారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు.

గుంటూరు, మార్చి 23: కూటమి ప్రభుత్వంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజిని ఆరోపించారు. రెడ్‌బుక్‌లో తనను టార్గెట్ చేశారన్నారు.అందులో భాగంగానే తనపై అక్రమ కేసు పెట్టారని విమర్శించారు. తనపై ఫిర్యాదు చేసిన వారిని తానెప్పుడూ చూడలేదని చెప్పారు. తనపై ఏసీబీ కేసు నమోదు చేయడంతో.. ఆదివారం గుంటూరులో మాజీ మంత్రి విడదల రజినీ స్పందించారు. ఆ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. తానంటే నరసరావుపేట ఎంపీ ఎల్ శ్రీకృష్ణదేవరాయులకు చాలా కోపమని తెలిపారు. అది ఎందుకో తెలియదన్నారు.
ఆ ఎంపీ ఆదేశాలతోనే తనపై కేసు పెట్టారని వివరించారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్‌బుక్ పాలనలో భాగంగానే తనపై ఈ అక్రమ కేసు పెట్టారన్నారు. తనపై కేసు పెట్టిన వారు టీడీపీకి చెందిన వారేనని విడదల రజిని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయకపోయినా.. తనన ఇబ్బంది పెడుతున్నారన్నారు వైసీపీలో ఉన్నప్పటి నుంచి శ్రీకృష్ణదేవరాయకులకు తనపై కక్ష ఉందని గుర్తు చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారని తెలిపారు. ఒక మహిళా ఎమ్మెల్యే కాల్ డేటా అడిగారని చెప్పారు. తనపై విజిలెన్స్ విచారణ చేయడానికి తానేం తప్పు చేశానని కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజినీ ప్రశ్నించారు.
2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విడదల రజిని వైసీపీలో చేరారు. అనంతరం చిలకలూరిపేట నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి.. గెలిచారు. అనంతరం వైఎస్ జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు గెలిచారు.
చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని.. ఆయన లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. కానీ ఎమ్మెల్యేగా, మంత్రిగా విడదల రజినీ ఏ రోజు.. లోక్ సభ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయులను పట్టించుకోలేదు. సరికదా.. పల్నాడు జిల్లాలో విడదల రజిని వర్గం ఒకటి హల్ చల్ చేసేదనే ఓ చర్చ సైతం గతంలో సాగింది. సదరు వర్గం.. జిల్లాలో ఎవరినైనా ఐ డొంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరించేది.
దీంతో ఈ వ్యవహారం కాస్తా పార్టీ అధినేత, నాటి సీఎం వైఎస్ జగన్‌తోపాటు సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి చేరింది. వారు సైతం విడదల రజినికి మద్దతుగా మాట్లాడడంతో.. పలువురు నేతలు పార్టీ వీడేందుకు సిద్దమయ్యారనే ఓ ప్రచారం సాగింది. అందులోభాగంగా లావు శ్రీకృష్ణదేవరాయులు గత ఎన్నికలకు ముందే వైసీపీ గుడ్ బై చెప్పి..టీడీపీలో చేరారు. తాజాగా మర్రి రాజశేఖర్ సైతం వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన అనంతరం ఆయన పట్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యవహరించిన వైఖరిని మీడియా ఎదుట ఎండగట్టిన సంగతి అందరికి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Viral News: శవయాత్రలో ఆశ్చర్యకర ఘటన..
KTR: కేటీఆర్ కాన్వాయ్‌లో అపశ్రుతి
IPL Uppal Stadium: ఐపీఎల్ మ్యాచ్.. బ్లాక్ టికెట్ల దందా.. రంగంలోకి పోలీసులు
For Andhrapradesh News And Telugu News