Share News

Viveka Case: వివేకా కేసులో కీలక పరిణామం

ABN , Publish Date - Feb 05 , 2025 | 01:59 PM

Viveka Case: మాజీ మంత్రి వివేకా కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఫిర్యాదుతో కీలక వ్యక్తిపై కేసు నమోదు అయ్యింది. అలాగే పలువురు పోలీసు అధికారుల పైనా కేసు నమోదు చేశారు పులివెందుల పోలీసులు.

Viveka Case: వివేకా కేసులో కీలక పరిణామం
Viveka Case

కడప, ఫిబ్రవరి 5: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (Fomre Minister Vivekananda Reddy) హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డా.చైతన్యరెడ్డిపై (Chaitanya Reddy) కేసు నమోదు అయ్యింది. అలాగే పలువురు పోలీసు అధికారులపైనా కేసు ఫైల్ అయ్యింది. వివేకా కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కడప సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు జైల్లో చైతన్య తమను కలిసి మభ్యపెట్టినట్లు గతంలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు దస్తగిరి.


వివేకా కేసులో కేవలం బాధితుల ఒత్తిడి వల్ల అప్రూవర్‌గా మారి అపద్దాలు చెప్పాల్సి వచ్చిందని.. చెప్పమని చైతన్య ఒత్తిడి తెచ్చాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలా చేస్తే రూ.20 కోట్లు ఇస్తామని చైతన్య మభ్యపెట్టినట్లు అప్పట్లో దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా చైతన్య రెడ్డితో పాటు అప్పట్లో కేసు నమోదు చేయకుండా నిందితులకు సపోర్టు చేయమని తనపై ఒత్తిడి తెచ్చిన పోలీసు అధికారులపైనా దస్తగిరి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు డీఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్య, సెంట్రల్ జైలు సూపరెండెంట్ ప్రకాష్‌లపై పులివెందుల పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేశారు.

బంగారం కొంటున్నారా.. కొంచెం జాగ్రత్త..


కాగా.. 2023 నవంబర్‌లో దస్తగిరి రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న సమయంలో చైతన్య రెడ్డి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి తనను బెదిరించాడంటూ పలు మార్లు మీడియాకు తెలిపారు దస్తగిరి. అంతే కాకుండా సీబీఐ, జిల్లా ఎస్పీలకు కూడా ఫిర్యాదు చేశారు. మొత్తానికి దస్తగిరి ఇచ్చిన ఫిర్యాదుపై ఎట్టకేలకు చైతన్య రెడ్డిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. చైతన్య రెడ్డితో పలువురు పోలీసులు అధికారులపై కూడా కేసులు నమోదు అయ్యాయి.


అయితే గతంలో దస్తగిరి ఫిర్యాదును తప్పుబట్టారు చైతన్య. కేవలం మెడికల్ క్యాంపు కోసమే జైలు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. తనతో పాటు జైలు అధికారులు, వైద్యాధికారులు ఉన్నట్లు తెలిపారు. తాను నిజంగా జైలుకు బెదిరించడానికే వెళ్లి ఉంటే అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయాలేదని అప్పట్లోనే చైతన్య రెడ్డి ప్రశ్నించారు. దస్తగిరిది అంతా క్రిమినల్ మైండ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పుడు తాజాగా పోలీసులు కేసు నమోదు చేయడం పట్ల చైతన్య రెడ్డి ఏ మేరకు స్పందిస్తారో చూడాలి. మరోవైపు దస్తగిరిని బెదిరించారంటూ ఆరోపణలు ఎదుర్కుంటున్న చైతన్య రెడ్డికి గతంలో సుప్రీం కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది.


ఇవి కూడా చదవండి..

తిరుమల వెళ్లేవారికి గుడ్‌న్యూస్ ..

Breaking News: ఉత్తరాంధ్ర వాసులకు కేంద్రం శుభవార్త..

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 05 , 2025 | 02:14 PM