Share News

AP Govt Serious on Peddireddy: పెద్దిరెడ్డిపై చర్యలకు సర్కార్ సిద్ధం...

ABN , Publish Date - Jan 29 , 2025 | 10:47 AM

AP Govt: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై యాక్షన్‌కు సిద్ధమైంది ఏపీ సర్కార్. పెద్దిరెడ్డి అటవీ భూముల కబ్జాపై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రాధమిక నివేదిక చేరింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు ముందడుగులు వేస్తోంది.

AP Govt Serious on Peddireddy: పెద్దిరెడ్డిపై చర్యలకు సర్కార్ సిద్ధం...
Peddireddy Ramachandrareddy

అమరావతి, జనవరి 29: చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Former Minister Peddireddy Ramachandra Reddy) అటవీ భూముల భక్షణపై ప్రభుత్వం (AP Govt) సీరియస్‌గా ఉంది. పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో భూ అక్రమాలపై అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. 75 ఎకరాల అటవీ భూములు అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేరడంపై ఇప్పటికే ప్రాధమిక నివేదిక ముఖ్యమంత్రికి చేరింది. ఈరోజు సచివాలయంలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేయనున్నారు.


నేటి సమీక్షలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూ మాఫియా ఆగడాలు, తదుపరి చర్యలపై ప్రభుత్వం చర్చించనున్నారు. అటవీ భూములు ఆక్రమణ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాధమిక నివేదిక చేరింది. పుంగనూరు, తంబళ్లపల్లి, రేణిగుంట మండలంలో రికార్డుల తారుమారుతో, బినామీ పేర్లతో వందల ఎకరాల ఆక్రమణకు పాల్పడినట్లు పెద్దిరెడ్డి ఆరోపణలు ఉన్నాయి. పక్కా అధారాల సేకరణతో కఠిన చర్యలకు తీసుకునేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది.

బిగ్ అప్‌డేట్: భారీగా పెరగనున్న భూముల ధరలు..


పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో అటవీ ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి తన అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ప్రభుత్వం ప్రాజెక్టులకు ఒక్క చదరపు గజం అటవీ భూములు తీసుకోవాలన్నా ఎన్నో అనుమతులు కావాలి. కానీ ఎకరాలకొద్దీ భూములను కబ్జా చేశాడు పెద్ది రెడ్డి. అందులో విలాసవంతమైన భవనంతో పాటు వ్యవసాయ క్షేత్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతే కాదు అక్కడకు వెళ్లేందుకు ప్రభుత్వ సొమ్ముతో రోడ్డును కూడా వేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనికి సంబంధించి ప్రాథమిక నివేదిక కూడా ప్రభుత్వానికి చేరింది. పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


కాగా.. మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై అనేక భూ ఆక్రమణల ఆరోపణలు ఉన్నాయి. పుంగనూరు నియోజకవర్గంలో పెద్ది రెడ్డి అనుచరులు కూడా అనేక భూకబ్జాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. మంత్రిగా ఉన్న సమయంలో నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడినట్లు పెద్దిరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. పెద్దిరెడ్డి భూకబ్జాలపై ప్రజా దర్బార్‌లోనూ అనేక ఫిర్యాదు వచ్చాయి. రాష్ట్రంలో అనేకచోట్ల భూమి యజమానులకు తెలియకుండా రికార్డుల్లో పేర్లు ఇష్టానుసారం మార్చిన ఘటనలు అనేకం జరిగాయని, వీటిని అరికట్టాలని బాధితులు వినతిపత్రాలు కూడా సమర్పించారు.


ఇవి కూడా చదవండి...

Tirupati: తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై కేసు నమోదు.

ISRO GSLV-F15: నింగిలోకి దూసుకుపోయిన GSLV F-15 రాకెట్‌.. ప్రయోగం

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 29 , 2025 | 11:09 AM