Balaveeranjaneyaswamy: అంతా భూ దోపిడీదారులే..
ABN , Publish Date - Jan 29 , 2025 | 04:29 PM
AP Ministers: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్రను కొల్లగొట్టిన విజయసాయి ఇటీవలే రాజీనామా ప్రకటించారన్నారు. పెద్దిరెడ్డితో పాటు అందరి భూభాగోతాలు త్వరలోనే బయటకు వస్తాయని తెలిపారు.

అమరావతి, జనవరి 29: వైసీపీ నేతలు భూ అక్రమాలకు అడ్డే లేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి (Minister Dola Bala veeranjaneyaswamy) అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Former Minister Peddireddy Ramachandra Reddy) చేసిన భూ దోపిడీపై ఇవాళ బయటకు వచ్చింది కొంతే అని.. జగన్, పెద్దిరెడ్డి, సజ్జల, విజయసాయి ఇలా అంతా భూదోపిడీదారులే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రను కొల్లగొట్టిన విజయసాయి ఇటీవలే రాజీనామా ప్రకటించారన్నారు. పెద్దిరెడ్డితో పాటు అందరి భూభాగోతాలు త్వరలోనే బయటకు వస్తాయని తెలిపారు.
సూపర్ సిక్స్ హామీల్లో భాగమైన ఫించన్ పెంపు, ఉచిత సిలిండర్లు అమలు, డీఎస్సీ ప్రకటన చేయటంతో పాటు సూపర్ 6లో లేని పథకాలు అమలు జగన్‌కు కనిపించట్లేదన్నారు. జగన్‌ను నమ్మక ఆ పార్టీ నేతలే బయటకు వస్తున్నప్పుడు ఇక ప్రజలకెక్కడ నమ్మకం ఉంటుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. దేశంలో ఎవ్వరూ ఇవ్వనంత పెద్ద మొత్తంలో ఫించన్ ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అని మంత్రి డోలా అన్నారు.
Suryapet: మనవడిని రెచ్చగొట్టిన నాయనమ్మ.. సూర్యాపేట పరువు హత్య కేసులో ట్విస్ట్
అప్పుల్లోనూ చేతి వాటం: గొట్టిపాటి
అమరావతి: గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి కుటుంబం రూ.8 లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. జగన్ దుబారా, జల్సాలకు ప్రభుత్వ ధనం రూ.19,871 కోట్లు వృధా చేశారన్నారు. ప్రచార పిచ్చితో సాక్షి పత్రికకు రూ. 1,600 కోట్ల ప్రజాధనాన్ని కట్టబెట్టారని మండిపడ్డార. జగన్ రెడ్డి బొక్కేసిన ఎగ్ పఫ్‌ల ఖర్చే అక్షరాలా రూ. 3 కోట్లు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ చాలవన్నట్లు అభివృద్ధి పేరుతో చేసిన అప్పుల్లోనూ చేతి వాటం చూపారన్నారు. రూ. పది లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని జగన్ రెడ్డి సర్వనాశనం చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరోగ్య శ్రీ, ధాన్యం బకాయిలు, ఫీజ్ రియంబర్స్‌మెంట్‌కు జగన్ ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 22 వేల కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపుపాలన కారణంగా రాష్ట్రానికి అప్పులు కూడా పుట్టని దుస్థితి దాపురించిందన్నారు. జగన్ రెడ్డి చేసిన అప్పులకు కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ. 71 వేల కోట్లు అసలు, వడ్డీ చెల్లించాల్సి వస్తోందని మంత్రి చెప్పుకొచ్చారు.
ఆ అప్పులు ఎందుకు చేశారో తెలీదు: జీవీ
పల్నాడు జిల్లా: జగన్ స్వార్థ రాజకీయం కోసం రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శలు గుప్పించారు. 2014-19లో సీఎంగా చంద్రబాబు వేసిన పునాదులను కుప్పకూల్చిన విధ్వంసకారి జగన్ అంటూ మండిపడ్డారు. రూ.10.50 లక్షల కోట్ల అప్పులు ఎందుకు తెచ్చారో... ఏం చేశారో కూడా తెలియని దుస్థితి నెలకొంది. అప్పులు, పెండింగ్ బకాయిలతో జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారన్నారు. బడ్జెట్ 3 లక్షల కోట్లు అయితే జగన్ అప్పులకు ఏడాదికి 71 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. విలాసాలు, సొంత పత్రిక, టీవీకి ప్రకటనలు, పార్టీ అవసరాలకు రాష్ట్రాన్ని దివాళా తీయించారన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ, ధాన్యం బకాయిలు చెల్లించింది తమ ప్రభుత్వం కాదా అని జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి...
ISRO GSLV-F15: నింగిలోకి దూసుకుపోయిన GSLV F-15 రాకెట్.. ప్రయోగం
ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా.. షెడ్యూల్ ఇదే..
Read Latest AP News And Telangana News And Telugu News