Home » Dola Sree Bala Veeranjaneya Swamy
జగన్ ప్రభుత్వంలో అందర్నీ మోసం చేశారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అంకితభావంతో ఉందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.
Andhrapradesh: ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతోందని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను మంత్రి పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు.
జగన్ ప్రభుత్వంలో భూ కబ్జాలు , విధ్వంసాలు, గంజాయి మత్తు పదార్థాలు బాగా పెరిగిపోయాయని.. కూటమి ప్రభుత్వం అన్నింటికీ అడ్డు కట్ట వేసిందని మంత్రి బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. తొలిసారిగా విశాఖపట్నంలో జిల్లా సమీక్ష సమావేశం ఇవాళ(శుక్రవారం) నిర్వహించామని తెలిపారు.
Andhrapradesh: జగన్ ఖాళీగా కూర్చోలేక ప్రభుత్వంపై కాలుష్యం చిమ్ముతున్నారు. అన్న క్యాంటీన్ రద్దు చేసి పేదల నోటి కాడి కూడు లాగేసిన జగన్.. చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు ఎగ్గొట్టారనటం సిగ్గుచేటు. ఐదేళ్లలో బటన్ నొక్కుడు పేరుతో ప్రజలకు ఇచ్చినదాని కంటే జగన్ బొక్కిందే ఎక్కువని మంత్రి డోలా విమర్శించారు.
తిరుమల పర్యటన రద్దు చేసుకున్న మాజీ సీఎం జగన్పై ఏపీ సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే వైసీపీ అధినేత జగన్ పర్యటన రద్దు చేసుకున్నారని మంత్రి ఆరోపించారు.
పింఛన్ రూ. 1000 పెంచడానికి జగన్కి ఐదేళ్లు పట్టిందని.. ఒక్క సంతకంతో రూ. 3 వేలు పింఛన్ చంద్రబాబు రూ. 4 వేలు చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. 100 రోజుల్లోనే పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
Andhrapradesh: జగన్మోహన్ రెడ్డి ఒక ఫేక్ ముఖ్యమంత్రి అంటూ మంత్రి డోలా ఆంజనేయులు వ్యాఖ్యలు చేశారు. జగన్ను నమ్ముకుని చాలా మంది వలంటరీ ఉద్యోగాలకు వచ్చారన్నారు. ఆగస్టు 2023 నుంచి వలంటీర్లను ఎక్కడ రెన్యూవల్ చేయలేదని తెలిపారు.
విజయవాడలో వరద వస్తే తాము దగ్గరుండి పనిచేశామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. కాలువ కట్టల మీద మట్టిని కూడా వైసీపీ నాయకులు దోచుకెళ్లారని అన్నారు. విజయవాడ వరద పాపం జగన్దేనని విమర్శించారు.
వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. నాగార్జున యూనివర్సిటీలో జరిగిన సాంఘిక సంక్షేమ శాఖ వర్క్ షాప్లో గురువారం నాడు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పాల్గొన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నీచ రాజకీయానికి పాల్పడుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి (Bala Veeranjaneya Swamy) ఆరోపించారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి ఉన్న జగన్ పేరును ఎవరో ఆగంతకులు తొలగిస్తే వైసీపీ నేతలు నానా యాగీ చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.