NTR Death Anniversary: నా జీవితం టీడీపీకే అంకింతం..
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:41 PM
Atchannaidu: ఎన్టీఆర్ సామాన్య కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదిగారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగంలో మకుటం లేని మహారాజుల ఎదిగారని తెలిపారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ఎన్టీఆర్ అధికారంలోకి తీసుకు రాగలిగారని.. బీసీలకు రాజకీయ అవకాశం కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.

అమరావతి, జనవరి 18: టీడీపీ కేంద్ర కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి (NTR Death Anniversary) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి అనిత (Vangalapudi Anita), మంత్రులు అచ్చెన్నాయుడు (Atchannaidu), పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంపును మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సామాన్య కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదిగారన్నారు. ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగంలో మకుటం లేని మహారాజుల ఎదిగారని తెలిపారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ఎన్టీఆర్ అధికారంలోకి తీసుకు రాగలిగారని.. బీసీలకు రాజకీయ అవకాశం కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.
దేశంలో సంక్షేమం అనే పదం పుట్టింది ఎన్టీఆర్ నోటి నుంచే అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో పటేల్ పట్వారి వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించింది ఎన్టీఆర్ అని తెలిపారు. ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఒక ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడైన ఎన్టీఆర్ ఆనాడు దేశంలో ఉన్న పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చారని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను పునికి పుచ్చుకొని చంద్రబాబు పార్టీని నడిపిస్తున్నారన్నారు. ‘‘నాకు ప్రాణం తెలుగుదేశం పార్టీ. నా జీవితం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి అంకితం’’ అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
NTR Death Anniversary: సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ ఎన్టీఆర్‌కు ఎన్నో రికార్డ్స్..
ఎన్టీఆర్ పేరెత్తని పార్టీ లేదు: అనిత
సినిమా రంగంలో రాముడైనా.. రావణాసురుడైనా ఎన్టీఆర్ అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మహిళలు అన్నగా పిలిచిన... ఆరాధ్య దైవంగా పిలిచిన అన్న ఎన్టీఆర్ అని తెలిపారు. సినిమా రంగంలో నటన ఎన్టీఆర్‌కు తెలుసుగాని... రాజకీయరంగంలో నటన అనేదే ఎన్టీఆర్‌కు తెలియదన్నారు. కోటి దాటినా పార్టీ సభ్యత్వ నమోదుతో తాత ఎన్టీఆర్‌కు లోకేష్ నిజమైన నివాళులర్పించారని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ పేరు ఎత్తకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించలేదన్నారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి ఒడిదుడుకులు ఎదురవుతున్న చంద్రబాబు నడిపిస్తూనే వస్తున్నారన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం చంద్రబాబు, లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని హోంమంత్రి అనిత వెల్లడించారు.
పెదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు ఎన్టీఆర్: మంత్రి నిమ్మల
విజయవాడ: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి మంత్రి నిమ్మల రామానాయుడు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించి, ఎన్నో సంక్షేమ పధకాలకు ఆధ్యుడు అన్న ఎన్టీఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన గొప్ప దార్శనికుడు ఎన్టీఆర్ అని తెలిపారు. రాయలసీమ ప్రాంతానికి తాగు, సాగు నీరందించేలా ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించారన్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టాలన్న లక్ష్యంతో రెండు రూపాయలకే కిలో బియ్యం పధకం తీసుకొచ్చి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. మహిళలకు ఆస్తిలో వాటా హక్కు కల్పించి ఆడపడుచులకు పెద్దన్నగా నిలిచారన్నారు. బలహీన వర్గాలకు చట్ట సభల్లో ఎక్కువ సీట్లు కేటాయించడమే కాకుండా అన్ని వర్గాల వారికి తగిన ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. రాజకీయాల్లో యువతకు పెద్దపీట వేసి ఎంతో మంది నాయకులను తయారు చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
సింగపూర్‌లో రెండో రోజు.. సీఎం రేవంత్ ఎవరెవరిని కలిశారంటే
Tirumala: తిరుమలలో తమిళనాడు భక్తుల నిర్వాకం.. భద్రతలో డొల్లతనం
Read Latest AP News And Telugu News