Share News

YS Sharmila: అప్పుడు కనబడలేదా ఆర్థిక భారం.. షర్మిల ఫైర్

ABN , Publish Date - Jan 28 , 2025 | 02:37 PM

YS Sharmila: నీతి ఆయోగ్ రిపోర్ట్ ముందుపెట్టి, డబ్బులుంటేనే పథకాలని నీతి సూక్తులు చెప్పారని సీఎం చంద్రబాబు‌ను వైఎస్ షర్మిల విమర్శించారు. పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలట.. మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టినట్లుంది చంద్రబాబు తీరు ఉందని అన్నారు. నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 లక్షల మంది అన్నదాతలను వంచించారని..80 లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారన్నారు.

YS Sharmila: అప్పుడు కనబడలేదా ఆర్థిక భారం.. షర్మిల ఫైర్
APCC Chief YS Sharmila Reddy

విజయవాడ, జనవరి 28: ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై (AP CM Chandrababu Naidu) ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) మరోసారి విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను గుర్తుచేస్తూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... సూపర్ సిక్స్ - సూపర్ ఫ్లాప్ అయిందంటూ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లే .. చంద్రబాబు నిన్నటి ప్రజెంటేషన్ ఇందుకు నిదర్శనం అంటూ కామెంట్స్ చేశారు.


నీతి ఆయోగ్ రిపోర్ట్ ముందుపెట్టి, డబ్బులుంటేనే పథకాలని నీతి సూక్తులు చెప్పారని విమర్శించారు. పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలట.. మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టినట్లుంది చంద్రబాబు తీరు ఉందని అన్నారు. నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 లక్షల మంది అన్నదాతలను వంచించారని..80 లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారన్నారు. కోటిన్నర మంది మహిళలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. 50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారని అన్నారు.పథకాలకు ఆర్థిక వెసులుబాటు లేదని, వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసమే కారణమని, జగన్ ఆర్థిక ఘోరమే నిదర్శనమని చెప్పే బాబు.. ఎన్నికల్లో హామీలు ఇచ్చే ముందు తెలియదా ఈ ఆర్థిక విధ్వంసం, ఘోరం అన్ని ప్రశ్నించారు. ‘‘సూపర్ సిక్స్’’ పథకాల రూపకల్పనలో కనపడలేదా రాష్ట్ర ఆర్థిక భారం అని నిలదీశారు.

రైతులకు శుభవార్త.. మళ్లీ ఖాతాల్లోకి డబ్బులు


రాష్ట్రం రూ.14 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చెప్పింది మీరే. కూటమిని గెలిపిస్తే 100 రోజుల్లో గాడిన పెడతామన్నది మీరే అని గుర్తుచేశారు. తీరా ఓట్లు పడ్డాక ఇచ్చిన హామీలపై మడతపేచీ పెట్టడం ఎంతవరకు సమంజసమని అడిగారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని, అప్పులు పుట్టడం లేదని సాకులు వెతకడం మాని పథకాల అమలుపై దృష్టి పెట్టాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే తమరు.. రాష్ట్ర దీనస్థితిపై ప్రధాని మోడీని పట్టుబట్టాలన్నారు. పథకాలకు కావాల్సిన నిధులు ఇవ్వాలని అడగాలన్నారు. నీతి ఆయోగ్ చెప్పినట్లుగా గత ఐదేళ్లళ్ల వైసీపీ పాలనలో జరిగిన ఆర్థిక అరాచకంపై వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆదాయం ఏ కోటకు మళ్ళిందో తేల్చాలన్నారు. పథకాలకు కేంద్రం డబ్బులివ్వకపోతే వెంటనే బీజేపీకి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

TDP on Tulasibabu: ఆ ఆరోపణల్లో నిజం లేదు.. తులసిబాబు వ్యవహారంపై టీడీపీ

ఉదయం 10 తర్వాత తత్కాల్ బుకింగ్ పనిచేయదు..!

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 02:41 PM