CII on Budget 2025: దేశానికి ప్రోత్సాహకంగా బడ్జెట్.. సీఐఐ రియాక్షన్
ABN , Publish Date - Feb 01 , 2025 | 01:52 PM
CII on Budget 2025: న్యూ ఇన్‌కమ్‌ట్యాక్స్ బిల్లు మిడిల్ క్లాస్‌కు ఉపయోగపడుతుందని.. ఇది పెద్ద విప్లవమే అని చెప్పాలన్నారు. సీఐఐ చైర్మన్ డీవీ రవీంద్రనాధ్ అన్నారు. కేంద్ర వార్షిక బడ్జెట్‌పై సీఐఐ స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

విజయవాడ, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్ 2025 (Union Budget 2025)పై కాన్ఫిడిరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (Confederation of Indian Industries) స్పందించింది. బడ్జెట్‌లో చాలా అంశాలు దేశానికి ప్రోత్సాహకంగా ఉందని సీఐఐ చైర్మన్ డీవీ రవీంద్రనాధ్ (CII Chairman DV Ravindranath) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. న్యూ ఇన్‌కమ్‌ట్యాక్స్ బిల్లు మిడిల్ క్లాస్‌కు ఉపయోగపడుతుందని.. ఇది పెద్ద విప్లవమే అని చెప్పాలన్నారు. ఈరోజు 12 లక్షల వరకూ ఇన్‌కమ్‌ట్యాక్స్ లేకపోవడం చాలా మంచి పరిణామమని చెప్పుకొచ్చారు. టీడీఎస్ సీనియర్ సిటిజన్స్‌కు 2.5 నుంచి 6 లక్షలకు పెంచారని డీవీ రవీంద్రనాథ్ తెలిపారు.
ఆ నిర్ణయం శుభపరిణాం: లక్ష్మీప్రసాద్
బడ్జెట్ వ్యవసాయ రంగానికి గొప్ప ఊతం ఇచ్చేలా ఉందని సీఐఐ మాజీ చైర్మన్ లక్ష్మీప్రసాద్ అన్నారు. గ్రామాల్లో మహిళలకు ఉపాది కల్పించేలా బడ్జెట్ ఉందన్నారు. పప్పుధాన్యాలలో ఆత్మనిర్భర్‌గా మారేలా చర్యలు తీసుకున్నారన్నారు. ఆయిల్ సీడ్స్‌ను ప్రోత్సహించేలా చర్యలు ఉన్నాయన్నారు. బిహర్‌లో మఖానా బోర్డు పెట్టాలని నిర్ణయించారని అది మంచి పరిణామమని తెలిపారు. కాటన్ విషయంలో ఇంపోర్టులు తగ్గించి లోకల్‌గా హైఈల్డింగ్ వెరైటీలు తేవాలని మేజర్ ఫండింగ్ చేస్తున్నారన్నారు. చేపలు, రొయ్యల ఎక్సపోర్టుకు ఐదేళ్ల మిషన్ ఇచ్చారని తెలిపారు. ఈ రంగంలో 60 వేల కోట్ల వరకూ ఎక్స్‌పోర్టు రీచ్ అయ్యే వరకూ ఎంకరేజ్ చేస్తామన్నారని చెప్పారు. కిషాన్ క్రెడిట్ కార్డులకు 3 లక్షల నుంచి 5 లక్షలు వరకూ పెంచారన్నారు. యూరియా దిగుమతిని తగ్గించి ఇక్కడే ఉత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమన్నారు. 10 లక్షల వెరైటీలతో జీన్ బ్యాంకు ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం చాలా మంచిదన్నారు. ఇది బయోటెక్నాలజీకి సంభందించి మంచి నిర్ణయమని లక్ష్మీ ప్రసాద్ వెల్లడించారు.
రూ. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు
అంతర్జాతీయ స్థాయిలో స్కిల్ వర్సిటీలు మంచిదే: డి.రామకృష్ణ
ఎంఎస్ఎంఈ లో రెండు అంశాలను ప్రధానంగా కవర్ చేశారని మాజీ సీఐఐ చైర్మన్ డి.రామకృష్ణ అన్నారు. స్టార్టప్‌కు క్రెడిట్ గ్యారెంటీ స్కీం, లోన్స్ విషయంలో సానుకూలంగా ఉన్నారన్నారు. ఫుట్ వేర్, టాయిస్, ఫుడ్ వంటివి అభివృద్దికి స్కిల్ యూనివర్సిటీలు అంతర్జాతీయ స్థాయిలో తెస్తామనడం మంచిదే అని చెప్పారు. ఏఐని అగ్రికల్చర్, హెల్త్‌లలో ఎలా అప్లై చేయాలని అనే ప్లాన్ ఉన్నట్టు చెప్పారన్నారు. అయితే ఈ సారి బడ్జెట్ మొత్తంగా కాస్తా డిసప్పాయింట్‌మెంట్ ఉందన్నారు. 40 శాతం యువతకు ఉద్యోగాలు లేవని.. వారికి స్కిల్ పెంచి మెయిన్ స్ట్రీంలోకి తేవాలి అనేది ముఖ్యమన్నారు. ఎయిర్ పోర్టులు పెంచడంతో పాటు ఇతర ఇన్‌ఫ్రాస్ట్రచ్చర్ పైనా మాట్లాడడం మంచిదే అని రామకృష్ణ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Wine Shops: వైన్‌షాపుల కోసం దరఖాస్తు చేసుకోండి
పండుగ లాంటి వార్త.. 12 లక్షల వరకు నో ట్యాక్స్
Read Latest AP News And Telugu News