Share News

Sanjay: సంజయ్ సస్పెన్షన్‌పై సర్కార్ కీలక నిర్ణయం

ABN , Publish Date - Jan 31 , 2025 | 02:24 PM

Sanjay: మాజీ సీఐడీ డీజీ సంజయ్ సస్పెన్షన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంజయ్ సస్పెన్షన్‌పై నియమించిన కమిటీ ఇటీవల భేటీ అయ్యింది. సంజయ్‌పై సస్పెన్షన్ పొడిగించాలని కమిటీ నిర్ణయించింది.

Sanjay: సంజయ్ సస్పెన్షన్‌పై సర్కార్ కీలక నిర్ణయం
Former CID DG Sanjay

అమరావతి, జనవరి 31: సీఐడీ మాజీ డీజీ, ఐపీఎస్ అధికారి సంజయ్‌పై (Former CID DG Sanjay) సస్పెన్షన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఏడాది మే 31 వరకు సస్పెన్షన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సంజయ్ సస్పెన్షన్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. సంజయ్ సస్పెన్షన్‌పై నియమించిన కమిటీ ఇటీవల భేటీ అయ్యింది. సంజయ్‌పై సస్పెన్షన్ పొడిగించాలని కమిటీ నిర్ణయించింది. దీంతో సంజయ్ సస్పెన్షన్‌ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


సీఐడీ మాజీ చీఫ్‌గా, అగ్నిమాపకశాఖ డీజీగా ఉన్న సమయంలో పలు అవకతవకలకు పాల్పడ్డారని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇచ్చిన నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఆయన కేసును ఏసీబీకి అప్పగించింది. కేసు నమోదు చేసిన ఏసీబీ ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని నివేదిక ఇవ్వడంతో పాటు ఆయనపై క్రిమినల్ కేసును నమోదు చేసింది. దీంతో సంజయ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన సస్పెన్షన్‌ను కేంద్రహోంమంత్రిత్వ శాఖ కూడా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో సంజయ్ సస్పెన్షన్‌పై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సమావేశమై.. ఆయన సస్పెన్షన్‌ను పొడిగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మే 31 వరకు పొడిగిస్తూ కమిటీ సిఫార్సు చేసిన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. కాసేపటి క్రితమే సంజయ్ సస్పెన్షన్‌ను పొడిగిస్తూ ఆర్డర్స్ పాస్ చేసింది సర్కార్.


ఇవి కూడా చదవండి...

Varra Ravinder Case: పులివెందులకు వర్రా రవీంద్రారెడ్డి కేసు

Online Game: ఆన్‌లైన్ గేమ్ ఎంతపని చేసిందంటే.. చివరకు కన్నతల్లిని కూడా

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 31 , 2025 | 02:31 PM