MLA: గన్‌మ్యాన్ లేకుండానే ప్రజల వద్దకు ఎమ్మెల్యే..
ABN , Publish Date - Jan 30 , 2025 | 02:42 PM
AP MLA: ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ప్రజల వద్దకు వెళ్లారు ఎమ్మెల్యే. బైక్‌పై వీధుల్లో తిరుగూతూ ప్రజలతో ముచ్చటించారు. ద్విచక్రవాహనంపై తిరుగుతున్న ఎమ్మెల్యేను వీడియో తీసిన కొందరు వాహనదారులు దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

కృష్ణా, జనవరి 30: ఎమ్మెల్యే అంటేనే ఆయన చుట్టూ గన్‌మెన్‌లు, వ్యక్తిగత సిబ్బంది, కార్యకర్తలు ఉంటారు. ఎక్కడికి వెళ్లిన ఆయన వెంట భద్రతా సిబ్బంది ఖచ్చితంగా ఉంటారు. ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి పనులు చేసినా, ప్రజలను కలిసినా మీడియాలో వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఎమ్మెల్యే మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ప్రజల వద్దకు వెళ్లారు ఎమ్మెల్యే. బైక్‌పై వీధుల్లో తిరుగూతూ ప్రజలతో ముచ్చటించారు. ద్విచక్రవాహనంపై తిరుగుతున్న ఎమ్మెల్యేను వీడియో తీసిన కొందరు వాహనదారులు దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే.. బైక్‌పై తిరుగుతూ ఆయన చేసిన పనులేంటో ఇప్పుడు చూద్దాం.
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘‘ప్రజలారా ప్రశ్నించండి... మీరు ఎన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుందంటూ’’ ద్విచక్ర వాహనంపై గుడివాడ వీధుల్లో తిరిగారు ఎమ్మెల్యే. గన్ మ్యాన్, వ్యక్తిగత సిబ్బంది లేకుండానే రాము పర్యటించారు. రోడ్ల వెంబడి చిరు వ్యాపారులు, దుకాణదారులు, టీ స్టాల్స్, హోటళ్లకు వెళుతూ ప్రజలతో మాట్లాడారు. రాము వెంట ఆఖరికి మీడియాను గాని అధికారులను కానీ ఎవరిని రానివ్వకుండా ప్రత్యక్షంగా ప్రజల వద్దకు వెళ్లి వాళ్లతో ముచ్చటించారు.. ‘‘ నన్ను ఎన్నుకున్న మీకు నాకు మధ్య.. మధ్యవర్తులు ఉండరు’’ అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలతో నేరుగా మాట్లాడేందుకే వెళుతున్నా అంటూ మీడియాకు తెలియజేశారు. తాను అడిగిన ప్రశ్నలకు ప్రజలు సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తున్నారన్నారు. గుడివాడలో కొన్ని వర్గాల నుంచి టీడీపీకి చెందినవారు డబ్బులు వసూలు చేస్తున్నారనే ప్రచారంపై ప్రజలను నేరుగా ప్రశ్నించినట్లు తెలిపారు. అనేక ప్రాంతాల్లో తిరిగిన తనకు అలాంటిదేం లేదని ప్రజలు నేరుగా చెప్పారని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు.
వాట్సప్ గవర్నెన్స్ సేవల నెంబర్ ఇదే..
ఎమ్మెల్యే రాము పర్యటనలో హైలెట్స్ ఇవే..
తమ తమ ప్రాంతంలో అధికారులు కానీ, రాజకీయపక్షాలు కానీ ఎక్కడైనా అవినీతికి అక్రమాలకు పాల్పడితే తక్షణమే సమాచారం ఇవ్వాలని కలిసిన ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యే రాము పర్యటనకు సంబంధించి వీడియోలను వాహనదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. ప్రధాన రహదారులతో పాటు రైతు బజార్లోనూ రాము తిరిగారు. విషయం తెలుసుకున్న వెంటనే మీడియా ప్రతినిధులు రైతు బజార్‌కు చేరుకున్నారు. ‘‘గుడివాడ అభివృద్ధికి మీకేం కావాలి నేనేం చేయాలి నేరుగా నాతో చెప్పండనీ ప్రజలతో అన్నారు ఎమ్మెల్యే. నేరుగా మీ సమస్యలు ఇబ్బందులు నాకు తెలియచేయండి. మీ ప్రాంతంలోని అపరిస్కృత సమస్యలను తెలియజేసి వెంటనే వాటి పరిష్కారానికి నాంది పలకాలి’’ అని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కోరారు.
ఇవి కూడా చదవండి...
Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు
AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ
Read Latest AP News And Telugu News