Home » Venigandla Ramu
‘పిచ్చి వాగుడు మానుకో.. నోరు అదుపులో పెట్టుకో.. లేదంటే తరిమి తరిమి కొడతారు.’ ఇదీ మాజీ మంత్రి కొడాలి నానికి టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇచ్చిన మాస్ వార్నింగ్. తాజా ప్రెస్‌మీట్‌లో సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత కొడాలి నాని విమర్శలు చేయడంపై ...
విశ్వసనీయత లేని వైకాపా నేతలు మూర్ఖపు మాటలు ఆపకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఎన్నడూ లేని విధంగా వరదల్లో మునిగి గుడివాడ ప్రజలు అష్టకష్టాలూ పడినప్పుడు ఎక్కడి పోయావు కొడాలి నాని అంటూ మండిపడ్డారు.
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా తెలుగు దేశం పార్టీ నుంచి మంచి మెజారీటితో గుడివాడ నియోజక వర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన అట్లాంటాకు చెందిన ప్రవాసాంధ్రుడు వెనిగండ్ల రాము.. తన గెలుపునకు సహకరించిన ప్రవాసాంధ్ర మిత్రులకు ధన్యవాదములు తెలిపారు.
గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. కొడాలి నాని నివాసం వద్దనున్న భద్రత సిబ్బందితోపాటు ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందిని తొలగించారు. ఈ మేరకు గురువారం ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
తమను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలు, అధికారులు ఏ కలుగులో దాక్కున్న వారి లెక్కలు తెలుస్తామని ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము (Venigandla Ramu) హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలు చూసి తాను అమెరికా వెళ్లిపోతానని కొడాలి నాని (Kodali Nani) అనలేదా అని ప్రశ్నించారు.
అవును.. మీరు వింటున్నది నిజమే మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని (Kodali Nani) పోలింగ్ తర్వాత తీవ్ర ఆవేదన చెందుతున్నారట. ఎందుకంటే.. ఎన్నికల్లో (AP Elections) ఓటర్లకు పంచాల్సిన డబ్బులు కొందరు నాని మనుషులు కాజేశారన్నది.. ఇప్పుడు నియోజకవర్గంలో నడుస్తున్న చర్చ. సొంత పార్టీ నేతలే ఇలా చేయడంతో కొడాలి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట..
గతంలో ఎవరిని పడితే వారిని బూతులతో విమర్శించి.. నేడు అత్యంత సౌమ్యుడిలా భక్తులకు వరాలిచ్చే బాబాలా మారిపోయారు. ఆయన అడుగేస్తే పాలాభిషేకాలు, పాదాభివందనాలు, పూల రహదారులే..!
కుమారి ఆంటీ.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. రాత్రికి రాత్రి ఆమె ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత నుంచి ఆమె తరచు సోషల్ మీడియాలో అడపా దడపా కనిపిస్తున్నారు. అయితే కుమారి ఆంటీ తాజాగా గుడివాడలో ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా (AP Elections) అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లాలోని గుడివాడ (Gudivada) ఒకటి. ప్రధాన పార్టీ అభ్యర్థులిద్దరూ ఆర్థిక, అంగబలాల్లో సమాన స్థాయిలో ఉండడంతో గుడివాడ పోరు ఆసక్తి రేపుతోంది. వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అలియాస్ నాని (Kodali Nani), టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా ఎన్నారై వెనిగండ్ల రాము (Venigandla Ramu) పోటీ చేస్తున్నారు..
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani) గూబ గుయ్యి మనేలా ఈ ఎన్నికల్లో ఫలితాలు వస్తాయని గుడివాడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము (Venigandla Ramu) అన్నారు. ఈ ఎన్నికల్లో నాని ఘోరంగా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరారు. టీడీపీలో 100మంది పండ్ల వర్తక సంఘ వ్యాపారులు, వైసీపీ కార్యకర్తలు చేరారు.