TDP: స్కిల్ కేసులో సుప్రీం తీర్పుపై టీడీపీ నేతల రియాక్షన్
ABN , Publish Date - Jan 15 , 2025 | 03:17 PM
TDP Leaders: స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడంపై టీడీపీ నేతలు స్పందించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసుపై హైకోర్టు ఇచ్చిన బెయిల్‍ను రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లి వైసీపీ భంగపడిందని టీడీపీ లీగల్ సెల్ పేర్కొంది.
అమరావతి, జనవరి 15: స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు (Supreme Court) కొట్టివేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ వర్గాలు స్పందిస్తూ.. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలనుకున్న వైసీపీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైందన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి సీనియర్ లాయర్లను నియమించినా సుప్రీంకోర్టులో వైసీపీ భంగపాటుకు గురైందని టీడీపీ వర్గాలు వ్యాఖ్యలు చేశాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసుపై హైకోర్టు ఇచ్చిన బెయిల్‍ను రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లి వైసీపీ భంగపడిందని టీడీపీ లీగల్ సెల్ పేర్కొంది.
ఛార్జి సీటు ఫైల్ అయి టెక్నికల్ గ్రౌండ్స్‌లో రిటర్న్ అయి, బెయిల్ కూడా వచ్చి ఏడాదిన్నర దాటిందని ఈ సందర్భంగా తెలుగు దేశం నేతలు గుర్తు చేశారు. అందువలనే ఇంటర్ లోకేటరీ పిటిషన్‌పై వాదనలు వినడానికి కూడా ధర్మాసనం ఇష్టపడలేదని టీడీపీ న్యాయవాదులు పేర్కొన్నారు. అక్రమ కేసు పెట్టడమే కాకుండా అక్రమ కేసులో బెయిల్ రద్దుకు కూడా తెగించిన వైసీపీ అనుకూల నేతల కుట్రలను సుప్రీంకోర్టు చిత్తు చేసిందని వ్యాఖ్యలు చేశారు.
Manchu Manoj: మంత్రి లోకేష్‌తో మంచు మనోజ్ భేటీ
అత్యున్నత న్యాయస్థానం ముందు వైసీపీ నవ్వులు పాలయిందని, వ్యాజ్యంలో సంబంధం లేని వ్యక్తులు తల దూర్చడానికి వీల్లేదని నిర్ద్వందంగా సుప్రీం కోర్టు తిరస్కరించిందని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. ఇది రాష్ట్రానికి అక్రమ కేసులో అన్యాయంగా ఇరికించబడ్డ వ్యక్తి స్వేచ్ఛకు సంబంధిచిన విషయమని.. ఈ కేసుతో మీకేం సంబంధమని వ్యాజ్యం దాఖలు చేసిన వారిని ధర్మాసనం సూటిగా ప్రశ్నించిందన్నారు. ప్రభుత్వ అధినేత అయి కూడా కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి తన పలుకుబడిని ఉపయోగించి కేసును ఉపసంహరించే ప్రయత్నం చేయటం లేదు కదా అని పిటిషనర్‌ను సూటీగా సుప్రీం కోర్టు ప్రశ్నించిందని టీడీపీ నేతలు గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి...
Supreme court: సుప్రీంలో చంద్రబాబుకు భారీ ఊరట
కుంభమేళాకు వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
Read Latest AP News And Telugu News