Share News

TDP on Tulasibabu: ఆ ఆరోపణల్లో నిజం లేదు.. తులసిబాబు వ్యవహారంపై టీడీపీ

ABN , Publish Date - Jan 28 , 2025 | 09:51 AM

TDP: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కామేపల్లి తులసిబాబును పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే తులసిబాబు... గుడివాడ ఎమ్మెల్యే అనుచరుడిగా ఉంటూ సమాంతరంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ స్పందించింది.

TDP on Tulasibabu: ఆ ఆరోపణల్లో నిజం లేదు.. తులసిబాబు వ్యవహారంపై టీడీపీ
TDP Leader Palla Srinivas Rao

అమరావతి, జనవరి 28: గుడివాడలో కామేపల్లి తులసిబాబు (Kamepalli Tulasibabu) వ్యవహారాలపై తెలుగుదేశం పార్టీ (TDP) స్పందించింది. గుడివాడలో ఎమ్మెల్యే రాము అనచరుడిగా తులసిబాబు సమాంతర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు (AP TDP Chief Palla Srinivas Rao) స్పందించారు. తులసిబాబుకు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్, అప్పటి నర్సాపురం ఎంపీగా రఘురామకృష్ణంరాజు ఉన్న సమయంలో ఏపీ సీఐడీ ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో ఇటీవల తులసిబాబును ఒంగోలు ఎస్పీ అరెస్ట్ చేశారు.


ఆర్‌ఆర్‌ఆర్ గుండెలపై కూర్చుని హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ తులసిబాబుపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసు విచారణలో భాగంగా తులసిబాబును ఒంగోలుకు పిలిపించి విచారణ అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా తులసిబాబు అనుచరులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని తులసీదళం పేరుతో పోలీసులపై దౌర్జన్యంగా వ్యవహరించారంటూ మరో కేసు నమోదు అయ్యింది. ఆర్‌ఆర్‌ఆర్ టార్చర్ కేసులో ప్రస్తుతం తులసిబాబు గుంటూరు జిల్లా జైలులో ఉన్నాడు. అలాగే తులసిబాబుకు బెయిల్‌ ఇవ్వాలంటూ పిటిషన్‌ వేశారు. ఈ నేపథ్యంలో తులసిబాబును మూడు రోజుల పాటు పోలీస్‌ కస్టడీకి ఇస్తూ గుంటూరు జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిన్న తొలి రోజు తులసిబాబును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కొద్దిసేపు విచారించారు. తిరిగి ఈరోజు, రేపు కూడా రెండు రోజుల పాటు తులసిబాబును ఒంగోలు ఎస్పీ విచారించనున్నారు.

ఇళ్ల స్థలాలపై సర్కార్ కీలక ఉత్తర్వులు..


అయితే గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు తులసిబాబు అనుచరుడిగా ఉండేవాడని.. ఎమ్మెల్యేకు సమాంతరంగా కార్యకలాపాలు నిర్వహించేవారంటూ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో పల్లా శ్రీనివాసరావు స్పందిస్తూ దానిపై స్పష్టత ఇచ్చారు. టీడీపీకి తులసిబాబుకు ఎలాంటి సంబంధం లేదని, పార్టీలో ఆయనకు ఎటువంటి పదవులు లేవని టీడీపీ ప్రకటించింది.


ఇవి కూడా చదవండి...

CI Corruption: సీఐ భుజంగరావు అవినీతిపై ఏబీఎన్ చేతిలో కీలక ఆధారాలు..

‘భరోసా’ పడిందోచ్..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 09:56 AM