Share News

Srinivasa Varma: ఆ నిర్ణయం చారిత్రాత్మకం.. బడ్జెట్‌పై కేంద్రమంత్రి

ABN , Publish Date - Feb 01 , 2025 | 04:46 PM

Srinivasa Varma: కేంద్ర బడ్జెట్‌పై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పందించారు. జలజీవన్ మిషన్ పథకాన్ని పొడిగించి ఏపీకి ప్రయోజనం కల్పించిందన్నారు. ఉద్యోగ వర్గాలకు రూ. 12.75 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని... ఇది చరిత్రాత్మక నిర్ణయమన్నారు. కాంగ్రెస్ హయంలో రూ 12 లక్షలు ఆదాయం ఉంటే రూ. 2 లక్షల వరకు ఆదాయపు పన్ను కట్టే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు.

Srinivasa Varma: ఆ నిర్ణయం చారిత్రాత్మకం.. బడ్జెట్‌పై కేంద్రమంత్రి
Union Minister bhupathiraju srinivas varma

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: సామాన్య మధ్యతరగతి ప్రజలకు మేలు చేసే బడ్జెట్ ఇది అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ (Union Minister Bhupathi Raju Srinivasa Varma) అన్నారు. కేంద్ర వార్షిక బడ్జెట్‌పై కేంద్రమంత్రి మాట్లాడుతూ.. సవరించిన పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) నిర్మాణ వ్యయంను ఆమోదిస్తూ బడ్జెట్‌లో ప్రస్తావన ఉందని తెలిపారు. సవరించిన అంచనా రూ.35,400 కోట్లలో ఇంకా రూ.12 వేల కోట్లు ఏపీకి ఇస్తామని బడ్జెట్ స్పష్టం చేసిందని చెప్పారు. జలజీవన్ మిషన్ పథకాన్ని పొడిగించి ఏపీకి ప్రయోజనం కల్పించిందన్నారు. ఉద్యోగ వర్గాలకు రూ. 12.75 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని... ఇది చరిత్రాత్మక నిర్ణయమన్నారు.


కాంగ్రెస్ హయాంలో రూ.12 లక్షలు ఆదాయం ఉంటే రూ. 2 లక్షల వరకు ఆదాయపు పన్ను కట్టే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బ్యాటరీలు భారత్‌లోనే తయారుచేసేలా ప్రోత్సాహకాలు ఇచ్చిందని... తద్వారా దిగుమతి భారం తగ్గుతుందన్నారు. ఇంకా అనేక రంగాలకు ప్రాధాన్యత దక్కిందన్నారు. హెవీ ఇండస్ట్రీస్‌కు రూ. 7,300 కోట్లు బడ్జెట్ కేటాయింపులు జరిగాయని... ఇది గతం కంటే 57% ఎక్కువన్నారు. దేశంలో పెద్ద సంఖ్యలో ఎలెక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం కేంద్రం చేస్తోందన్నారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8,400 వేల కోట్లు, బడ్జెట్‌లో మరో రూ. 3 వేల కోట్లు కేటాయింపులు జరిగాయని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు.


మోదీ మార్క్ బడ్జెట్: లంకా దినకర్

lanka-dinakar.jpg

అమరావతి: ఇది వికసిత భారత్ మోడీ 3.0 - 50 .65 లక్షల కోట్ల బడ్జెట్ అని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు. దేశ సమ్మిళిత అభివృద్ధిని నిర్దేశించే మోడీ మార్క్ పేద, మహిళ మధ్య తరగతి బడ్జెట్ అని తెలిపారు. వ్యక్తిగత ఆదాయం పన్ను 12 లక్షల వరకు మినహాయింపు, ఉద్యోగులకు 75 వేలు స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకొని 12.75 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చిందన్నారు. రెండు స్వయం నివాస గృహాల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఇచ్చిందన్నారు. 36 రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌పైన డ్యూటీ మినహాయింపు ఇవ్వడం మంచి నిర్ణయమన్నారు. మధ్యతరగతి వర్గాల వస్తు, సేవల వినియోగం వృద్ధి రేటు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ బడ్జెట్ అంత్యోదయ స్ఫూర్తితో రూపొందించిన వికసిత భారత్ బడ్జెట్ అని చెప్పుకొచ్చారు. అతి ఎక్కువసార్లు వరుసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా నిర్మల సీతారామన్ రికార్డ్ సృష్టించారన్నారు.


రూ.10.18 లక్షల కోట్ల మూలధన వ్యయంతో ఉత్పాదక ఆస్తుల కల్పనకు ఊతం ఇస్తుందన్నారు. గ్రామాలకు కుళాయిలు ద్వారా సురక్షిత త్రాగు నీరు కోసం జల్ జీవన్ మిషన్ 2028 వరకు పొడిగింపు ఆహ్వానించ తగ్గ అంశమన్నారు. అమరావతి కోసం రూ.15 వేల కోట్లు & పోలవరం నిర్మాణం కోసం రూ.12,157 కోట్లు గత బడ్జెట్‌లో ప్రకటించిన నిధులు - ఖర్చు ఆధారితంగా ఈ సంవత్సరం విడుదల జరుగుతాయని తెలిపారు. ఈ బడ్జెట్‌లో రూ.5 ,936 కోట్లు కేటాయించడంపైన ప్రధాన మంత్రి మోడీకి, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు కృతఙ్ఞతలు తెలియజేశారు. రాజధానిలో 50 కిపైగా వివిధ కేంద్ర సంస్థల నిర్మాణం ఈ సంవత్సరంలో ప్రారంభం అవుతాయని లంకా దినకర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Wine Shops: వైన్‌షాపుల కోసం దరఖాస్తు చేసుకోండి

పండుగ లాంటి వార్త.. 12 లక్షల వరకు నో ట్యాక్స్

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 04:55 PM