Share News

Jagan Sharmila On Delimitation: పునర్విభజన‌పై జగన్, షర్మిల ఏమన్నారంటే

ABN , Publish Date - Mar 22 , 2025 | 11:55 AM

Jagan Sharmila On Delimitation: డీలిమిటేషన్‌పై వైఎస్ జగన్, షర్మిల స్పందించారు. డీలిమిటేషన్‌లో అన్యాయం జరగకుండా చూడాలని మోదీని జగన్ కోరగా... డీలిమిటేషన్ పేరుతో లిమిటేషన్ ఫర్ సౌత్‌లా చేస్తామంటే ఊరుకునేది లేదని షర్మిల స్పష్టం చేశారు.

Jagan Sharmila On Delimitation: పునర్విభజన‌పై జగన్, షర్మిల ఏమన్నారంటే
Jagana Sharmila On Delimitation

అమరావతి, మార్చి 22: డీలిమిటేషన్‌పై (Delimitation) ఓ వైపు దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరుగుతుండగా.. మరోవైపు ఇదే అంశంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy), ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila Reddy) స్పందించారు. డీలిమిటేషన్‌లో అన్యాయం జరుగకుండా చూడాలని జగన్ కోరగా.. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదని.. ప్రజల హక్కుల కోసం చేసే పోరాటమని, జనాభా ప్రాతిపదికన పునర్విభజనను అంగీకరించే ప్రసక్తే లేదని వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు.


ప్రధానికి జగన్ లేఖ..

డీలిమిటేషన్‌పై ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi) జగన్ లేఖ రాశారు. పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్‌లో అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. ఏ ఒక్క రాష్ట్రంలోనూ లోకసభ, రాజ్యసభ స్థానాలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జగన్‌మోహన్ రెడ్డి ఆదేశం మేరకు డీఎంకే పార్టీ నాయకులకు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ లీడర్ వి సుబ్బారెడ్డి లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్విభజనలో ఫెయిర్ అండ్ బ్యాలెన్స్ విధానం ఆచరించాలని లేఖలో వెల్లడించారు.

Lokesh Criticizes Jagan: మీరు వదిలేశారు.. మేం చేసి చూపిస్తున్నాం.. జగన్‌కు లోకేష్ కౌంటర్


సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది: వైఎస్ షర్మిల

జనాభా ప్రాతిపదికన సీట్లను విభజిస్తే దక్షిణాదికి జరిగేది తీరని నష్టమే అని వైఎస్ షర్మిల అన్నారు. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదని.. ప్రజల హక్కుల కోసం చేసే పోరాటమని అన్నారు. ఉత్తరాది ప్రాబల్యం మరింతగా పెరిగి.. సౌత్ రాష్ట్రాల ప్రాధాన్యతతో పనిలేకుండా పోతుందని తెలిపారు. సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది అనే పరిస్థితి ఎదురుకాక తప్పదని హెచ్చరించారు. డీలిమిటేషన్ పేరుతో లిమిటేషన్ ఫర్ సౌత్‌లా చేస్తామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజనను అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత విధానంతో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 143 సీట్లకు పెరిగితే.. దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ లాంటి ప్రధాన రాష్ట్రాల్లో పెరిగే సీట్లు 49+41+54 = 144 అని.. ఇది కాదా వివక్ష చూపడం అంటే అని ప్రశ్నించారు.


యూపీ, బీహార్ రెండు రాష్ట్రాలు కలిపితే 222 సీట్లు పెరిగితే... సౌత్ మొత్తం తిప్పి కొట్టినా 192 సీట్లకే పరిమితమవుతుందన్నారు. ఇది కాదా దక్షిణ భారతంకి జరిగే అన్యాయమని మండిపడ్డారు. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల పోరాటానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. ఐక్యంగా పోరాటం చేస్తే తప్ప నియంత మోదీకి బుద్ధి రాదన్నారు. ఏపీలో మోదీ పక్షం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మౌనం వహించడం రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్లే అని అన్నారు. ప్రజల హక్కులను కాలరాసినట్లే అని చెప్పుకొచ్చారు. డీలిమిటేషన్‌పై రాజకీయాలు పక్కన పెట్టీ టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు ముందుకు రావాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.


దక్షిణాది రాష్ట్రాల భేటీ

కాగా.. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన‌పై చెన్నై దక్షిణాది రాష్ట్రాలు సమావేశమయ్యాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాల నేతలు తరలివచ్చారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ ‌గౌడ్‌, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. కేరళ సీఎం పినరయి విజయన్‌, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి

Baroda MDGinext Mobile App: ఆ కస్టమర్ల కోసం బీవోబీ సరికొత్త ప్రయత్నం.. ఇంత అంతా సులువే

CM Chandrababu Tweet: సీఎం చంద్రబాబు సంచలన ట్వీట్.. లైట్లు ఆపేయాలంటూ..

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 22 , 2025 | 11:55 AM