Kodali Nani Health: ప్రత్యేక విమానంలో ముంబైకి కొడాలి నాని.. కారణమిదే
ABN , Publish Date - Mar 31 , 2025 | 01:00 PM
Kodali Nani Health: మాజీ మంత్రి కొడాలినానిని అత్యవసరంగా ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు. అనారోగ్యంతో కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో మాజీ మంత్రి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

అమరావతి, మార్చి 31: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిని (Former Minister Kodali Nani) మెరుగైన చికిత్స కోసం ముంబైకి (Mumbai) తరలించారు. కొద్దిరోజుల క్రితం కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. గత ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని (Hyderabad) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. గుండెకు సంబంధించిన సమస్యతో మాజీ మంత్రి బాధపడుతున్నారు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు ఆయనను తీసుకుని కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో ముంబైకు బయలుదేరి వెళ్లారు. మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించినట్లు చెబుతున్నప్పటికీ గుండె సంబంధిత వ్యాధితో పాటు ఇతర డిజీస్‌లు కూడా ఆయనకు సోనినట్లు సమాచారం.
కాగా.. హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రిలో జీర్ణకోస సంబంధిత వ్యాధితో అడ్మిట్ అయ్యారు మాజీ మంత్రి. అయితే ఆయనకు గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెకు సంబంధించి మూడు వాల్వ్స్ పూడుకుపోయినట్లు తెలుస్తోంది. మాజీ సీఎం జగన్.. హైదరాబాద్‌లోని ఆస్పత్రి వైద్యులతో మాట్లాడిన సమయంలో ఈ విషయాన్ని తెలియజేశారు. దీనిపై హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో ప్రయత్నాలు చేసినప్పటికీ సఫలీకృతం కాకపోవడంతో ఆయనను వెంటనే ఎయిర్ అంబులెన్స్‌లో ముగ్గురు డాక్టర్ల పర్యవేక్షణలో హైదరాబాద్ నుంచి ముంబైకి తరలించారు.
HCU Security: పోలీసుల అలర్ట్... హెచ్‌సీయూ వద్ద భారీ భద్రత
ఇటీవల వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన సమయంలో విజయవాడ జిల్లా జైలు దగ్గరకు కొడాలి నాని వచ్చారు. ఆరోజు చాలా యాక్టివ్‌గా ఉన్న నాని.. ఆ తరువాత జీర్ణకోస సంబంధిత వ్యాధి ఉందంటూ హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అయితే కొడాలి నానిని పూర్తిగా పరీక్షించిన వైద్యులు.. ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. వెంటనే సర్జరీ చేయాలని భావించారు వైద్యులు. అయితే సర్జరీ క్రిటికల్‌గా మారడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ముంబైకు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయనను ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్‌లో కాసేపటి క్రితమే ముంబైకు తరలించారు. ముంబైలో ఎలాంటి చికిత్స అందజేస్తారనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి...
Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది
Nagar Kurnool Incident: దైవదర్శనానికి వచ్చిన మహిళపై దారుణం
Read Latest AP News And Telugu News