Avinash: దమ్ముంటే ఆ నాలుగు స్థానాల్లో ఉపఎన్నికకు రండి..
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:57 PM
Avinash: ప్రతిపక్ష హోదాకు సంబంధించి వైఎస్సార్పీ ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అడిగే ప్రశ్నలకు సమాధానం లేక ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంటూ విమర్శలు గుప్పించారు.

కడప, ఫిబ్రవరి 24: ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని వైసీపీ పట్టుబడుతుండగా.. 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని అధికారపక్షం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష హోదాపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (YSRCP MP Avinash Reddy) హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ అధినేత జగన్‌కు (Former CM YS Jagan Mohan Reddy) ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో చంద్రబాబుకు (AP CM Chandrababu Naidu) సినిమా చూపిస్తాడని భయం అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తే సమయం ఉంటుందని... ప్రజల పక్షాన మాట్లాడే వీలు కలుగుతుందన్నారు. జగన్ అడిగే ప్రశ్నలకు సమాధానం లేక ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంటూ విమర్శలు గుప్పించారు.
జగన్ ఉప ఎన్నికలకు భయపడుతున్నారు అంటున్నారని.. అంత కూటమి గాలిలో కూడా 65 వేలపై చిలుకు ఓట్లతో గెలు పొందారని చెప్పుకొచ్చారు. సూపర్ సిక్స్ పథకాలపై రెఫరండంగా.. కుప్పం, మంగళగిరి, పిఠాపురం ఉపఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. కాకమ్మ కబుర్లు దద్దమ్మ మాటలు మాట్లాడితే సరిపోతుందా.. దమ్ముంటే కుప్పం, మంగళగిరి, పిఠాపురం, పులివెందుల ఉప ఎన్నికలకు రావాలి అంటూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సవాల్ విసిరారు.
Konda Surekha: కేసీఆర్‌పై కొండా సురేఖ సెటైరికల్ ట్వీట్
కాగా... సాధారణంగా ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే ఆ పార్టీకి కనీసం 10 శాతం సభ్యులు ఉండాల్సిందే. అసెంబ్లీ 18 సీట్లు దక్కిన పార్టీలకే ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 135, జనసేనకి 21 , వైఎస్సార్సీపీకి 11, బీజేపీకి 8 సీట్లు దక్కాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ప్రభుత్వం ఏర్పడింది. కానీ 11 స్థానాలు మాత్రమే గెలుచుకున్న వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కని పరిస్థితి. ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యే బలం ఉండాలి.. కానీ వైసీపీకి మాత్రం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో వైసీపీ అధినేత జగన్‌కు ప్రతిపక్ష హోదా దక్కలేదు.
అయితే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని.. లేదంటే అసెంబ్లీ హాజరయ్యే ప్రసక్తే లేదని వైసీపీ పార్టీ అధినేత జగన్ తేల్చిచెప్పారు. 40 శాతం ఓట్లు వచ్చిన పార్టీని శాసనసభలో ప్రతిపక్షంగా, ఆ పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నేతగా గుర్తించరా? అంటూ ప్రశ్నించారు కూడా. దీంతో అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడల్లా జగన్‌తో సహా వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు.
కానీ.. సభకు 60 రోజులు హాజరుకాకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. దీంతో జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకున్నారు. సభకు హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవడంతో వైసీపీ నేతలు సభకు హాజరయ్యారు. అయితే గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. దీంతో సభకు వచ్చిన ఐదు నిమిషాల్లోనే జగన్ సభ నుంచి వాకౌట్ చేశారు. జగన్ వెంటనే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి...
Somireddy: ఆ భయంతోనే అసెంబ్లీకి జగన్
Read Latest AP News And Telugu News