Share News

CM Chandrababu: వడ్డే ఓబన్న తెలుగువారి కోసం పోరాడారు

ABN , Publish Date - Jan 11 , 2025 | 12:18 PM

CM Chandrababu: వడ్డె ఓబన్న జయంతి వేడుకలను ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం వడ్డె ఓబన్న ఎంతగానో పోరాడారని గుర్తుచేసుకున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో వడ్డె ఓబన్న పాత్ర మరువలేనిదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

CM Chandrababu: వడ్డే ఓబన్న తెలుగువారి కోసం పోరాడారు

అమరావతి: వడ్డె ఓబన్న జయంతి వేడుకలను ఏపీ ప్రభుత్వం నేడు అధికారికంగా జరుపుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి వడ్డె ఓబన్న సన్నిహితుడుగా ఉన్నారు. నల్లమల కేంద్రంగా గెరిల్లా పద్ధతుల్లో బ్రిటీష్ వారిపై ఆయన పోరాటం చేశారు. కర్నూలు శివారులోని జగన్నాథ కొండపై పట్టుబడి 39 ఏళ్లకే వడ్డె ఓబన్న అమరత్వం పొందారు. వడ్డె ఓబన్న జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రేనాటి వీరుడు ఓబన్న చరిత్ర నేటి తరాలకు తెలపాలని అన్నారు. బ్రిటిష్‌ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం వీరోచితంగా వడ్డే ఓబన్న పోరాడారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఓబన్న చరిత్ర నేటి తరాలకు తెలియాలి..

‘‘1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటునే ప్రథమ స్వాతంత్ర్య యుద్ధం అంటారు... కానీ అంతకుముందే 1846లో తెలుగునాట ఉయ్యాలవాడ నరసింహ రెడ్డితో కలిసి బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం వీరోచితంగా పోరాడారు వడ్డే ఓబన్న. ఆనాటి రేనాటి వీరుడు వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఓబన్న జయంతిని అధికారింగా నిర్వహించేందుకు నిర్ణయించాం. బీసీ ముద్దుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆ మహనీయుని వీరగాథను స్మరించుకుందాం’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


వడ్డే ఓబన్న చరిత్ర చిరస్మరణీయం: మంత్రి నారా లోకేష్

lokesh5.jpg

స్వాతంత్య్ర సమరయోధులు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేనాధిపతి వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలను నిర్వహిస్తోందని చెప్పారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటీష్ వలస పాలకుల ఆగడాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొట్టమొదటి స్వాతంత్య్ర పోరాటం జరిపిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న అని గుర్తుచేసుకున్నారు. ఆయన చరిత్ర చిరస్మరణీయమన్నారు. వడ్డే ఓబన్న విలువలు, సూచనలు పాటిస్తూ మెరుగైన సమాజం నిర్మాణం కోసం కృషిచేద్దామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Chandrababu: బ్రాండ్‌ ఏపీ!

Pawan Kalyan: క్షమాపణలు చెప్పాల్సిందే!

Vadde Obanna: రేనాటి వీరుడా వందనం!

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 11 , 2025 | 01:15 PM