Share News

Gas cylinder explosion: దారుణం.. అందరూ నిద్రిస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్.. ఆ తర్వాత..

ABN , Publish Date - Jan 28 , 2025 | 07:35 AM

నంద్యాల: చాపిరేవులలో భారీ ప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 8 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Gas cylinder explosion: దారుణం.. అందరూ నిద్రిస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్.. ఆ తర్వాత..
Gas cylinder blast

నంద్యాల: చాపిరేవుల(Chapirevula)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలి(Gas Cylinder Blast) ఇద్దరు మృతిచెందగా.. మరో 8 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతులు దినేష్(10), సుబ్బమ్మ (60)గా స్థానికులు గుర్తించారు. క్షతగాత్రులను హుటాహుటిన నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో బాధితులు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. కాగా, ప్రమాదం గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


కాగా, ఈనెల 14న సైతం చాకిరేవుల టోల్‌ ప్లాజా వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అరుణాచలం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులో భారీగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజాము 4:40 గంటల సమయంలో అందరూ నిద్రిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. వారంతా బస్సు నుంచి పరుగులు తీశారు. ముందుగానే అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. నాన్ స్టాప్‌గా బస్సు ప్రయాణించడంతో టైర్ల వద్ద రాపిడి జరిగి మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. కాగా, ప్రమాద సమయంలో బస్సుల్లో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. పెనుప్రమాదం తప్పడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - Jan 28 , 2025 | 07:49 AM