Share News

AP News: పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ మాజీ మంత్రిపై కేసు నమోదు..

ABN , Publish Date - Jan 22 , 2025 | 10:44 AM

నెల్లూరు: వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. కాకాణిపై నెల్లూరు జిల్లా కావలి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల బోగోలు మండలం కోళ్లదిన్నెలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఇరువర్గాల వారు తీవ్రంగా గాయపడడంతో వారిని కావలి ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు.

AP News: పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ మాజీ మంత్రిపై కేసు నమోదు..
YSRCP leader Kakani Govardhan Reddy

నెల్లూరు: వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి(Kakani Govardhan Reddy)పై కేసు నమోదు అయ్యింది. కాకాణిపై నెల్లూరు జిల్లా కావలి (Kavali) వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల బోగోలు (Bogolu) మండలం కోళ్లదిన్నె(Kolladinne)లో టీడీపీ, వైసీపీ (YSRCP) వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇరువర్గాల వారూ గాయపడడంతో వారిని కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఆవరణలోనే వైసీపీ మూకలు కత్తులతో రెచ్చిపోయారు. దీంతో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఆస్పత్రిలో మరోసారి తీవ్ర ఘర్షణ తలెత్తింది. అయితే వైసీపీ నేతలను పరామర్శించేందుకు ఆస్పత్రి వద్దకు కాకాణి గోవర్దన్ రెడ్డి చేరుకున్నారు.


ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ నేతలపై మాజీ మంత్రి కాకాణి అనుచిత వ్యాఖ్యలు చేశారు. టీడీపీ శ్రేణులు తమ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు సహకరిస్తున్నారని కాకాణి ఆరోపించారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని, పోలీసు అధికారులు సప్తసముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి బట్టలూడదీస్తామంటూ తీవ్ర పదజాలంతో కాకాణి వ్యాఖ్యలు చేశారు. అలాగే టీడీపీ వారినీ వదిలేది లేదంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగారు. దీనిపై టీడీపీ నేత వంటేరు ప్రసన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కాకాణిపై 224, 351/2, 352, 353/2 సెక్షన్ల కింది కేసులు నమోదు చేశారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి రాజకీయ కుట్రలకు షాక్ తగిలినట్లు అయ్యిందని కావలి టీడీపీ నేతలు అనుకుంటున్నారు.


కాగా, మహిళపై అత్యాచారం కేసులోనూ పోలీసులపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఓ విద్యుత్ లైన్‌మెన్ చనిపోతే అతని భార్యకు ఆ ఉద్యోగం ఇప్పిస్తానంటూ కాకాణి అనుచరుడు వెంకట శేషయ్య ఆమెపై పలుమార్లు లైంగిక దాడులకు దిగాడు. ఉద్యోగం వచ్చిన తర్వాతా మహిళను వేధిస్తుండడంతో తట్టుకోలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కాకాణి అనుచరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలోనూ పోలీసు, రెవెన్యూ అధికారులను కాకాణి భయబ్రాంతులకు గురిచేశారు. అధికారంలోకి వచ్చాక అంతు చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఓ పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ సీఐ సుబ్బారావు, ఆర్‌ఐ రవిని బెదిరించారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే ఖాకీ దుస్తులు ఊడదీస్తామని హెచ్చరించారు. సీఐ, ఆర్‌ఐ శాశ్వతంగా ఉగ్యోగం చేయకుండా చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు దిగారు. కాకాణి తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి..

దివ్యంగుడైన ఓ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు

రెండోరోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

Updated Date - Jan 22 , 2025 | 11:13 AM