Share News

Lift Irrigation Project: పీ4తో కొమ్మమూరు లిఫ్ట్‌

ABN , Publish Date - Apr 06 , 2025 | 03:16 AM

సీఎం చంద్రబాబు ఆవిష్కరించిన పీ4 కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. కారుమంచి ప్రసాద్‌ ప్రేరణతో, సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 10 కోట్ల రూపాయలతో కొమ్మమూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మించేందుకు ముందుకు వచ్చారు

Lift Irrigation Project: పీ4తో  కొమ్మమూరు లిఫ్ట్‌

  • రూ.10 కోట్లు ఇవ్వనున్న ప్రసాద్‌ సీడ్స్‌ అధినేత

  • తీరనున్న ఐదు గ్రామాల రైతుల సాగునీటి వెతలు

  • సస్యశ్యామలం కానున్న 5,315 ఎకరాలు

  • పలు గ్రామాలకు తీరనున్న దాహార్తి

అమరావతి, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): అట్టడుగున ఉన్న పేదల అభ్యున్నతి కోసం సీఎం చంద్రబాబు తలపెట్టిన పీ4 కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. తన సొంతూరులో రైతులు సాగునీటి ఎద్దడిని ఎదుర్కోవడం ప్రముఖ విత్తన తయారీ సంస్థ ప్రసాద్‌ సీడ్స్‌ చైర్మన్‌ కారుమంచి ప్రసాద్‌ను కదిలించింది. సీఎం ఇచ్చిన పిలుపుతోపాటు, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ సూచన మేరకు పీ4 ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి ఆయన ముందుకు వచ్చారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రభుత్వంతో భాగస్వామ్యమవుతానని కారుమంచి ప్రసాద్‌ సీఎంను కలిసి వివరించారు. కొమ్మమూరు లిఫ్టు ఇరిగేషన్‌ పథకం నిర్మాణానికి రూ.10 కోట్లు భరిస్తానని, తద్వారా తమ సొంతూరు కాకుమానుతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో సాగు నీటి సమస్య పరిష్కారమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


మరింత మందికి స్ఫూర్తి: సీఎం

ప్రసాద్‌ సూచించిన విధంగా కొమ్మమూరు ప్రాంతంలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి డీపీఆర్‌ సిద్ధం చేసి, త్వరగా అనుమతులు ఇవ్వాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రసాద్‌ అందించే ఆర్థికసాయం ద్వారా లిఫ్ట్‌ నిర్మాణం చేపట్టాలని సూచించారు. గ్రామంలోని రైతులకు మేలు చేసేందుకు పెద్దమనసుతోప్రసాద్‌ ముందుకు రావడాన్ని సీఎం అభినందించారు. ప్రసాద్‌ వంటి వారు మరింత మందికి స్ఫూర్తినిస్తున్నారని కొనియాడారు.


మూడు దశాబ్దాలుగా ప్రసాద్‌ చేయూత..

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానుకు చెందిన కారుమంచి ప్రసాద్‌ 1995 నుంచి ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు సాయం చేస్తూ వస్తున్నారు. పెదనందిపాడు లిఫ్ట్‌ స్కీంను పూర్తి చేయడానికి 1995లో ఆయన ఆర్థిక సాయం చేశారు. కాకుమాను వద్ద కొమ్మమూరు కాల్వపై లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాన్ని నిర్మిస్తే కాకుమాను, బీకే పాలెం, అప్పాపురం, గరికపాడు, కొండపాతూరు గ్రామాల్లోని సుమారు 5,315 ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందుతుంది. కాకుమాను మండలంలోని ప్రజల తాగునీటి సమస్య తీరుతుంది.


ఇవి కూడా చదవండి

YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో

Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 06 , 2025 | 03:17 AM