Biodiversity Park : సీతాకోకచిలుక పూలు
ABN , Publish Date - Mar 05 , 2025 | 05:13 AM
పెదవాల్తేరులోని జీవ వైవిధ్య ఉద్యానవనం భిన్న జాతులకు చెందిన మొక్కలకు ప్రసిద్ధి. ఇక్కడున్న ప్రతి మొక్క ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది.

ABN AndhraJyothy: పెదవాల్తేరులోని జీవ వైవిధ్య ఉద్యానవనం భిన్న జాతులకు చెందిన మొక్కలకు ప్రసిద్ధి. ఇక్కడున్న ప్రతి మొక్క ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అటువంటి వాటిలో మాత్ ఆర్కేడ్ ఒకటి. దీని శాస్ర్తీయ నామం ఫాలెనోప్సిస్. ఈ మొక్కకు పూచే పూలు సీతాకోక చిలుక ఆకారంలో ఉంటాయి. అడవుల్లో మాత్రమే ఉండే ఈ మొక్కలను ప్రత్యేక పద్ధతుల్లో ఇక్కడ పెంచుతున్నారు. గ్రీన్ హౌస్ ఏర్పాటుచేసి చెట్టు బెరడు, బొగ్గు, ఇతర పదార్థాలను కలిపి మొక్కకు ఎరువుగా వేస్తారు. ఈ మొక్కకు నిరంతరం తేమ అందించాల్సి ఉంటుంది. వీటికి పూచే పూలు అత్యంత ఖరీదైనవి. సంపన్నుల ఇళ్లల్లో నిర్వహించే ఫంక్షన్లలో ఈ పూలను అలంకరణకు వినియోగిస్తుంటారని జీవ వైవిధ్య ఉద్యానవనం నిర్వాహకులు రామమూర్తి తెలిపారు.
- విశాఖపట్నం/ఆంధ్రజ్యోతి