Share News

Notices: డీఐజీ సునీల్‌ నాయక్‌కు నోటీసులు

ABN , Publish Date - Mar 02 , 2025 | 09:23 AM

మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్‌ నాయక్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ నోటీసులు ఇచ్చారు. సోమవారం ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు.

Notices: డీఐజీ సునీల్‌ నాయక్‌కు నోటీసులు
Notices to DIG Sunil Nayak

ప్రకాశం జిల్లా: మాజీ ఎంపీ (Ex MP), ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి (AP Deputy Speaker) రఘురామకృష్ణంరాజు (Raghuramakrishnamraju)పై కస్టోడియల్‌ టార్చర్‌ కేసు (Custodial torture case)లో అప్పటి సీఐడీ డీఐజీ (CID DIG)గా పనిచేసిన సునీల్‌ నాయక్‌ (Sunil Naik)కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ (SP Damodar) నోటీసులు (Notices) ఇచ్చారు. సోమవారం ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీలో డీఐజీగా సునీల్ నాయక్ ఉన్నారు. ప్రస్తుతం బీహార్‌లో ఫైర్ సర్వీసెస్ డీఐజీగా సునీల్‌ నాయక్ ఉన్నారు.

ఈ వార్త కూడా చదవండి..

యాదాద్రి బ్రహ్మోత్సవాలు..

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

రఘురామను అరెస్టు చేసి సీఐడీ ఆఫీస్‌కు తీసుకొచ్చిన సమయంలో సునీల్‌ నాయక్‌ వచ్చారని ధృవీకరించారు. ఇప్పటికే నమోదు చేసిన వాంగ్మూలాల ఆధారంగా ఆయన పాత్రపైనా విచారించేందుకు రావాలని కోరినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. బీహార్‌ క్యాడర్‌కు చెందిన సునీల్‌ నాయక్‌ను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చి, సీఐడీ డీఐజీగా పోస్టింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో తనపై కస్టోడియల్‌ టార్చర్‌ జరిగిందని, అందుకు బాధ్యులైన అధికారులు, అప్పటి సీఎం జగన్‌పై రఘురామ గుంటూరు నగరంపాలెం పోలీసులకు గతేడాది ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి

రైతులను భయభ్రాంతులకు గురిచేసిన అఘోరి...

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Mar 02 , 2025 | 10:09 AM