Share News

Sankranti 2025: పందెం రాయళ్ల పంచాంగం.. వాళ్లదే హవా

ABN , Publish Date - Jan 13 , 2025 | 04:04 PM

Sankranti 2025: కుక్కుట శాస్త్రాన్ని అనుసరించి కోడి పంజులను బరిలో నిలిపితే.. విజయం తథ్యమని చెబుతున్నారు. అంతేకాదు.. ఆ కోడి పుంజులను ఓ దిశలో బరిలో దింపితే యజమానులకు సైతం దశ తిరుగుతోందని అంటున్నారు.

Sankranti 2025: పందెం రాయళ్ల పంచాంగం.. వాళ్లదే హవా
Pandem Kollu

సంక్రాంతి వచ్చిందంటే.. కోడి పందాలు మొదలవుతాయి. ఈ పందాలను వీక్షించేందుకే కాదు.. వీటిని ఆడేందుకు దేశ విదేశాల నుంచి భారీగా నగదుతో గోదావరి జిల్లాలకు పలువురు వచ్చి వాలతారు. జూదం, బెట్టింగ్ చేసే వాళ్లు కోళ్లపై లక్షల రూపాయిలు.. మరి కొందరైతే కోట్లాది రూపాయిలు పెట్టి ఈ పందాల్లో దిగుతారు. అయితే ఈ కోడి పందాల్లో శుభ ముహూర్తం చూసుకోని మరీ పందెం రాయుళ్లు... మరీ బరిలో దిగుతారని నిర్వాహకులు సోదాహరణగా వివరిస్తున్నారు. కోడిని సంస్కృతంలో కుక్కుట అంటారు. దీంతో ఈ కోళ్ల పంచాంగానికి కుక్కుట శాస్త్రమని పేరు ఉందని చెబుతున్నారు. అయితే ఈ శాస్త్రాన్ని మాత్రం రాసింది ఎవరో.. తెలియదని వారు స్పష్టం చేస్తు్న్నారు. అంతేకాదు.. ఈ కుక్కుట శాస్త్రంలో ఈ కోళ్ల పందాలకు సంబంధించి ఎంతో విలువైన సమాచారం ఉందని పేర్కొంటున్నారు. అత్యధిక పందెం రాయుళ్లు ఈ శాస్త్రాన్ని తూ చా తప్పకుండా.. పాటిస్తున్నారని వారు సోదాహరణగా వివరిస్తున్నారు.


కోడి పందాల్లో ఇవి సైతం ముఖ్యం

వారం, తిథి, వర్జ్యం, దిశ, నక్షత్ర బలం అధారంగా అంటే.. కుక్కుట శాస్త్రంలోని అంశాలను పరిగణలోకి తీసుకొని కోడి పుంజులను నిర్వహకులు బరిలో దింపుతారు. ముఖ్యంగా యజమాని జాతక బలంతోపాటు కోడి జాతక బలాన్ని సైతం చూస్తారని పేర్కొంటున్నారు. ఈ రెండు అంశాలు సరిపోలినట్లయితే.. బరిలో నిలిచిన కోడి పుంజు.. తప్పక గెలిచి తీరుతోందని వాటి యజమానులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.

Also Read: పందెం కోళ్లు ఎన్ని రకాలో తెలుసా..?


ఏ రోజుల్లో ఏ కోడి పుంజు గెలుస్తోందంటే..?

కోడి పుంజుల్లో వివిధ రకాలు ఉన్నాయి.. కాకి, నెమలి, డేగ ఇలా పలు రకాల కోడి పుంజులున్నాయి. కోడి పుంజుల్లోని రకాలన్ను బట్టి.. వాటికి పేర్లు పెడుతోంటారు. అయితే మూడు రోజుల సంక్రాంతి పర్వదినాల్లో తొలి రోజు భోగి. ఈ రోజు.. నెమలి జాతి రకానికి చెందిన కోడి పుంజులు గెలుస్తాయని చెబుతున్నారు. ఇక రెండో రోజు సంక్రాంతి. ఈ రోజు.. కాకి జాతికి చెందిన కోడి పుంజులు బరిలో నిలిపితే.. విషయం తథ్యమని పేర్కొంటున్నారు. అలాగే చివరి రోజు.. కనుమ పండగ నాడ ఎర్ర కాకి డేగలు బరిలో నిలిపే మాత్రం తమ సత్తా చాటుతాయని కుక్కుట శాస్త్రాన్ని అవపోసన పట్టిన వారు వివరిస్తున్నారు.


యజమాని పేరులోని..

అలాగే ఈ శాస్త్రం ప్రకారం.. యజమాని పేరులోని తొలి అక్షరాన్ని పరిగణలోకి తీసుకొని లెక్కిస్తారు. ఆ క్రమంలో వారి నక్షత్రాలను పరిగణలోని తీసుకొంటారు. అలాగే ఏ దిశలో నుంచి కోడిని బరిలో దింపితే.. యజమాని దశ తిరుగుతోందో కూడా ఈ కుక్కుట శాస్త్రం స్పష్టంగా వివరిస్తోందని వారు పేర్కొంటున్నారు. దీనిని పలువురు పక్కాగా అనుసరిస్తారని అంటున్నారు. ఇంకా సోదాహరణగా అందరికి అర్థమయ్యేలా వివరించాలంటే మాత్రం ఆదివారం, శుక్రవారం అయితే.. ఉత్తర దిశ. అదే సోమ, శనివారాల్లో అయితే దక్షిణ దిశ. మంగళవారం అయితే తూర్పు దిశ.. అలాగే ఇక మిగిలిన బుధవారం, గురువారాల్లో అయితే.. పడమర దిశ నుంచి కోళ్లను బరిలోకి దింపుతారని కోడి పందాల నిర్వహణలో తల పండడమే కాకుండా.. కుక్కుట శాస్త్రాన్ని సైతం ఔపోసన పట్టిన వారు పక్కా దిశ, దశలతో సోదాహరణగా వివరిస్తున్నారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 13 , 2025 | 05:07 PM