Share News

YS Sharmila : అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలి

ABN , Publish Date - Jan 12 , 2025 | 05:54 AM

‘బీజేపీ మతపిచ్చి పార్టీ. కుల మతాలతో ఆ పార్టీ రాజకీయం చేస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను బీజేపీ పనిముట్టలా వాడుకుంటోంది’ అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు.

YS Sharmila :  అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలి

  • బీజేపీ కుల, మత రాజకీయాలు చేస్తోంది: షర్మిల

  • అఖిలపక్ష నిర్ణయాన్ని రాష్ట్రపతి ముర్ముకు పంపాలని తీర్మానం

అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ‘బీజేపీ మతపిచ్చి పార్టీ. కుల మతాలతో ఆ పార్టీ రాజకీయం చేస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను బీజేపీ పనిముట్టలా వాడుకుంటోంది’ అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. శనివారం విజయవాడలోని ఆ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ విధానాలు, అంబేడ్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వాఖ్యలపైన వివిధ పార్టీల నేతలు మాట్లాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఇతర ప్రజాసంఘాలు, కులసంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్న ఆ సమావేశం... అంబేడ్కర్‌ను ఎగతాళి చేసిన అమిత్‌షాను బర్తరఫ్‌ చేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతి పంపాలని తీర్మానించింది. షర్మిల మాట్లాడుతూ... ‘దేశం మొత్తాన్ని కాషాయమయం చేసే కుట్రలు బీజేపీ చేస్తోంది. మహాత్మాగాంధీని విలన్‌గా, గాడ్సేను హీరోలా చిత్రీకరిస్తోంది. రాజ్యాంగాన్ని రాసిన అంబేడ్కర్‌ను కించపరచేలా అమిత్‌షా మాట్లాడితే.. ప్రధానితో సహా బీజేపీ నేతలంతా మద్దతు పలకడం ఏమిటి? అంబేడ్కర్‌ను, అమిత్‌షా ఎగతాళి చేస్తే బీజేపీ ఎంపీలు పకపకా నవ్వుతూ ఎంజాయ్‌ చేశారు’ అని ఆరోపించారు.

Updated Date - Jan 12 , 2025 | 05:54 AM