Tirupati: తిరుపతి తొక్కిసలాట ఘటనలో కుట్రకోణం.. పోలీసుల దర్యాప్తు
ABN , Publish Date - Jan 09 , 2025 | 12:25 PM
Tirupati Stampede: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటన అందర్నీ కలచివేసింది. ఈ ఘటనలో పలువురు భక్తులు చనిపోవడం బాధకు గురిచేసింది.
వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటన అందర్నీ కలచివేసింది. ఈ ఘటనలో పలువురు భక్తులు చనిపోవడం జనాలను బాధకు గురిచేసింది. బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ తోపులాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. వైకుంఠ దర్శనం టికెట్ల కోసం ఉన్నట్లుండి పెద్దసంఖ్యలో భక్తులు పోటెత్తారు. అక్కడ జరిగిన తోపులాటలో 48 మంది అస్వస్థతకు గురయ్యారు. గాయపడిన వారిని రుయా, స్విమ్స్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనలో కుట్రకోణం దాగి ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
వదిలిపెట్టం!
తిరుమల తొక్కిసలాట ఘటనలో కుట్రకోణం దాగుందని సోషల్ మీడియాలో అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడం, సర్కారుకు చెడ్డ పేరు తీసుకురావాలనే కుట్రతో కొందరు ఈ పనికి తెగబడినట్లు నెట్టింట వినిపిస్తోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత స్పందించారు. తొక్కిసలాట ఘటనలో కుట్రకోణం ఉందా? అని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బాధ్యతా రాహిత్యంగా పనిచేసిన వారు ఎంతటి వారైనా సరే వాళ్ల మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని.. వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఏపీ సర్కారు భారీగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో ఫ్యామిలీకి రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. గాయపడిన వారికి మెరుగైన ట్రీట్‌మెంట్ అందిస్తామని మంత్రి తెలిపారు. కాగా.. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులను రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పార్థసారథి, ఆనం రామనాయణ రెడ్డి తదితరులు పరామర్శించారు. ఆ తర్వాత స్విమ్స్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ పొందుతున్న గాయపడిన వారిని మంత్రులు పరామర్శించారు.
ఇవీ చదవండి:
తిరుపతి ఘటన మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సర్కార్
షాకింగ్ న్యూస్.. ఇప్పటి వరకు చలి.. ఇక నుంచి..
టీటీడీ జారీ చేసిన ఎస్డి టోకెన్స్ కోటా పూర్తి..
మరిన్ని ఏపీ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి