-
-
Home » Andhra Pradesh » Today Breaking News Telangana and AP Assembly Budget Sessions Highlights Live Updates in Telugu News Monday 17th March 2025 Suri
-

Breaking News: ఎంపీ మిథున్ రెడ్డిలో భయం.. కారణమిదేనా..
ABN , First Publish Date - Mar 17 , 2025 | 08:06 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-03-17T19:11:55+05:30
ఎంపీ మిథున్ రెడ్డిలో భయం.. కారణమిదేనా..
అమరావతి: మద్యం కుంభకోణంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్ట్ ను ఆశ్రయించిన ఎంపీ మిథున్ రెడ్డి.
మద్యం అవకతవకలు పై నమోదు చేసిన FIR లో తన పేరు ఉన్నట్టు పత్రికల్లో వచ్చిందని పేర్కొన్న మిథున్ రెడ్డి.
ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్. సత్యప్రసాద్ ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా తన పేరు ఉన్నట్టు పత్రికల్లో చూసాను అని పేర్కొంటూ పిటిషన్.
తాను ఎంపీ నని, తనకు రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలతో ఏటువంటి సంభదం లేదని పేర్కొన్న మిథున్ రెడ్డి.
కొన్ని డిస్టిలరీ కు ఇండెంట్లు, మరి కొన్నింటికి తగ్గించినట్టు ఇందులో తన ప్రమేయం ఉందని పేర్కొనడంపై పిటిషన్ లో అభ్యంతరం.
ఈ వ్యవహారంతో తనకు ఏటువంటి సంబధం లేదని పేర్కొన్న మిథున్ రెడ్డి.
రేపో మాపో మిథున్ రెడ్డి పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం.
-
2025-03-17T18:30:27+05:30
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో మావోయిస్ట్‌లకు ఎదురుదెబ్బ.
పోలిసుల ఎదుట లొంగిపోయిన 29 లక్షల రివార్డ్ కలిగిన 19 మంది నక్సల్స్.
సౌత్ బస్తర్ డివిజన్ మరియు పామెడ్ ఏరియా కమిటీకి చెందిన 10 మంది మావోయిస్టులు.
వీరంతా మూడు ధశబ్ధాలుగా మావోయిస్ట్ కార్యకలపాల్లో చురుకుగా పాల్గొన్నట్లు వెల్లడించిన పోలీసులు.
-
2025-03-17T16:10:55+05:30
తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదల
ప్రొవిజినల్ సెలక్షన్ లిస్ట్ విడుదల చేసిన TGPSC
574 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్టు TGPSC ప్రకటన
-
2025-03-17T15:30:07+05:30
టీటీడీ సంచలన నిర్ణయం.. ఇకపై..
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనం
ఈ నెల 24నుంచి అమలుచేయనున్న టీటీడీ
వీఐపీ బ్రేక్, రూ.300 దర్శనాలకు అనుమతి
సోమవారం, మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు
బుధవారం, గురువారం రూ.300 ప్రత్యేక దర్శనం
ఒక్కో ప్రజాప్రతినిధికి రోజుకు ఒక లేఖకు అనుమతి
సిఫార్సు లేఖపై ఆరుగురికి దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
-
2025-03-17T13:51:06+05:30
విజన్-2047పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
అమరావతి: విజన్-2047పై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొనసాగిన లఘుచర్చ
లఘుచర్చ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన సీఎం చంద్రబాబు
ఎన్నికల్లో కూటమి పార్టీలు ఏపీని పునర్నిర్మాణం చేస్తాయని హమీ ఇచ్చాయి: సీఎం చంద్రబాబు
ఎన్నికల్లో 93 శాతం అనుకూల పలితాలు వచ్చాయి: సీఎం చంద్రబాబు
ఇప్పుడు ట్రాక్ తప్పిన పాలనను తిరిగి గాడిలో పెడుతున్నాం: సీఎం చంద్రబాబు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజన్ 2020కి పిలుపు ఇచ్చా: సీఎం చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047 తీసుకువచ్చారు: సీఎం చంద్రబాబు
పర్ క్యాపిటా ఇన్ కమ్ 18 వేల యూఎస్ డాలర్లుగా పెట్టుకున్నారు: సీఎం చంద్రబాబు
మనం 42 వేల యూఎస్ డాలర్ల తలసరి ఆదాయం లక్ష్యం పెట్టుకున్నాం: సీఎం చంద్రబాబు
జీఎస్‍డీపీ 308 లక్షల కోట్ల ఆదాయంగా పెట్టుకున్నాం: సీఎం చంద్రబాబు
2014-19 కన్నా 1.5 శాతం అధనంగా గ్రో కావాలి: సీఎం చంద్రబాబు
దూరదృష్టితో ఆలోచించి ప్రణాళికలు రూపొందించుకోవాలి: సీఎం చంద్రబాబు
1990ల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు విజన్ 2020 తీసుకువచ్చాం: సీఎం చంద్రబాబు
చెప్పిన దానికంటే ఎక్కువ ప్రయోజనమే ఉమ్మడి రాష్ట్రానికి కలిగింది: సీఎం చంద్రబాబు
2047 వికసిత్ భారత్‌ను ప్రధాని మోదీ అమలు చేస్తున్నారు: సీఎం చంద్రబాబు
అందుకే ఏపీ అభివృద్ధికి స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్ రూపొందించాం: సీఎం చంద్రబాబు
ఎమ్మెల్యేలను భాగస్వాములు చేస్తూ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్లనూ రూపొందించాం: సీఎం చంద్రబాబు
20247 నాటికి ఏపీ 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారటమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
-
2025-03-17T13:02:04+05:30
అసెంబ్లీ వద్ద నిరసనకు దిగిన బీఆర్ఎస్.. గందరగోళ పరిస్థితులు..
హైదరాబాద్: అసెంబ్లీ వద్ద ధర్నాకు దిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నేతలు
ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు
ఉస్మానియా యూనివర్శిటీలో నిరసనలు, ధర్నాలు నిషేధిస్తూ జీవో విడుదల
జీవోను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్, విద్యార్థి సంఘాల నేతలు
అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నంచిన వారిని అడ్డుకున్న పోలీసులు
పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట
నిరసనలకు దిగిన యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
2025-03-17T12:52:10+05:30
అక్బరుద్దీన్ ఓవైసీపై మంత్రి సీతక్క ఫైర్..
తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎంఐఎం వాకౌట్‌పై మంత్రి సీతక్క చిట్ చాట్
అక్బరుద్దీన్ ఓవైసీ ఒక్క క్వశ్చన్ వాయిదా పడితేనే ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు: మంత్రి సీతక్క
గత పదేళ్లలో ఎన్ని ప్రశ్నలు వాయిదా పడ్డాయి.. అప్పుడు ఎందుకు అడగలేదు: మంత్రి సీతక్క
సభను బీఆర్ఎస్ బుల్డోజ్ చేసినప్పుడు అక్బరుద్దీన్ ఎందుకు మాట్లాడలేదు: మంత్రి సీతక్క
ప్రశ్నోత్తరాలే లేకుండా అసెంబ్లీని గత ప్రభుత్వం నడిపింది: మంత్రి సీతక్క
ప్రతి సభ్యుడికీ అవకాశం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదమా..?: మంత్రి సీతక్క
-
2025-03-17T12:45:47+05:30
ఇప్పటికే అనేక పేర్లు మార్చాం: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ వచ్చాక ఆర్టీసీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్లు మార్చుకున్నాం: సీఎం రేవంత్
కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, పీవీ నరసింహారావు పేర్లు పెట్టుకున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి
అదే ఒరవడిలో తెలుగు వర్సిటీ పేరును మారుస్తున్నాం: సీఎం రేవంత్
ప్రభుత్వ నిర్ణయం ఒక వ్యక్తి కోసమో.. ఒక కులం కోసమో కాదు: సీఎం రేవంత్
సురవరం ప్రతాప్‌రెడ్డి తెలంగాణకు గొప్ప సేవ చేశారు: సీఎం రేవంత్
నిజాంకు వ్యతిరేకంగా సురవరం ప్రతాప్‌రెడ్డి పోరాడారు: రేవంత్
-
2025-03-17T12:44:11+05:30
పొట్టి శ్రీరాములును తక్కువ చేయడం ఉద్దేశం కాదు: సీఎం రేవంత్
తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములుకు బదులు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడుతున్నాం: సీఎం రేవంత్
పొట్టి శ్రీరాములు త్యాగాలను తక్కువగా చూడటం లేదు: సీఎం రేవంత్
ఆయన ప్రాణత్యాగాలను మనం స్మరించుకోవాలి: రేవంత్
పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదు: సీఎం రేవంత్
పొట్టి శ్రీరాములు వర్సిటీ ఏపీలో కొనసాగుతోంది: సీఎం రేవంత్
తెలంగాణ వచ్చాక అనేక వర్సిటీలకు పేర్లు మార్చుకున్నాం: సీఎం రేవంత్
తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తులను స్మరించుకోవడం ఎంతో అవసరం: సీఎం రేవంత్‌రెడ్డి
-
2025-03-17T12:34:05+05:30
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ బిల్లుపై రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీగా మారుస్తూ చట్ట సవరణ బిల్లు
బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పరిపాలనలో భాగంగా కొన్ని పాలనాపరమైన నిర్ణయాలు తీసుకున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారిని స్మరించుకుంటున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
ఈ మేరకు వారి పేర్లను విద్యాసంస్థలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు పెడుతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
ఈ మార్పు గత పది, పదిహేళ్ల నుంచి కొనసాగుతోంది: సీఎం రేవంత్ రెడ్డి
ఇందులో భాగంగానే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించాం: రేవంత్ రెడ్డి
అయితే దీనిపై కొన్ని వర్గాలకు అపోహలు కల్పించే విధంగా కొంతమంది చేస్తున్నారు: రేవంత్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్నవారే అలా మాట్లాడడం తెలంగాణ సమాజానికి మంచిది కాదు: రేవంత్ రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనలో భాగంగా తెలంగాణకు కొన్ని యూనివర్శిటీలు వచ్చాయి: రేవంత్ రెడ్డి
ఇందులో భాగంగానే వాటికి కొత్త నామకరణాలు చేసుకుంటున్నాం: రేవంత్ రెడ్డి
-
2025-03-17T12:22:12+05:30
బీసీ కులగణన బిల్లు
తెలంగాణ అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు
తెలంగాణ అసెంబ్లీ ముందుకు బీసీ కులగణన బిల్లు
బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్
బీసీ కులగణన బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం
ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి దామోదర
అసెంబ్లీ ముందుకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ బిల్లు
సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీగా మారుస్తూ చట్ట సవరణ బిల్లు
-
2025-03-17T11:46:17+05:30
సీఎం రేవంత్ రెడ్డి అడ్డమైన వారితో లింకులు పెట్టారు: కేటీఆర్ ఫైర్..
తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైంది: ఎమ్మెల్యే కేటీఆర్
సీఎం రేవంత్ అప్రూవర్‌గా మారి తన పాలన అట్టర్ ప్లాప్ అని తానే చెప్పారు: ఎమ్మెల్యే కేటీఆర్
రూ. 71 వేల కోట్ల రెవెన్యూ తీసుకురాలేమని ముఖ్యమంత్రి రేవంత్ ఒప్పుకున్నారు: ఎమ్మెల్యే కేటీఆర్
2014లో రేవంత్ సీఎంమై ఉంటే సమైఖ్యాంధ్ర నేతల మాటలు నిజం అయ్యేవి: కేటీఆర్
తెలంగాణ వెనక్కి పోతుందని సమైఖ్యాంధ్ర నేతలు అప్పుడే చెప్పారు: కేటీఆర్
కుటుంబాలు మాకు లేవా, పిల్లలు మాకు లేరా? రేవంత్‍కే ఉన్నారా?: కేటీఆర్
నాకు అడ్డమైన వారితో లింకులు పెట్టిన నాడు మా కుటుంబాలు బాధ పడలేదా?: కేటీఆర్
ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్‌లో దాటిన రేఖలు బయట పెట్టాలా?: కేటీఆర్
పిచ్చి పనులు చేస్తున్నారు కాబట్టే.. సీఎంను ప్రజలు తిడుతున్నారు.. దానికి ఎవరు ఏం చేస్తారు?: కేటీఆర్
నిండు సభలో బట్టలు విప్పి కొడాతామని రేవంత్ బజారు భాష మాట్లాడారు: కేటీఆర్
మెుదటి ఏడాదిలో రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు కూడా రాలేదు: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ ఒప్పుకున్నారు: కేటీఆర్
సంపద సృష్టించే జ్ఞానం, తెలివి రేవంత్ రెడ్డికి లేదు: కేటీఆర్
రాష్ట్రాన్ని క్యాన్సర్ రోగితో పోల్చితే తెలంగాణ పెరుగుతుందా? : కేటీఆర్
కేంద్రంతో సఖ్యతగా ఉండి నిధులు సాధిస్తానని ఎంత తెచ్చారు: కేటీఆర్
కేసీఆర్‍పై కోపంతో రైతులను గోస పెడుతున్నారు: కేటీఆర్
గాసిప్స్ బంద్ చేసి పరిపాలనపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలి: కేటీఆర్
పదిహేనేళ్లుగా రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్‌లో పత్తాలు ఆడేవారితో గాసిప్స్ నడపటం అలవాటు: కేటీఆర్
-
2025-03-17T11:34:51+05:30
ఎంపీ డీకే అరుణ నివాసానికి జూబ్లీహిల్స్ పోలీసులు..
హైదరాబాద్: ఎంపీ డీకే అరుణ నివాసానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీ నివాసానికి హుటాహుటిన వెళ్లిన పోలీసులు
డీకే అరుణ నివాసంలోకి శనివారం అర్ధరాత్రి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగుడు
ఈ మేరకు మరోసారి సీసీటీవీ కెమెరాలను పరీశీలిస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు
ఇంట్లో పనిచేసే పని మనుషుల స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు
ఇప్పటికే డీకే అరుణకు ఫోన్ చేసి పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
-
2025-03-17T11:17:12+05:30
పోలవరం నిర్వాసితులపై మంత్రి నిమ్మల ఏం చెప్పారంటే..
ఏపీ అసెంబ్లీ: పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులను గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు: మంత్రి నిమ్మల
ఐదేళ్లలో ఒక్క రూపాయీ పరిహారంగా అందించలేదు: మంత్రి నిమ్మల
పునరావాస కాలనీల్లో ఒక్క ఇంటినీ పూర్తి చేయలేదు: మంత్రి నిమ్మల
ప్రాజెక్ట్‌కు కేంద్రం ఇచ్చిన రూ.3,385 కోట్లను దారి మళ్లించారు: నిమ్మల
పోలవరం ప్రాజెక్ట్‌ను విధ్వంసం చేసినట్టే.. నిర్వాసితులనూ ముంచేశారు: మంత్రి నిమ్మల
2026 జూన్ నాటికి పునరావాస కాలనీల నిర్మాణ పనులు పూర్తి చేస్తాం: నిమ్మల
-
2025-03-17T11:15:18+05:30
ఉపాధి హమీ పథకంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
ఏపీ అసెంబ్లీ: జాతీయ ఉపాధి హామీపై ప్రత్యేక దృష్టి పెట్టాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయి: డిప్యూటీ సీఎం పవన్
ఉపాధి హామీ పనుల్లో రూ.250 కోట్ల అవినీతి జరిగింది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
పనులు చేయకుండానే చేసినట్టు రాసుకున్నారు: పవన్ కల్యాణ్
ఉపాధి హామీలో వేజెస్ పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి: డిప్యూటీ సీఎం పవన్
-
2025-03-17T10:45:09+05:30
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి అచ్చెన్న..
ఏపీ అసెంబ్లీ: గత ప్రభుత్వం ఒక్క గజం కూడా సాయిల్ టెస్ట్ చేయలేదు: మంత్రి అచ్చెన్న
కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ 3 లక్షల ఎకరాలకు సాయిల్ టెస్ట్ చేసింది: అచ్చెన్న
వచ్చే ఏడాది ఆరున్నర లక్షల ఎకరాలు టెస్ట్ చేస్తాం: మంత్రి అచ్చెన్న
త్వరలో టార్పాలిన్ పట్టాలు అందిస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు
-
2025-03-17T10:43:25+05:30
డైట్, కాస్మోటిక్ ఛార్జీలపై మంత్రి సీతక్క క్లారిటీ..
అసెంబ్లీలో డైట్, కాస్మోటిక్ ఛార్జీల పెంపుపై మంత్రి సీతక్క వివరణ
ఏడేళ్ల తర్వాత డైట్ చార్జీలు 40 శాతం పెంచాం: మంత్రి సీతక్క
విద్యార్థులకు విద్య, పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తున్నాం: మంత్రి సీతక్క
ఆహారం కల్తీ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం: సీతక్క
ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్, నూతన విద్యా విధానమని స్కాలర్షిప్ విధానాన్ని కేంద్రం రద్దు చేసింది: మంత్రి సీతక్క
విద్యారంగంపై కేంద్ర ప్రభుత్వం వైఖరి సరిగా లేదు: మంత్రి సీతక్క
ప్రభుత్వ విద్య బలోపేతం కోసం కేంద్రం నిధులు పెంచాలి: సీతక్క
గతంలో పెద్ద ఎత్తున కలుషిత ఆహార ఘటనలు జరిగాయి: సీతక్క
రాజకీయాలు కాదు.. విద్యార్థుల సంరక్షణ ముఖ్యం: మంత్రి సీతక్క
హాస్టల్ వ్యవస్థను మేం ధ్వంసం చేసినట్టు మాట్లాడటం సరికాదు: మంత్రి సీతక్క
డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచాం, మౌలిక వసతులు కల్పిస్తున్నాం: మంత్రి సీతక్క
ఆశ్రమ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం: మంత్రి సీతక్క
ఆశ్రమ పాఠశాలలను కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నాం: సీతక్క
విద్యారంగంపై కేంద్ర ప్రభుత్వం వైఖరి సరిగా లేదు: మంత్రి సీతక్క
-
2025-03-17T10:21:55+05:30
అమెరికాలో రోడ్డుప్రమాదం.. తెలంగాణ వాసులు మృతి..
అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం
ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి
మృతులు ప్రగతిరెడ్డి(35), హర్వీన్(06), సునీత(56)
మృతులు రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మం. టేకులపల్లి వాసులు
-
2025-03-17T10:17:37+05:30
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
హైదరాబాద్: మూడో రోజు ప్రారంభమైన తెలంగాణ శాసనసభ, శాసన మండలి సమావేశాలు
ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఉభయ సభలు
మరికాసేపట్లో ఐదు బిల్లులు ప్రవేశపెట్టనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు
-
2025-03-17T10:13:38+05:30
సభ్యులపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ అసహనం..
ఏపీ అసెంబ్లీలో కొంతమంది సభ్యులు ఫోన్ మాట్లాడుతున్నారు: డిప్యూటీ స్పీకర్ రఘురామ
అత్యవసర పరిస్థితి అయితే బయటకు వెళ్లి ఫోన్ మాట్లాడాలి: రఘురామ
ఫోన్‌ను సభ్యులు సైలెంట్‌లో పెట్టుకోవాలి: డిప్యూటీ స్పీకర్ రఘురామ
విజ్ఞప్తులు ఒకట్రెండు సార్లు మాత్రమే ఉంటాయి: రఘురామ
ఈ సందర్భంగా అసెంబ్లీలో జామర్లు పెట్టాలన్న సభ్యుడు జోగేశ్వరరావు
మన బలహీనత జామర్లపైకి నెట్టొద్దన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ
-
2025-03-17T09:51:11+05:30
సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే..
అమరావతి: ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీకి రానున్న సీఎం చంద్రబాబు
10:30 నుంచి మధ్యాహ్నం 02:50 గంటల వరకూ హాజరుకానున్న ముఖ్యమంత్రి
మధ్యాహ్నం 03:00 నుంచి 05:30 వరకూ సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ
సాయంత్రం 06:00 నుంచి 07:00 గంటల వరకూ ఆర్టీజీఎస్, పర్సెప్షన్‌పై సీఎం సమీక్ష
రాత్రి 07:15 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు
-
2025-03-17T09:41:35+05:30
బీజేపీ ఎంపీకి ఫోన్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణతో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఎంపీ అరుణ ఇంట్లో అగంతకుడు చొరబడిన ఘటనపై ఆరా తీసిన రేవంత్ రెడ్డి
ఘటన జరిగిన తీరు, తన అనుమానాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన మంత్రి
భద్రత పెంచుతామని డీకే అరుణకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
భద్రత పెంచాలంటూ పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి
చొరబాటుపై విచారణ వేగవంతం చేసి వాస్తవాలు తేల్చాలని పోలీసు శాఖకు ఆదేశం
-
2025-03-17T09:32:15+05:30
ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు
ఉదయం 9 గంటలకే ప్రారంభమైన పరీక్షలు, భారీగా తరలివచ్చిన విద్యార్థులు
ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకూ టెన్త్ పరీక్షలు
ఏపీవ్యాప్తంగా పరీక్షలకు సన్నద్ధమైన 6,49,884 మంది విద్యార్థులు
ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు
ఏలూరు జిల్లాలో 133 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు
రెగ్యులర్ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 25,179 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు
ఓపెన్ స్కూల్స్ నుంచి 793 మంది విద్యార్థులు, వారి కోసం 17 కేంద్రాలు ఏర్పాటు
పరీక్షల నిర్వహణకు 1,120 మంది ఇన్విజిలేటర్లను నియమించిన ప్రభుత్వం
మాల్ ప్రాక్టీస్ జరగకుండా ప్రతిష్ట చర్యలు చేపట్టిన జిల్లా యంత్రాంగం
-
2025-03-17T09:18:32+05:30
నేడు ప్రవేశపెట్టే ఐదు కీలక బిల్లులు ఇవే..
హైదరాబాద్: నేడు మూడో రోజు ప్రారంభంకానున్న శాసనసభ, శాసన మండలి సమావేశాలు
ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న ఉభయ సభలు
నేటి నుంచి ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలు, ఈరోజు అసెంబ్లీకి ఐదు కీలక బిల్లులు
శాసనసభలో ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ బిల్లు ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ రెండు వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టనున్న సీఎం
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని పేరు మారుస్తూ చట్ట సవరణ బిల్లును పెట్టనున్న ముఖ్యమంత్రి
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా మార్చిన ప్రభుత్వం
విద్యా, ఉద్యోగ అవకాశాల్లో బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి పొన్నం ప్రభాకర్
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ మరో బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ దేవాదాయ, ధార్మిక, హిందూ మత సంస్థల సవరణ బిల్లు సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి సురేఖ
శాసన మండలిలో నేడు ప్రశ్నోత్తరాలు మాత్రమే అవకాశం
-
2025-03-17T08:29:22+05:30
దస్తగిరి భార్యపై దాడి.. విచారణ చేపట్టిన పోలీసులు..
కడప: వైఎస్ వివేకా హత్య కేసు కీలక సాక్షి దస్తగిరి భార్య షబానాపై దాడి
ఖుల్సుమ్, పర్వీన్ అనే మహిళలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దస్తగిరి భార్య
కొండూరు మండలం మల్లెల గ్రామంలో తనపై దాడి జరిగిందని ఫిర్యాదు
ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న పోలీసులు
జగన్ మోహన్ రెడ్డి, అవినాశ్ రెడ్డిపై తప్పుడు సాక్ష్యాలు చెబుతున్నారంటూ దాడి చేశారని ఫిర్యాదు
తన భర్త దస్తగిరిని చంపుతామని ఇద్దరు మహిళలూ బెదిరించినట్లు చెబుతున్న షబానా
దస్తగిరిని ముక్కలు ముక్కలుగా నరుకుతామని.. జగన్, అవినాశ్ అంతు చూస్తారని బెదిరించినట్లు వెల్లడి
తనకు, భర్త దస్తగిరికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరిన బాధితురాలు షబానా
-
2025-03-17T08:11:57+05:30
ఘోర ప్రమాదం.. ఒక్కసారిగా బోల్తాపడిన బస్సు..
అనకాపల్లి: ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరు జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం
ప్రమాదవశాత్తూ బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 10 మందికి పైగా మహిళలకు తీవ్రగాయాలు
బాధితులను నక్కపల్లి సీహెచ్‌సీకి తరలించి వైద్యం అందిస్తున్న స్థానికులు
రొయ్యల హేచరీకి కార్మికులను తరలిస్తుండగా ప్రమాదవశాత్తూ బోల్తాపడిన బస్సు
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
-
2025-03-17T08:06:10+05:30
ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం..
ప్రకాశం: వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం
సుబ్బారెడ్డి తల్లి ఎర్రం పిచ్చమ్మ(85) అనారోగ్యంతో మృతి