Share News

YSRCP: రాష్ట్రంలో రెండే రెండు పథకాలు అమలు అవుతున్నాయి: కన్నబాబు

ABN , Publish Date - Feb 23 , 2025 | 01:54 PM

వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని కురసాల కన్నబాబు స్పస్టం చేశారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు మడత పెట్టి బీరువాలో పెట్టేశారని విమర్శించారు. రాష్ట్రంలో రెండే రెండు పథకాలు అమలు అవుతున్నాయని, అవి చంద్రన్న పగ, దగా పథకాలు మాత్రమేనని విమర్శించారు.

YSRCP: రాష్ట్రంలో రెండే రెండు పథకాలు అమలు అవుతున్నాయి: కన్నబాబు
Kurasala Kannababu..

విశాఖ: రీజినల్ కోఆర్డినేటర్‌గా తనను నియమించినందుకు వైఎస్సార్‌సీపీ నేత (YSRCP Leader) మాజీ మంత్రి కురసాల కన్న బాబు (Ex Minister (Kurasala Kanababu) పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి (YS Jagan)కి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.... వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అంతా ఒక టీమ్ వర్క్‌గా పనిచేయాలని పిలుపిచ్చారు. గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి విశాఖ యువత రోడ్డు ఎక్కితే... రాష్ట్రం అంతా ఈ సమస్య తీవ్రత తెల్సిందని అన్నారు. అసలైన యువగళం ఎలా ఉంటుందో... పాలకులకు తెలిసిందన్నారు.

ఈ వార్త కూడా చదవండి..

గవర్నర్ ప్రసంగానికే జగన్..: జవహర్


పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన పోరాడుతుందని కన్నబాబు స్పస్టం చేశారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు మడత పెట్టి బీరువాలో పెట్టేశారని విమర్శించారు. రాష్ట్రంలో రెండే రెండు పథకాలు అమలు అవుతున్నాయని, అవి చంద్రన్న పగ, దగా పథకాలు మాత్రమేనని అన్నారు. త్వరలోనే ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన చేస్తానని.. జనసేన పార్టీని ఉద్దేశించి కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం జగన్ సైన్యంలా ముందుకు కదులుతామని... మాది జగన్ సేన అని, రాష్ట్రంలో ఉన్న అన్ని సేనల కంటే జగన్ సేన చాలా బలమైనదని అన్నారు. పార్టీకి కీలక నేతలు రాజీనామాపై స్పందించిన ఆయన... పార్టీని కొంతమంది విడిచిపెట్టడం, మరి కొంతమంది రావడం రాజకీయాలలో సర్వసాధారణమని అన్నారు. వెళ్లిన వారు వెనక్కి వస్తారని...కొత్తగా ఎవరూ వెళ్లరని కన్నబాబు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈ గేట్ నుండే అసెంబ్లీకి జగన్..

రాజలింగమూర్తి హత్య ఎలా జరిగిందంటే..

జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి: వైవి సుబ్బారెడ్డి

ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని స్వామికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

రాజలింగమూర్తి హత్య కేసుపై వీడిన సస్పెన్స్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 23 , 2025 | 01:54 PM