Share News

Minister Lokesh: గాడి తప్పిన పాలనను సరిచేస్తున్నాం: మంత్రి నారా లోకేష్‌

ABN , Publish Date - Jan 05 , 2025 | 01:16 PM

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఉన్న విషయం వాస్తవమని.. దీనికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేస్తోందని, గాడి తప్పిన పాలనను సరిచేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరూ సందేహపదవద్దని మీడియాకు తెలిపారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.

Minister Lokesh: గాడి తప్పిన పాలనను సరిచేస్తున్నాం: మంత్రి నారా లోకేష్‌
AP Minister Lokesh

విశాఖపట్నం: మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఆదివారం విశాఖ (Visakha)లో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పర్యటన (Visit)పై కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై మంత్రులు, ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్యేలు, అధికారులతో ఆయన సమీక్షించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని మోదీ నక్కపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఉత్తరాంధ్రకు జగన్‌రెడ్డి చేసిందేమీ లేదని, ఒక్క ఐటీ పరిశ్రమను కూడా తీసుకురాలేదని మండిపడ్డారు. కియా పరిశ్రమ కూడా చంద్రబాబే తీసుకొచ్చారని చెప్పారు. గతంలో సీపీఎస్ రద్దు చేస్తామన్నారు.. చేశారా.. అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు మేం చెల్లిస్తున్నామని, గాడి తప్పిన పాలనను సరిచేస్తున్నామని, విశాఖకు భారీగా ఐటీ కంపెనీలను తీసుకొస్తామని మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు.


రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు..

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఉన్న విషయం వాస్తవమని.. దీనికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేస్తోందని, గాడి తప్పిన పాలనను సరిచేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరూ సందేహపదవద్దని మీడియాకు తెలిపారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. వైఎస్సార్‌సీపీ ఒక ఫేక్ పార్టీ అని.. అన్నీ ఫేక్ ప్రచారాలు చేస్తుందని.. వాటిని నమ్మవద్దని అన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఉన్న కంపీనీలు పోయాయని అన్నారు. ఈ సందర్బంగా గత ప్రభుత్వం లోపాలన్నీ మంత్రి లోకేష్ మీడియా ముందు వెల్లడించారు.


కాగా ఏపీలో ఈ నెల 8న ప్రధాని మోదీ పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా ఇంచార్జ్‌గా మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. మోదీ సభ సక్సెస్ కోసం లోకేష్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఆదివారం విశాఖకు వచ్చిన మంత్రి నారా లోకేష్ ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. అధికారులు, స్థానిక నేతలతో చర్చలు జరిపారు. నరేంద్రమోదీ నగర పర్యటన నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పలువురు ఐఏఎస్‌ అధికారులను ఏర్పాట్ల పర్యవేక్షణకు నియమించారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌, జాయింట్‌ కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, జీవీఎంసీ కమిషనర్‌ సంపత్‌కుమార్‌, వీఎంఆర్‌డీఎ కమిషనర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌తోపాటు ఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ, పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్‌, సబ్‌కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌, పాలకొండ సబ్‌ కలెక్టర్‌ యశ్వంతకుమార్‌రెడ్డిలకు ప్రధాని పర్యటనకు సంబంధించి పలు బాధ్యతలు అప్పగించారు. వీరు కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మరో పది మంది డిప్యూటీ కలెక్టర్లు, 20 మంది తహసీల్దార్లు, ఇంకా రవాణ, పౌర సరఫరాలు, రోడ్లు, భవనాల శాఖల నుంచి అధికారులను నియమించారు. జన సమీకరణ, బహిరంగ సభ, వేదిక, గ్యాలరీల ఏర్పాటు, ఇతర పనుల పర్యవేక్షణ నిమిత్తం మొత్తం 42 కమిటీలు వేశారు. ప్రతి కమిటీకి జిల్లా అధికారి ఒకరు నేతృత్వం వహిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కోతలపాలన.. ఎగవేతల ప్రభుత్వం..: ఎంపీ డాక్టర్ లక్ష్మణ్

హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు..

మోసానికి మారు పేరు కాంగ్రెస్: కేటీఆర్

నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్..

విశాఖ కలెక్టరేట్‌లో మంత్రి లోకేష్ సమీక్ష సమావేశం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 05 , 2025 | 01:16 PM