Smart Pension Plan LIC : ఈ సింగిల్ పేమెంట్ ఎల్ఐసీ ప్లాన్‌తో.. లైఫ్ లాంగ్ గ్యారెంటీ ఆదాయం..
ABN , Publish Date - Feb 19 , 2025 | 04:54 PM
Smart Pension Plan LIC : ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కొత్త పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ఇదొక సింగిల్ ప్రీమియం ప్లాన్. ఇందులో సింగిల్ లేదా జాయింట్ లైఫ్ యాన్యుటీ కొనుగోలు చేస్తే మీకు జీవితాంతం ఆదాయం రావడం గ్యారెంటీ..

Smart Pension Plan LIC : దేశంలో అందరూ నమ్మే బీమా సంస్థల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నే టాప్ సంస్థ. ఈ ప్రభుత్వరంగ సంస్థలో పెట్టుబడులు పెడితే తమ సొమ్ము క్షేమంగా ఉంటుందని.. భవిష్యత్తులో అనుకున్న మొత్తం తిరిగొస్తుందని చాలామంది ప్రజల విశ్వాసం. కానీ, ఎల్ఐసీలో అనే రకాల స్కీంలు, ప్లాన్లు ఉంటాయి. ఏది మంచిది అనే సందేహం రావచ్చు. ఏది ఏమైనా ఎల్ఐసీ కొత్తగా ప్రవేశపెట్టిన ప్లాన్ అన్ని రకాల ఆదాయ వర్గాలకు మేలు చేసేదే. ఈ పథకం సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ యాన్యుటీ సదుపాయాలు ఉంటాయి. ఈ ప్రీమియం యాన్యుటీ ఒక్కసారి కొనుగోలు చేస్తే జీవితాంతం స్థిరమైన ఆదాయం గ్యారెంటీగా లభిస్తుంది. మరిన్ని వివరాలు మీకోసం..
పదవీ విరమణ సంపాదనకు ముగింపు కాదు—ఇది ఆర్థిక స్వేచ్ఛకు నాంది! అనే నినాదంతో LIC ఆఫ్ ఇండియా స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ప్రారంభించింది. దీని ద్వారా జీవితాంతం ఒత్తిడి లేకుండా స్థిరమైన ఆదాయం పొందవచ్చు. కనీస యాన్యుటీ మొత్తం రూ. 1,000గా నిర్ణయించారు. ఇందులో నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్, నాన్-లింక్డ్ ప్లాన్, తక్షణ యాన్యుటీ ప్లాన్ (ప్లాన్ 879), ఇండివిడ్యువల్/ గ్రూప్, సేవింగ్స్ ఉంటాయి. సంవత్సర యాన్యుటీ, 6 నెలలు, 3 నెలలు, నెలవారీ యాన్యుటీలకు చెల్లింపులు చేసుకునే సదుపాయం ఉంది. రూల్స్‌కు లోబడి పూర్తిగా లేదా ఎంతో కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. రుణాలు కూడా పొందవచ్చు.
స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు :
18- 100 సంవత్సరాల వయసు వారు ఎవరైనా LIC స్మార్ట్ పెన్షన్ ప్లాన్ కొనుగోలు చేయవచ్చు. అయితే, యాన్యుటీ ఎంపికలను బట్టి అర్హత వయసు మారవచ్చు. యాన్యుటీ ఎంపికలను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒకసారి ఎంచుకున్న తర్వాత దానిని మార్చలేము.
LIC స్మార్ట్ పెన్షన్ ప్లాన్ కింద కనీస కొనుగోలు రూ. 1 లక్ష. గరిష్ఠ కొనుగోలుకు పరిమితి లేదు. అయితే, గరిష్ఠ కొనుగోలు ధర బోర్డు ఆమోదించిన అండర్ రైటింగ్ పాలసీ ప్రకారం అంగీకారానికి లోబడి ఉంటుంది. జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS) చందాదారులకు తక్షణ యాన్యుటీని ఎంచుకునే సదుపాయం ఉంది.
యాన్యుటీ మోడ్‌ను బట్టి LIC కనీస యాన్యుటీ మొత్తాన్ని రూ. 1,000గా నిర్ణయించింది. ఇందులో నెలకు రూ. 1,000 , 3 నెలలకు రూ. 3,000, 6 నెలలకు రూ. 6,000, సంవత్సరానికి రూ. 12,000 చొప్పున యాన్యుటీలు ఉంటాయి.
ఇందులో ఫ్రీ-లుక్ పీరియడ్ లేదా మూడు నెలలు దాటాక ఆదాయపు పన్ను మినహాయించి రుణాలు కూడా పొందవచ్చు.
స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ముఖ్య ప్రయోజనాలు :
సింగిల్ ప్రీమియం తక్షణ యాన్యుటీ ప్లాన్. జీవితాంతం పెన్షన్ అందుకోవచ్చు.
5/10/15/20 ఇలా ఎంచుకున్న కాలమంతా పెన్షన్ రావడం గ్యారెంటీ. ఇంకా ప్రతి ఏటా 3% లేదా 6% పెన్షన్ పెరుగుతూనే ఉంటుంది. జీవితాంతం పెన్షన్ అందుకునే యాన్యూటినీ ఎంపిక చేసుకోవచ్చు.
మీ అవసరాలకు తగినట్టు వివిధ యాన్యుటీ ఎంపికలు. సింగిల్ లైఫ్ యాన్యుటీ, జాయింట్ లైఫ్ యాన్యుటీలు ఎంచుకునే సౌలభ్యం. జాయింట్ లైఫ్ పెన్షన్ ఎంచుకుంటే భార్యభర్తలు ఇద్దరికీ లైఫ్ లాంగ్ పెన్షన్.
వార్షిక, అర్ధ-వార్షిక, త్రైమాసిక, నెలవారీ యాన్యుటీ చెల్లింపుల విధానాలు ఉంటాయి. గరిష్ఠ కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలు. వంద శాతం పెన్షన్ గ్యారెంటీ. కొనుగోలుకు పెట్టిన పెట్టుబడి పూర్తిగా రిఫండ్.
పాలసీదారుడి మరణానంతరం నామినీ/లబ్ధిదారునికి ప్రోత్సాహకాలు. 50% లేదా 100% పెన్షన్ భాగస్వామికి వచ్చే అవకాశం. 75 నుంచి 80 ఏళ్ల వయస్సు వచ్చేసరికి పెట్టుబడి పెట్టిన మొత్తం తిరిగి వచ్చేలా కూడా పెన్షన్ ఆప్షన్ ఉంటుంది.
ఈ పాలసీని ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. పూర్తి వివరాలకు ఎల్‌ఐసీ ఏజెంట్లు లేదా అధికారిక వెబ్‌సైట్ సంప్రదించండి. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాల కోసం అధికారిక సేల్స్ బ్రోచర్ పై క్లిక్ చేయండి.
Read Also : రూట్ మార్చిన ఎఫ్‌ఐఐలు.. ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు..
FASTag: మార్చి 1, 2025 నుంచి ఫాస్టాగ్ నిలిపివేస్తున్నారా.. కారణమిదేనా..
మరిన్ని బిజినెస్, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..