Share News

Business Idea : రూ.4వేలు ఉంటే చాలు.. ఈ పనితో ఇంటి నుంచే ప్రతి నెలా రూ.85 వేలు గ్యారెంటీ..

ABN , Publish Date - Mar 26 , 2025 | 02:01 PM

Business Idea : ఉద్యోగావకాశాల కోసం తిరిగి తిరిగి అలసిపోయారా లేదా చేస్తున్న జాబ్ వదిలేసి సొంతంగా తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ ఐడియా మీకోసమే..పరోక్షంగా భారతీయ రైల్వేకు సేవలందిస్తూ ఇంట్లో కూర్చునే లక్షల్లో సంపాదించే మార్గముందని మీకు తెలుసా..

Business Idea : రూ.4వేలు ఉంటే చాలు.. ఈ పనితో ఇంటి నుంచే ప్రతి నెలా రూ.85 వేలు గ్యారెంటీ..
IRCTC Ticket Booking Agent

Business Idea : చదివిన చదువుకు తగిన ఉద్యోగం దొరక్క ఇబ్బందిపడుతున్న వారెందరో. ఉన్న ఊళ్లో ఉపాధి దొరక్క.. సిటీల్లో పనిచేయలేక సతమతమయ్యేవారిది మరో బాధ. నెలంతా కష్టపడ్డా ఒక్కరోజులోనే జీతానికి రెక్కలొచ్చి ఎగిరిపోతుంది. అదే సొంతూళ్లో అయితే భారీ రెంట్లు, అనవసర ఖర్చులు ఉండనే ఉండవు. ఈ ఉద్దేశంతోనే చాలామంది ఇంట్లోనే ఉండి చేయగలిగే వ్యాపారం ఏదైనా ఉందా అని అన్వేషిస్తుంటారు. అలాంటివారికోసమే ఈ ఐడియా. పల్లె, పట్టణం, సిటీ ఎక్కడ నుంచిైనా ఈ పని చేసుకోవచ్చు. పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ డబ్బు లేదని బాధపడేవారికి రైల్వే టికెట్ బుకింగ్ వ్యాపారం బెస్ట్ ఛాయిస్. ప్రతి నెలా ఎక్కువ శ్రమపడకుండానే లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అందుకోసం మీరు ముందుగా రైల్వే ఏజెంట్‌గా అవకాశం సంపాదించాలి. అది కూడా చాలా సింపుల్.


భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ అని చాలామందికి తెలిసే ఉంటుంది. సామాన్యులు తక్కువ ఖర్చుతో ఎక్కడికైనా ప్రయాణించగలిగే రవాణా వ్యవస్థ ఇదొక్కటే. ఇక రైళ్లలో టికెట్ బుకింగ్ కోసం ఎంత పోటీ ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. ఏడాది మొత్తం ఒకే తరహా డిమాండ్ ఉన్నది రైల్వే టికెట్లకు ఒక్కటే. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాణీకులకు టికెట్ బుకింగ్ సహా అనేక సౌకర్యాలను అందిస్తుందని తెలీనివారుండరు. అయితే, IRCTC ఏజెంట్‌గా మారితే రైల్వే టికెట్ బుకింగ్‌ వ్యాపారం ప్రారంభించవచ్చని అతి తక్కువ మందికే తెలుసు.


irctc.jpgIRCTC టికెట్ ఏజెంట్ ఎలా అవ్వాలి?

రైల్వే టికెట్ కౌంటర్‌లో క్లర్కులు టిక్కెట్లు జారీ చేసినట్లే IRCTC టికెట్ ఏజెంట్లు కూడా ప్రయాణీకులకు రైల్వే టిక్కెట్లు జారీ చేయాలి. 18 ఏళ్లు నిండిన వారెవరైనా IRCTC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఏజెంట్ అవకాశం కోసం నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, మీకు ఒక షాప్, కంప్యూటర్, ప్రింటర్, ఇంటర్నెట్ కనెక్షన్, వీటిని ఆపరేట్ చేయగలిగే కనీస నైపుణ్యం ఉందనే రుజువులు సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత కేవలం రూ.3999 రుసుము చెల్లిస్తే చాలు. రైల్వే టికెట్ బుకింగ్ ఏజెంట్ అవుతారు. ఒక్కసారి ఈ అవకాశం వస్తే ఈ పనిచేస్తూ ప్రతి నెలా లక్షల రూపాయలు సంపాదించవచ్చు.


రిజిస్ట్రేషన్ రుసుము ఎంత?

IRCTC టికెట్ ఏజెంట్ కావాలంటే సంవత్సరకాల వ్యవధికి కట్టాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 3,999. 2 సంవత్సరాలకు అయితే ఫీజు మొత్తం రూ. 6,999. మీరు రెండు సంవత్సరాలు ఏజెంట్‌గా పనిచేయాలని కోరుకుంటున్నారా లేదా ఒక సంవత్సరం మాత్రమే ఏజెంట్‌గా ఉండాలనుకుంటున్నారా అనేది మీ ఇష్టం. ఈ రుసుమును జమ చేసిన తర్వాత మీరు ఏజెంట్‌గా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందుతారు. ఆ తర్వాత మీరు రైల్వే కింద టికెట్ ఏజెంట్‌గా పనిచేయడం మొదలుపెట్టవచ్చు.


నెలలో ఎన్ని టిక్కెట్లు అమ్మవచ్చు?

IRCTC టికెట్ ఏజెంట్ అయిన తర్వాత మీరు ఒక నెలలో 100 టిక్కెట్లను బుక్ చేస్తే ఒక్కో టికెట్‌పై రైల్వేకు రూ. 10 రుసుము చెల్లించాలి. 101 నుంచి 300 టిక్కెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్‌పై రూ.8 రుసుము చెల్లించాలి. నెలలో 300 కంటే ఎక్కువ టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ కు రూ.5 చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఒక నెలలో ఎన్ని టిక్కెట్లనైనా బుక్ చేసుకోవచ్చు. అంటే టికెట్ బుకింగ్‌పై ఎటువంటి పరిమితి లేదు. IRCTC ఏజెంట్‌గా నమోదైన ఎవరైనా 15 నిమిషాల్లోనే తక్షణ టికెట్ బుకింగ్ సౌకర్యం పొందుతారు.


ఎంత కమిషన్ వస్తుంది?

నాన్ ఏసీ కోచ్ టికెట్ బుక్ చేసుకుంటే మీకు ఒక్కో టికెట్ కు 20 రూపాయల కమీషన్ లభిస్తుంది. ఏసీ క్లాస్ టికెట్ బుక్ చేసుకుంటే ఒక్కో టికెట్ కు 40 రూపాయల కమీషన్ వస్తుంది. ఇది మాత్రమే కాదు. ప్రతి టికెట్ ధరలో ఒక శాతం ఏజెంట్‌కు లభిస్తుంది. ఈ పని మొదలుపెట్టాక ప్రతి నెలా మినిమం రూ.85వేలు సంపాదించవచ్చు.


IRCTC ఏజెంట్ కావడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే టిక్కెట్ల బుకింగ్‌పై ఎటువంటి పరిమితి లేదు. మీరు ఎంత ఎక్కువ టిక్కెట్లు బుక్ చేసుకుంటే అంత ఎక్కువగా సంపాదించగలుగుతారు. ఇదే కాకుండా ఏజెంట్లు 15 నిమిషాల్లోనే టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని పొందుతారు. వీళ్లు దేశీయ రైల్వే టికెట్ బుకింగ్‌తో పాటు అంతర్జాతీయ రైల్వే టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు.


Read Also : New Business Idea: ఈ చెట్టు ఆకులు అమ్మితే ఏడాదంతా డబ్బే డబ్బు ...

Business Ideas For Women: ఈ మెషిన్ ఒక్కటి కొంటే.. ఇంట్లోనే రోజూ ...

Business Ideas: రోజులో రెండు గంటలు ఈ పనిచేస్తే చాలు.. మహిళలకు ఇంటి ...

Updated Date - Mar 26 , 2025 | 02:08 PM