Share News

Budget 2025: కేంద్ర వార్షిక బడ్జెట్ ఎంత.. ఏయే శాఖలకు ఎంత కేటాయించారు

ABN , Publish Date - Feb 01 , 2025 | 01:29 PM

Budget 2025: రూ. 50,65,345 కోట్లతో 2025-26 ఏడాది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. రక్షణ శాఖకు అధికంగా నిధులు కేటాయించింది కేంద్రం.

Budget 2025: కేంద్ర వార్షిక బడ్జెట్ ఎంత.. ఏయే శాఖలకు ఎంత కేటాయించారు
Union Budget 2025

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర వార్షిక బడ్జెట్‌2025-26ను (Union Budget 2025) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ Union Minister Nirmala Sitharaman) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 50,65,345 కోట్లతో 2025-26 ఏడాది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ప్రధానంగా మధ్యతరగతి ప్రజానీకానికి భారీ ఊరట లభించింది. రూ.12 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పూర్తిగా పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే రక్షణ శాఖకు అధికంగా నిధులు కేటాయించింది కేంద్రం. ఏఏ రంగాలకు ఎంత మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారో ఇప్పుడు చూద్దాం.


వివిధ శాఖలకు కేటాయింపులు ఇవే..

  • రక్షణ రూ. 4,91,732 కోట్లు

  • గ్రామీణాభివృద్ది రూ. 2,66,817 కోట్లు

  • హోం రూ. 2,33,211 కోట్లు

  • వ్యవసాయ, అనుబంధ రంగానికి రూ. 1,71,437 కోట్లు

  • విద్య రూ. 1,28,650 కోట్లు

  • ఆరోగ్య రూ. 98,311 కోట్లు

  • పట్టణాభివృద్ది రూ. 96,777 కోట్లు

  • ఐటి, టెలికం రూ. 95,298 కోట్లు

  • విద్యుత్‌ రూ. 81,174 కోట్లు

  • వాణిజ్య, పరిశ్రమలు రూ. 65,553 కోట్లు

  • సామాజిక సంక్షేమం రూ. 60,052కోట్లు

  • వైజ్ఞానికి విభాగాలకు రూ. 55,679 కోట్లు

    budget-allocations.jpg


కేంద్రానికి వచ్చే ఆదాయం...

  • ఆదాయపన్ను నుంచి 22 శాతం

  • కేంద్ర ఎక్సైజ్‌ నుంచి 5 శాతం

  • జిఎస్టి, ఇతర పన్నుల నుంచి 18 శాతం.

  • కార్పొరేషన్‌ పన్ను ద్వారా 17 శాతం

  • కస్టమ్స్‌ ద్వారా... 4 శాతం

  • అప్పులతో కాని క్యాపిటల్‌ రిసిప్ట్స్‌ ద్వారా 1 శాతం

  • పన్నేతర ఆదాయం 9 శాతం

  • అప్పులు, ఇతర మార్గాల ద్వారా 24 శాతం ఆదాయం సమకూరుతుంది.


కేంద్ర ఖర్చులు....

  • వడ్డీ చెల్లింపులకు 20 శాతం

  • కేంద్ర ప్రభుత్వ పథకాలకు 16 శాతం

  • కీలక సబ్సిడీలకు 6 శాతం

  • రక్షణ రంగానికి 8 శాతం

  • రాష్ట్రాలకు పన్నులు, డ్యూటీల ద్వారా చెల్లింపుల్లో 22 శాతం

  • ఫైనాన్స్‌ కమిషన్‌, ఇతర బదిలీల ద్వారా 8 శాతం

  • కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు 8 శాతం

  • ఇతర ఖర్చులకు 8 శాతం

  • పెన్షన్స్‌లకు 4 శాతం


ఇవి కూడా చదవండి..

గూగుల్‌ను నమ్ముకొని కొండల్లోకి..

Budget 2025: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం.. ముఖ్యాంశాలు ఇవే

Read Latest National News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 01:30 PM