Cyber criminals: ఆన్‌లైన్‌లో డ్రెస్ ఆర్డర్ చేస్తే.. బురిడీ కొట్టించి రూ.1.38 లక్షలకు టోకరా
ABN , Publish Date - Jan 04 , 2025 | 10:00 AM
ఆన్‌లైన్‌లో డ్రెస్ ఆర్డర్ చేసిన మహిళను సైబర్ నేరగాళ్లు(Cyber criminals) మోసం చేసి ఆమె ఖాతా నుంచి రూ. 1.38 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన 59 ఏళ్ల మహిళకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన కనిపించింది.
హైదరాబాద్ సిటీ: ఆన్‌లైన్‌లో డ్రెస్ ఆర్డర్ చేసిన మహిళను సైబర్ నేరగాళ్లు(Cyber criminals) మోసం చేసి ఆమె ఖాతా నుంచి రూ. 1.38 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన 59 ఏళ్ల మహిళకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన కనిపించింది. ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు డ్రెస్‌లు అమ్మబడును అని అందులో రాసి ఉంది. ఆమె ఆ లింక్‌ను క్లిక్ చేసి డ్రెస్ ఆర్డర్ చేసింది. దాని ఖరీదు రూ. 1,150 ఆన్‌లైన్‌లో చెల్లించింది. రెండు రోజుల తర్వాత గుర్తుతెలియని వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడు.
ఈ వార్తను కూడా చదవండి: Cyber criminals: ఆ ఖాతాల్లోనే ‘సైబర్’ సొమ్ము
మీరు ఆర్డర్ చేసిన డ్రెస్ డెలివరీ చేయాల్సిన బాయ్‌కి జ్వరం వచ్చిందని, సకాలంలో డెలివరీ చేయలేకపోతున్నామని, మీ డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పాడు. మీ ఖాతాకు రూ. 1 పంపిస్తున్నామని, చెక్ చేసుకోమన్నాడు. ఆ తర్వాత రూ.10 బదిలీ చేసిన లింక్ పంపాడు. బాధితురాలు చెక్ చేసుకునే క్రమంలో ఆ లింక్‌ను క్లిక్ చేయగానే ఆమె ఫోన్ హ్యాక్ అయింది. ఓటీపీలు రాకుండానే ఆ మహిళ ఖాతా నుంచి రూ. 1,38,171లు కాజేశారు.
ఖాతాలో డబ్బులు డెబిట్ అయిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు(City Cyber Crime Police) ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి మోసపూరితమైన వెబ్‌సైబ్ క్లిక్ చేసినప్పుడే ఆమె బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌ను సైబర్ నేరగాళ్లు తెలుసుకుని ఉంటారని, పథకం ప్రకారం డెలివరీ సమస్యను సృష్టించి డబ్బులు కాజేసి ఉంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది.
ఈవార్తను కూడా చదవండి: Nampally Court : అల్లు అర్జున్‌కు ఊరట
ఈవార్తను కూడా చదవండి: ‘మా శవయాత్రకు రండి’ వ్యాఖ్యపై కేసు కొట్టివేయండి: కౌశిక్‌రెడ్డి
ఈవార్తను కూడా చదవండి: West Godavari: ఏపీ యువకుడి దారుణ హత్య
ఈవార్తను కూడా చదవండి: Bus Accident: కేరళలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా
Read Latest Telangana News and National News