Share News

Cyber ​​criminals: విద్యార్థినికి రూ.1.30 లక్షలు బురిడీ.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Jan 10 , 2025 | 08:13 AM

ఆన్‌లైన్‌ షాపింగ్‌(Online shopping) చేసినందుకు గాను.. మీరు ఖరీదైన బహుమతి గెలుచుకున్నారంటూ.. విద్యార్థినిని బురిడీ కొట్టించి రూ. 1.30లక్షలు సైబర్‌ క్రిమినల్స్‌(Cyber ​​criminals) కొల్లగొట్టారు.

Cyber ​​criminals: విద్యార్థినికి రూ.1.30 లక్షలు బురిడీ.. ఏం జరిగిందంటే..

- ఆన్‌లైన్‌ షాపింగ్‌లో బహుమతి గెలిచారంటూ సైబర్‌ కేటుగాళ్ల వల

హైదరాబాద్‌ సిటీ: ఆన్‌లైన్‌ షాపింగ్‌(Online shopping) చేసినందుకు గాను.. మీరు ఖరీదైన బహుమతి గెలుచుకున్నారంటూ.. విద్యార్థినిని బురిడీ కొట్టించి రూ. 1.30లక్షలు సైబర్‌ క్రిమినల్స్‌(Cyber ​​criminals) కొల్లగొట్టారు. మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. బాధితురాలికి ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి వాట్సాప్‌ కాల్‌ వచ్చింది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: పాన్‌షాప్ మాటున గంజాయి చాక్లెట్ల విక్రయం..


తాను ఫాక్స్‌టేల్‌ కంపెనీ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు. మీరు గతంలో మా సంస్థ నుంచి ఆన్‌లైన్‌ షాపింగ్‌(Online shopping) ద్వారా ప్రొడక్టు కొనుగోలు చేశారని, కంపెనీ వార్షికోత్సవం రోజున తీసిన డ్రాలో మీ ఫోన్‌ నంబర్‌కు ఖరీదైన ఉచిత బహుమతి వచ్చిందని నమ్మించాడు. ఆ గిఫ్టు ఓచర్‌ను పంపడానికి, మీ చిరునామాతో పాటు.. రవాణా నిమిత్తం రూ. 5వేలు చెల్లించాలని సూచించారు. ఆ డబ్బులు తిరిగి మీ ఖాతాలో జమ చేస్తామని నమ్మించాడు.


city4.2.jpg

అతని మాటలు నమ్మిన బాధితురాలు అతను చెప్పినట్లు చేసింది. ఆ తర్వాత.. మీకొచ్చిన బహుమతి రూ.లక్షల ఖరీదైందని, కంపెనీ నిబంధనల ప్రకారం.. ముందుగా మీరు జీఎస్టీ, ఇతర టాక్స్‌లు చెల్లించాల్సి ఉందని, అవి కూడా తిరిగి మీ ఖాతాలో జమ చేస్తారని నమ్మించాడు. ఇలా బాధితురాలిని నమ్మించి విడతలవారీగా రూ.1.30లక్షలు కొట్టేశారు. ఇది సైబర్‌ మోసమంటూ బాధితురాలి స్నేహితులు చెప్పడంతో వెంటనే సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


ఈవార్తను కూడా చదవండి: KTR: ప్రశ్నకు ప్రశ్నే జవాబు

ఈవార్తను కూడా చదవండి: Ticket Booking: ‘మీ టికెట్‌’ యాప్‌

ఈవార్తను కూడా చదవండి: వేళకాని వేళలో సినిమా ప్రదర్శనా?

ఈవార్తను కూడా చదవండి: ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఫిర్యాదులకు వెబ్‌సైట్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jan 10 , 2025 | 08:13 AM