Share News

Cyber crime: మహిళను బురిడీ కొట్టించి రూ. 11.92 లక్షలు కొట్టేశారు..

ABN , Publish Date - Jan 09 , 2025 | 11:21 AM

ఐటీ కంపెనీలో ఉద్యోగం ఇస్తామని, ఆ తర్వాత ఆన్‌లైన్‌లో ఇన్వెస్టిమెంట్‌ చేస్తే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించిన క్రిమినల్స్‌ మహిళను బురిడీ కొట్టించి రూ. 11.92 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన 37 ఏళ్ల మహిళకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది.

Cyber crime: మహిళను బురిడీ కొట్టించి రూ. 11.92 లక్షలు కొట్టేశారు..

హైదరాబాద్‌ సిటీ: ఐటీ కంపెనీలో ఉద్యోగం ఇస్తామని, ఆ తర్వాత ఆన్‌లైన్‌లో ఇన్వెస్టిమెంట్‌ చేస్తే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించిన క్రిమినల్స్‌ మహిళను బురిడీ కొట్టించి రూ. 11.92 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన 37 ఏళ్ల మహిళకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది. గూగుల్‌ మ్యాప్స్‌(Google Maps) ద్వారా మేం చెప్పిన 10-15 రెస్టారెంట్లకు రేటింగ్స్‌ ఇవ్వడం, రివ్వ్యూలు రాయడం, వాటిని స్క్రీన్ షాట్స్‌ తీసి పోస్టు చేయడం ద్వారా ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించొచ్చు అని సూచించారు. వారి మాటలు నమ్మిన మహిళ ఉద్యోగానికి సిద్ధపడింది.

ఈ వార్తను కూడా చదవండి: నల్లగొండ ఎక్స్‌రోడ్‌ వంతెన వ్యయం రూ. 97 కోట్లు పెంపు


దాంతో అమెకు ఎంప్లాయీ ఐడీ క్రియేట్‌ చేశారు. వారు చెప్పిన విధంగా టాస్క్‌లు పూర్తి చేసి పంపగానే కొంత నగదును మహిళ ఖాతాలో జమ చేశారు. ఇదిలా ఉండగా.. మీరు మన కంపెనీలోనే చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. అదికూడా నిజమని నమ్మిన బాధితురాలు వారు సూచించిన ఖాతాలో డబ్బు డిపాజిట్‌ చేసింది.


city7.2.jpg

ప్రారంభంలో రూ.3,000 పెట్టుబడి పెడితే.. అదేరోజు రూ.3,880 లాభాలు వచ్చినట్లు చూపించారు. బాధితురాలు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వచ్చినట్లు చూపిస్తూ విడతల వారిగా రూ. 11.92లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: హైడ్రాకు ఫిర్యాదులపై రంగంలోకి రంగనాథ్‌

ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై కేసు పెడితే రౌడీళ్లా ప్రవర్తిస్తున్నారు

ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ సీఎం కావడానికి కారణమిదే.. సంచలన విషయాలు బయటపెట్టిన హరీష్‌రావు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 09 , 2025 | 11:21 AM