NCC Police Jobs: డిగ్రీ అర్హతతో..భారత సైన్యంలో లెఫ్టినెంట్ అయ్యే అవకాశం.. నెలకు రూ.56 వేల స్టైఫండ్..
ABN , Publish Date - Mar 10 , 2025 | 05:52 PM
NCC Special Entry Scheme: పోలీసు ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా.. అయితే, వెంటనే ఈ నోటిఫికేషన్ పరిశీలించండి. డిగ్రీ అర్హతతోనే భారత సైన్యంలో అధికారి అయ్యే అవకాశం అందుకోండి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.

NCC Special Entry Scheme: భారత సైన్యం 58వ NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు (అక్టోబర్ 2025) కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. పురుష,మహిళా అభ్యర్థుల కోసం షార్ట్ సర్వీస్ కమిషన్ (NT)కింద ఈ నియామకం చేపట్టింది దీనితో పాటు ఈ పథకం యుద్ధంలో అమరవీరులైన సైనికుల పిల్లలకు కూడా వర్తిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు 15 మార్చి 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ www.joinindianarmy.nic.in ని సందర్శించండి.
ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కనీస గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే, డిగ్రీలో కనీసం 50% మార్కులు మరియు NCC C సర్టిఫికెట్‌లో కనీసం B గ్రేడ్ కలిగి ఉండటం తప్పనిసరి. ఎంపికైన అభ్యర్థులకు అక్టోబర్ 2025 నుండి 49 వారాల పాటు చెన్నైలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఉంటుంది.
అర్హత :
ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కనీస గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే డిగ్రీలో కనీసం 50% మార్కులు, NCC C సర్టిఫికెట్‌లో కనీసం B గ్రేడ్ కలిగి ఉండటం తప్పనిసరి. ఇది కాకుండా అభ్యర్థి వయస్సు జూలై 1, 2025 నాటికి 19 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ :
ముందుగా అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు తర్వాత అభ్యర్థుల గ్రాడ్యుయేషన్ మార్కుల ఆధారంగా సైన్యం షార్ట్‌లిస్ట్ చేస్తుంది. దీని తరువాత షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను SSB ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో నెగ్గిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. చివరగా ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల చేస్తారు.
శిక్షణ, జీతం :
ఎంపికైన అభ్యర్థులకు అక్టోబర్ 2025 నుండి 49 వారాల పాటు చెన్నైలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ (OTA)లో శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో వారికి ప్రతి నెలా రూ.56,100 స్టైఫండ్ లభిస్తుంది. శిక్షణ తర్వాత అభ్యర్థులకు లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం ఇస్తారు. వారి జీతం సంవత్సరానికి రూ.17-18 లక్షలు ఉంటుంది.
సర్వీస్, పదవీవిరమణ వివరాలు..
ఎంపికైన అభ్యర్థుల గరిష్ట సేవా కాలం 14 సంవత్సరాలు. అందులో కనీసం 10 సంవత్సరాలు తప్పనిసరి. ఒక అభ్యర్థి 5వ, 10వ లేదా 14వ సంవత్సరం తర్వాత సర్వీస్ నుండి పదవీ విరమణ చేయాలనుకుంటే చేయవచ్చు. 10 సంవత్సరాల సర్వీస్ తర్వాత అభ్యర్థులకు శాశ్వత కమిషన్ ఎంపిక కూడా లభిస్తుంది.
Read Also : Group 1 Results Out: తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు వచ్చేశాయ్..
KVS Admissions 2025 : కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చివరితేదీ అప్పుడే..
మరిన్ని చదువు, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..