Share News

SBI Internship 2025: డిగ్రీ పూర్తయినవారికి SBIలో ఇంటర్న్‌షిప్ ఛాన్స్..అస్సలు వదులుకోకండి.. ఒక్కసారి ఎంపికైతే రూ.3.35లక్షల స్టైఫండ్..

ABN , Publish Date - Mar 26 , 2025 | 08:35 PM

SBI Youth For India Fellowship 2025: డిగ్రీ పూర్తయిన నిరుద్యోగులకు మంచి ఛాన్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫెలోషిప్ చేసే అవకాశం అస్సలు వదులుకోకండి. SBI ఇంటర్న్‌షిప్ పథకానికి వెంటనే కింద ఇచ్చిన లింక్ సాయంతో దరఖాస్తు చేసుకోండి.

SBI Internship 2025: డిగ్రీ పూర్తయినవారికి SBIలో ఇంటర్న్‌షిప్ ఛాన్స్..అస్సలు వదులుకోకండి.. ఒక్కసారి ఎంపికైతే  రూ.3.35లక్షల స్టైఫండ్..
SBI Youth For India Fellowship 2025

SBI Youth For India Fellowship 2025: ప్రముఖ NGOల సహకారంతో SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2025-26 గానూ 13 నెలల పెయిడ్ స్టైఫండ్ ఇంటర్న్‌షిప్‌ ఆఫర్ చేస్తోంది. గ్రామీణ భారతదేశంలో సామాజిక మార్పును నడిపించే లక్ష్యంతో ఈ ప్రతిష్టాత్మక ఫెలోషిప్ కార్యక్రమం తీసుకొచ్చారు. ఈ ఫెలోషిప్ ఎంపికైన అభ్యర్థులకు భారతదేశం అంతటా అభివృద్ధి ప్రాజెక్టులలో పనిచేసేందుకు, గ్రామీణ వర్గాల సంక్షేమానికి తోడ్పడే అవకాశం కలుగుతుంది. విద్య, ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధి వంటి కీలక సమస్యలను పరిష్కరించడానికి, గ్రామీణ భారతదేశాన్ని సాధికారపరచి యువతలో సామాజిక బాధ్యత స్ఫూర్తిని పెంపొందించేందుకు కావాల్సిన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు. మెంటర్‌షిప్, ఆచరణాత్మక అనుభవంతో పాటు ఎంపికైన అభ్యర్థులకు పూర్తి కాలంలో రూ.3,37,000 స్టైఫండ్‌ను పొందుతారు. అర్హత, దరఖాస్తు ప్రక్రియ, ప్రయోజనాలు, మరింత పూర్తి సమాచారం కోసం..


మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫెలోషిప్ చేయాలనుకుంటే ఈ అవకాశం మీ కోసమే. యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రామ్ 2025-26 ద్వారా SBI ప్రజలకు పని చేయడానికి, నేర్చుకోవడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. మీ కెరీర్ ప్రారంభంలోనే SBI వంటి పెద్ద బ్యాంకులో పని చేయాలనుకుంటే వెంటనే ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో చేరండి. దీని కోసం మీరు అధికారిక వెబ్‌సైట్ youthforindia.orgలో నమోదు చేసుకోవచ్చు. ఈ ఫెలోషిప్ కార్యక్రమం వ్యవధి 13 నెలలు.


ఈ కార్యక్రమం కింద, SBI గ్రామీణ భారతదేశంలోని సామాజిక వాతావరణంలో పనిచేయడానికి, ఆచరణాత్మక అనుభవాన్ని పొందడానికి మరియు దానిలో సానుకూల మార్పు తీసుకురావడానికి అవకాశాన్ని అందిస్తుంది. ఫెలోషిప్ సమయంలో అభ్యర్థులు విద్య, ఆరోగ్యం, పర్యావరణం వంటి వివిధ రంగాలలో పని చేస్తారు. దరఖాస్తు చేసిన తర్వాత అభ్యర్థులను వ్యక్తిగత ఇంటర్వ్యూకు పిలుస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 31 2025.


అర్హత ..

SBI ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకోవడానికి, అభ్యర్థులు అక్టోబర్ 1, 2025 లోపు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. భారతీయులతో పాటు, నేపాల్, భూటాన్, భారతదేశ విదేశీ పౌరుడు (OCI)లు కూడా ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


వయోపరిమితి..

దరఖాస్తుదారుడి వయోపరిమితి 21 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంత స్టైపెండ్ లభిస్తుంది?

SBI ఈ ఫెలోషిప్ కోసం ఎంపికైన అభ్యర్థులకు 13 నెలల పాటు స్థిరమైన స్టైఫండ్ అందుతుంది. దీనితో పాటు ప్రయాణ భత్యం, ప్రాజెక్ట్ ఖర్చు భత్యం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. కోర్సు పూర్తయ్యాక SBI ఫౌండేషన్ నుంచి ప్రోగ్రామ్ కంప్లీషన్ సర్టిఫికేట్ పొందుతారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 31 2025.


  • నెలవారీ స్టైపెండ్ : వ్యక్తిగత ఖర్చులకు నెలకు రూ.16,000.

  • ప్రయాణ భత్యం : రవాణా కోసం రూ.2,000. ప్రాజెక్ట్ సంబంధిత ఖర్చులకు రూ.1,000.

  • పూర్తి స్టైపెండ్ : 13 నెలల ఇంటర్న్‌షిప్ పూర్తయిన తర్వాత రూ.90,000.

  • ప్రయాణ భత్యాలు : ఇంటి నుండి ప్రాజెక్ట్ సైట్ చేరుకోవడానికి 3AC రైలు ఛార్జీ.

  • భీమా : ఫెలోషిప్ వ్యవధికి ఆరోగ్య, వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజ్.

  • నెట్‌వర్కింగ్ అవకాశాలు : సభ్యులు NGOలతో దగ్గరగా పని చేస్తారు. సామాజిక అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన అవగాహన పొందుతారు.


ఎలా దరఖాస్తు చేయాలి..

  • అధికారిక వెబ్‌సైట్‌ www.change.youthforindia.org సందర్శించి SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ వెబ్‌సైట్‌కు వెళ్లండి .

  • దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించడానికి హోమ్‌పేజీలో 'Apply Online'పై క్లిక్ చేయండి.

  • అవసరమైన అన్ని వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.

  • మీ ప్రొఫైల్ ఫొటో, అవసరమైన ఇతర పత్రాలను అప్‌లోడ్ చేయండి.

  • ఫారమ్ నింపిన తర్వాత దరఖాస్తును సబ్మిట్ చేయండి. రిజిస్ట్రేషన్ విజయవంతం అయిన తర్వాత దరఖాస్తుదారులకు ఇమెయిల్ లేదా SMS ద్వారా నిర్ధారణ అందుతుంది.

నేరుగా అప్లై చేసుకోవడానికి Link Here


Read Also : ఈ సందర్భాల్లో స్కూల్, కాలేజీ ఫీజు చెల్లించనక్కర్లేదు : విద్యా కమిషన్‌ సిఫార్సులు

TGRJC: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. ఇలా చేస్తే ఇంటర్‌లో ఫ్రీ సీటు

Jobs: నెలకు లక్షా 20 వేల జీతం..518 బ్యాంకు పోస్టులకు నేడే లాస్ట్ ఛాన్స్..

Updated Date - Mar 26 , 2025 | 08:38 PM