Share News

Diabtetes Control Tips : ఈ 3 డ్రింక్స్ తాగితే.. షుగర్ సహా 4 వ్యాధుల నుంచి రిలీఫ్..

ABN , Publish Date - Mar 21 , 2025 | 04:35 PM

Tips to Control Diabetes : షుగర్ కంట్రోల్ చేసుకునేందుకు సమయానికి తినడం ఎంత ముఖ్యమో, ఏవి తినాలో తెలుసుకోవడమూ అంతే అవసరం. రక్తంలో చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులు రాకూడదంటే ఈ 3 రకాల పానీయాలు తాగుతూ ఉండండి. మందులు వాడకుండానే డయాబెటిస్ సహా 4 రకాల వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Diabtetes Control Tips : ఈ 3 డ్రింక్స్ తాగితే.. షుగర్ సహా 4 వ్యాధుల నుంచి రిలీఫ్..
Diabtetes Control Drinks

Control Diabtetes Naturally : డయాబెటిస్ సోకినపుడు మనం తగిన జాగ్రత్తలు పాటించకపోతే నిశ్శబ్దంగా మన శరీర భాగాలను చంపేస్తుంది. ఇది ఒకసారి శరీరంపై దాడి చేసే నెమ్మదిగా హాని కలిగిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 83 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఇందులో దాదాపు 14 శాతం 18 సంవత్సరాలు వయసువాళ్లే. అనారోగ్యకరమైన జీవనశైలి, అనారోగ్యకర ఆహారపు అలవాట్ల కారణంగానే చక్కెర సమస్య చాలా సాధారణమైపోయింది. ఈ సమస్య వచ్చినపుడు నియంత్రించుకోవడం తప్ప మన చేతుల్లో ఇంకేమి ఉండదు. గుండె జబ్బులు, మూత్రపిండ వ్యాధులు, నరాల బలహీనత లాంటి సమస్యలు రాకూడదంటే ఈ 3 ఆరోగ్యకర పానీయాలను సేవించండి.


గ్రీన్ టీ

గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు, కాటెచిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. క్రమం తప్పకుండా గ్రీన్ టీని తీసుకునే వారిలో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం గణనీయంగా తగ్గుతోంది. ఇదొక్కటే కాదు. గ్రీన్ టీ తాగితే బరువు నియంత్రణ సాధ్యమవుతుంది. రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు గుండె, మెదడు పనితీరు మెరుగవుతుంది.


ఆపిల్ సైడర్ వెనిగర్

భోజనం తర్వాత ఆపిల్ సైడర్ వెనిగర్ సేవిస్తే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చు. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలోనూ ఇది సాయపడుతుంది. నీటిలో కొద్ది మొత్తంలో ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపుకుని తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇదే కాకుండా ఆపిల్ సైడర్ వెనిగర్ జీర్ణవ్యవస్థకు కూడా చాలా మంచిది. ఇందులోని పెక్టిన్ జీర్ణక్రియ వ్యవస్థను దారిలో పెట్టి మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలను నిరోధిస్తుంది. ఈ పానీయం తాగడం ద్వారా పై సమస్యలన్నింటి నుంచి ఉపశమనం పొందవచ్చు.


దాల్చిన చెక్క టీ

సాధారణ టీలో కాసింత దాల్చి చెక్క ముక్క జోడించి కాచుకుని ప్రతి రోజూ తాగితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. ఇది గ్లూకోజ్ గ్రహించే సామర్థ్యాన్ని పెంచి రక్తంలో షుగర్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా మెరుగవుతుంది. కొలెస్ట్రాల్ సమస్యలు, గుండె వ్యాధుల ముప్పు తగ్గుముఖం పడుతుంది.


Read Also : Raw Fish Or Dry Fish: ఎండు చేపలు Vs పచ్చి చేపలు రెండింటిలో ఏది బెస్ట్..

Vitamin B12 Foods : వీటిని రోజూ తింటే.. విటమిన్ B12 లోపం పరార్..

Diabetes Control Tips: 5 రోజువారీ అలవాట్లతో షుగర్ సహజంగా అదుపులోకి..

Updated Date - Mar 21 , 2025 | 04:40 PM