Share News

Curd Rice:పెరుగన్నం తింటే లాభమా నష్టమా.. ఎందుకు తినాలి

ABN , Publish Date - Mar 26 , 2025 | 07:18 PM

Curd Rice: పెరుగన్నం ఆరోగ్యానికి శ్రేయస్కరం. కొంత మంది పెరుగన్నం అసలు దగ్గరకే రానివ్వరు. పెరుగు లేకుండా ఆహారం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో తీవ్ర సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Curd Rice:పెరుగన్నం తింటే లాభమా నష్టమా.. ఎందుకు తినాలి
Curd Rice

దక్షిణ భారతదేశంలోని ఆహారంలో పెరుగన్నం ఒక ముఖ్య భాగం. భోజనం చివరల్లో పెరుగన్నం తినే సంప్రదాయాన్ని మనం ప్రతి ఇంట చూస్తాం. అయితే పెరుగన్నాన్ని చాలా మంది తినకుండా లైట్ తీసుకుంటారు. భోజనం చేసేటప్పుడు పెరుగన్నం ఎందుకు తినాలి. తినకుంటే ఏమవుతుంది? ఎంత తినాలి. అంటే ఆరోగ్య నిపుణులు ఏం వివరిస్తున్నారంటే..

పెరుగన్నం ఎందుకు తినాలి?: పెరుగులో ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా) ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తీసుకున్న ఆహారంలో మసాలాలు, కారం ఎక్కువ ఉన్నప్పుడు..పెరుగన్నం తీసుకుంటే కడుపు చల్లబరుస్తుంది. ఇంకా ఆయుర్వేద నిపుణుల మాటల్లో చెప్పాలంటే.. ఇది శరీరంలో వాత,పిత్త,కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది. ఇక ఓ అధ్యయనంలో.. రోజూ పెరుగు తినే వారిలో జీర్ణ సమస్యలు 30% తక్కువని తేలింది.


తినకుంటే ఏమవుతోంది?..పెరుగు అన్నం తినకపోవడం వల్ల తక్షణ నష్టం ఉండదు. కానీ జీర్ణ వ్యవస్థ బలహీనపడే అవకాశం ఉంది.మసాలాతో కూడిన ఆహారం తిన్న అనంతరం పెరుగు లేకంటే..అసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తాయి. ఎక్కువ కాలం పెరుగు తినకుంటే.. పేగుల్లోని బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతిని రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో సులభంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.


ఆహారంలో పెరుగు ఎంత మోతాదులో తీసుకోవాలి? ఆరోగ్య నిపుణులు సూచన మేరకు ప్రతి రోజు..100-150 గ్రాముల పెరుగు తీసుకోవాలని సూచిస్తున్నారు. అన్నంతో కలిపి..భోజనం చివరిలో తీసుకోవడం అత్యుత్తమ. అయితే అధికంగా పెరుగు తీసుకుంటే.. ముఖ్యంగా చల్లని పెరుగు వల్ల కొందరిలో జలుబు, గొంతు సమస్యలు వచ్చే అవకాశముంది. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వారు మాత్రం మరింత తక్కువ (50-75 గ్రాములు)తీసుకోవాల్సి ఉంటుంది.


పెరుగు తినడం వల్ల లాభాలు ఇవి? పెరుగన్నం జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.కాల్షియం, ప్రోటీన్‌లను అందిస్తుంది.ఇది బరువు తగ్గడంతోపాటు గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. 2025లో నిర్వహించిన ఓ ఆరోగ్య సర్వేలో..రోజూ పెరుగు తినే వారిలో రక్తపోటు సమస్యలు 20% తక్కువని తేలింది.


పెరుగు తినడం వల్ల నష్టముందా? అతిగా పెరుగు తినడం వల్ల కొందరిలో అతిసారం, కడుపు ఉబ్బరం వచ్చే అవకాశముంది. విటమిన్ సి ఉన్న పండ్లు లేకుంటే మాంసంతో కలిపి తీసుకుంటే.. జీర్ణక్రియ దెబ్బతింటుంది. నిల్వ ఉంచిన పెరుగు తింటే ఆమ్లత్వం పెరుగుతుంది.

పెరుగన్నం తెలుగు సంప్రదాయంలో ఓ భాగం మాత్రమే కాదు. ప్రతి రోజు సరిపడినంత పెరుగు తీసుకుంటే.. ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. సరైన సమయంలో సరైన విధంగా పెరుగన్నం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దరి చేరవన్నది సుస్పష్టం.

Updated Date - Mar 26 , 2025 | 07:18 PM