Kidney Problem: ఈ తప్పులు చేస్తే కిడ్నీలు చెడిపోవడం ఖాయం.. మీ కిడ్నీని ఆరోగ్యంగా ఉండాలంటే..
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:30 PM
Reasons to Kidney Problems : కిడ్నీ సంబంధిత సమస్యలు ఒక్కసారి అటాక్ అయితే ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలు దారుణంగా ఉంటాయి. ఒక్క కిడ్నీ సమస్య చాలు. మన శరీరంలోని ఇతర భాగాలన్నీ మూలనపడటానికి. తెలియక సర్వసాధారణంగా ఈ తప్పుల వల్ల జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి.

Reasons to Kidney Problems : ఇంట్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయకపోతే ఏమవుతుంది. అక్కడ క్షణం కూడా నిలబడలేం. తెలిసీ అలాగే వదిలేస్తే.. లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్టే. అచ్చం అలాగే మీ ఒంట్లోని మలినాలు శుభ్రపరిచే కిడ్నీని జాగ్రత్తగా కాపాడుకోకపోతే.. శరీరంలోని ఏ భాగమూ సరిగా పనిచేయదు సరికదా. కొత్త కొత్త రోగాలతో ఒళ్లు హూనం అవడం ఖాయం. అందుకే, కిడ్నీ సంబంధిత సమస్యలను ఎట్టి పరిస్థితుల్లో తేలికగా తీసుకోకండి. సరైన జీవనశైలి పాటించేందుకు ప్రయత్నించండి. ఈ లక్షణాలను సకాలంలోనే గుర్తించి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.
మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో మూత్రపిండాలు ఒకటి. ఇవి శరీరం నుంచి విషపూరితమైన మలినాలు, చెడును బయటికి పంపించేందుకు నిరంతరం పనిచేస్తాయి. కానీ, మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో లోపాలు వీటి పనితీరుకు ఆటంకం కలిగించి మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అందుకు ఉదాహరణ దేశంలోని యువ జనాభాలో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య వేగంగా పెరుగుతుండటమే నిదర్శనం. సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ కిడ్నీ సమస్యల దుష్ప్రభావాలు, ప్రమాద కారకాల గురించి అవగాహన కలిగి ఉండటం అవసరం.
కిడ్నీలు పాడయ్యేది ఇందుకే..
మూత్రపిండాల సంబంధిత వ్యాధులను ప్రారంభ దశలో గుర్తించకపోతే అది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాన్సెట్ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 850 మిలియన్ల మంది ఏదో ఒక రకమైన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. మీ కిడ్నీలు 90% వరకు పనిచేయడం మానేస్తే డయాలసిస్ లేదా మూత్రపిండ మార్పిడి అవసరం కావచ్చు.ఇది మాత్రమే కాదు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు సాధారణ వ్యక్తులతో పోలిస్తే గుండెపోటు ప్రమాదం 2-4 రెట్లు ఎక్కువ.
కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణాలు..
అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మూత్రపిండాల వైఫల్యం వచ్చే ప్రమాదం 3 రెట్లు ఎక్కువ. నిజానికి రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగినప్పుడు మూత్రపిండాలు ఎక్కువ ఒత్తిడికి లోనై క్రమంగా బలహీనపడతాయి. అదే విధంగా 60 శాతం మూత్రపిండ వైఫల్య కేసులు అధిక రక్తపోటుకు సంబంధించినవే. ఎందుకంటే, అధిక రక్తపోటు మూత్రపిండాల రక్త నాళాలు ఇరుకుగా లేదా దెబ్బతినేలా చేసి మూత్రపిండాలకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. ఈ వ్యాధి చికిత్సకు వాడే మందులు కూడా కిడ్నీ సమస్యల ప్రమాదం పెరుగుతోందని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ నివేదికలు వెల్లడించాయి.
వెంటనే ధూమపానం మానేయండి..
ధూమపానం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. ఈ అలవాటు ఉన్నవారిలో ముందుగా తీరని నష్టం జరిగేది మూత్రపిండాలకే. సిగరెట్ పొగ మీ గుండె, రక్త నాళాలను (హృదయనాళ వ్యవస్థ) దెబ్బతీసి మూత్రపిండాలకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. కిడ్నీలు కాపాడుకోవాలంటే వెంటనే ధూమపానానికి దూరంగా ఉండండి.
బీపీ, షుగర్..
యువతలో అధిక రక్తపోటు సమస్య పెరుగుతోందని అనేక అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాలక్రమేణా అధిక రక్తపోటు మీ శరీరంలోని రక్త నాళాలను దెబ్బతీసి మూత్రపిండాల పనితీరును నాశనం చేస్తుంది. మీ కిడ్నీల్లో మలినాలను వడపోసే భాగాలు క్రమంగా దెబ్బతిని ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. మీరు అధిక రక్తపోటు, మధుమేహం లేదా ఇతర వ్యాధులతో బాధపడుతుంటే.. మూత్రపిండాల పనితీరు పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నీరు, వ్యాయామం చేస్తూ ధూమపానానికి దూరంగా ఉంటే మీ కిడ్నీల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది.
Read Also : MRI Scan: మహిళ ప్రాణాలు తీసిన MRI స్కాన్.. వీరు జాగ్రత్తగా ఉండాలి..
Fast food: మీరు ఫాస్ట్‌ఫుడ్ తింటున్నారా.. అయితే ఒక్కక్షణం..
Dog Bite - RIG: కుక్క కరిచినప్పుడు టీకా తీసుకుంటే సరిపోతుందని అనుకుంటున్నారా