Share News

Health Tips : ఫోన్ పక్కనే పెట్టుకుని నిద్రపోతున్నారా? ఇది ఎంత ప్రమాదమో తెలుసా..

ABN , Publish Date - Jan 05 , 2025 | 05:16 PM

నిద్రపోయేటప్పుడు ఫోన్ చూడటం చాలామందికి అలవాటైపోయింది. కాస్త కునుకు పడుతుందని తెలియగానే దిండు కింద భద్రంగా పెట్టుకుని పడుకుంటారు. కొందరు అలా చూస్తూ చూస్తూనే ఫోన్ పక్కన పెట్టేసి నిద్రలోకి జారిపోతుంటారు. ఇలా ఫోన్ పక్కనే పెట్టుకుని నిద్రపోతే.. ఎంత డేంజర్ అంటే..

Health Tips : ఫోన్ పక్కనే పెట్టుకుని నిద్రపోతున్నారా? ఇది ఎంత ప్రమాదమో తెలుసా..
How Sleeping Next to Your Smartphone is Dangerous

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ చేతిలో లేకపోతే ఏదో కోల్పోయామని ఫీలింగ్. కాసేపు కూడా పక్కన పెట్టకుండా ఉండలేరు. అంతలా మన జీవితంతో పెనవేసుకుపోయిందీ గాడ్జెట్. రోజువారీ జివితంలో ప్రతి పనికీ మొబైల్ అవసరం ఉండటం కూడా అందుకు ప్రధాన కారణం. అవసరం ఉన్నా లేకున్న గంటల తరబడి ఫోన్‌లో ఛాటింగ్ చేయడం, వీడియోలు చూడటం చేస్తుంటారు. నిద్రపోయేటప్పుడు ఫోన్ చూడటం చాలామందికి అలవాటైపోయింది. కాస్త కునుకు పడుతుందని తెలియగానే దిండు కింద భద్రంగా పెట్టుకుని పడుకుంటారు. కొందరు అలా చూస్తూ చూస్తూనే ఫోన్ పక్కన పెట్టేసి నిద్రలోకి జారిపోతుంటారు. ఇదంతా రోజూ అందరి ఇళ్లల్లో సర్వసాధారణంగా జరుగుతున్న విషయమే. అయితే, ఇలా ఫోన్ పక్కనే పెట్టుకుని నిద్రపోవడం చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు నిపుణులు.


పక్కనే పెట్టుకుని నిద్రపోతే..

చక్కని నిద్ర పట్టాలంటే ముందుగా మెదడు, మనసు ప్రశాంతంగా మారాలి. కానీ, పడుకునే ముందు ఫోన్‌ను అదేపనిగా స్క్రోల్ చేస్తూ ఉంటే మెదడులోని నరాలు యాక్టివ్‌గా మారతాయి. దాని నుంచి వచ్చే బ్లూ లైట్ కళ్లపై పడటం వల్ల మనసును రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లనివ్వదు. కంటిచూపుపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. తగినంత సమయం నిద్రపోలేరు. దీంతో అలసట తీరక మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇలాగే నిరంతరం ఫోన్ చూస్తూ నిద్రపోతే భవిష్యత్తులో మతిమరుపు సమస్యలు తలెత్తుతాయి. కొందరు ఫోన్ తల పక్కనే పెట్టుకుని పాటలు వింటూ నిద్రపోతుంటారు. అదీ ప్రమాదమే. ఎందుకంటే, దాని నుంచి విడుదలయ్యే తీవ్రమైన రేడియేషన్ తలనొప్పి, కండరాల నొప్పులతో పాటు దీర్ఘకాల అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది.


ఎంత దూరంలో ఉంచాలంటే..

ముందుగా కనీసం పడుకునే గంట ముందైనా ఫోన్‌కు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. అందుబాటులో ఉండాలి అనుకుంటే 3 నుంచి 4 అడుగుల దూరంలో ఉంచడం ఉత్తమం.


రాత్రి ఫోన్ వాడేటప్పుడు ఇది మర్చిపోకండి..

ఫోన్ తీక్షణంగా రెప్ప వేయకుండా చూడకూడదు.

కళ్లకు, ఫోన్ స్క్రీన్ మధ్య దూరం ఉండేలా జాగ్రత్త తీసుకోండి.

నైట్ మోడ్ ఆన్ చేసి పెట్టుకోవడం మర్చిపోవద్దు.

Updated Date - Jan 05 , 2025 | 05:18 PM