Share News

Summer skincare: ఎండాకాలం వేడినీళ్లతో స్నానం చేస్తున్నారా..

ABN , Publish Date - Apr 01 , 2025 | 02:53 PM

Summer skincare and hot water: వేడినీళ్లతో స్నానం చేసిన తర్వాత శరీరం తేలికగా మారి హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. మరి, బయట ఎండలు మండిపోతున్నా వేడి నీళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేదా హాని కలిగిస్తుందా..

Summer skincare: ఎండాకాలం వేడినీళ్లతో స్నానం చేస్తున్నారా..
Skincare advice hot water summer

Summer skincare and hot water: శీతాకాలంలో దాదాపు అంతా వేడిగా లేదా గోరువెచ్చగా ఉన్న నీటితో స్నానం చేస్తారు. ఇది శరీరాన్ని చలి నుంచి రక్షించడమే కాకుండా మనసును, శరీరాన్ని చురుగ్గా చేస్తుంది. కానీ కొంతమంది మాత్రం వేసవిలో కూడా బయట ఎంత వేడిగా ఉన్నా స్నానం చేయడానికి వేడి నీరు కావాల్సిందే . వేడినీటి స్నానం ఆరోగ్యానికి మంచిదని భావనతో మండే ఎండల్లోనూ వేడి నీటితో స్నానం చేస్తుంటారు. మీరూ సమ్మర్‌లో వేడిగా లేదా గోరువెచ్చగా ఉన్న నీళ్లతో స్నానం చేస్తున్నారా.. ఈ అలవాటు వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? తదితర విషయాల గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.


వేసవిలో వేడి నీళ్లతో స్నానం చేస్తే..

  • రక్తపోటు: వేసవిలో వేడి నీటి స్నానాలు హై బీపీ ఉన్నవారికి చాలా హానికరం. ఈ అలవాటు రక్తపోటు స్థాయిలను మరింత పెంచుతుంది. ఇదేకాక వేడినీటి స్నానం రక్త ప్రసరణకు ఆటంకం కలిగించి రక్తపోటు సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది.

  • చర్మం: మండే ఎండలో మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కష్టం. మీరు వేడి నీటితో స్నానం చేస్తే చర్మం ఇంకా దెబ్బతింటుంది. వేసవిలో బయట ఉష్ణోగ్రత అధికంగా ఉండటం చర్మ ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ఈ సీజన్‌లో వేడి నీటితో స్నానం చేస్తే చర్మంలోని కెరాటిన్ కణాలు దెబ్బతిని సహజ తేమ తగ్గుతుంది. క్రమంగా చర్మం మెరుపును కోల్పోయి వయసుపైబడిన వారిలా కనిపిస్తారు.


  • పొడి చర్మం: చర్మంలోని సహజ నూనె కంటెంట్ చర్మ సమస్యల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. చికాకును తగ్గిస్తుంది. వేసవిలో వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంలోని సహజ నూనెలు ప్రభావితమవుతాయి. ఈ నీటిలో ఉండే క్లోరిన్ చర్మం సహజ నూనె ఉత్పత్తి ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. దీని వలన చర్మం పొడిబారుతుంది.

  • గుండె జబ్బులు: గుండె సమస్యలతో బాధపడేవారు వేసవిలో వేడి నీటితో స్నానం చేయడం ప్రమాదకరం. వేడి వాతావరణంలో వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల హృదయనాళ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.


  • జుట్టు: వేసవిలో జుట్టు సంరక్షణపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ సీజన్‌లో వేడి నీళ్లతో స్నానం చేశారంటే జుట్టులోని తేమ తగ్గి, గరుకుగా, పొడిగా మారుతుంది. చుండ్రు సమస్యలను కలిగిస్తుంది.

  • చర్మ సమస్యలు: వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మ అలెర్జీలు, దురద వంటి సమస్యలు పెరుగుతాయి. వేడి నీటిలో తరచుగా స్నానం చేసేవారికి దద్దుర్లు, మొటిమలు, తామర వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


Read Also: Summer Skincare: మండే ఎండల్లో తాజా చర్మం కావాలా.. ఈ సింపుల్స్ టిప్స్‌తో మెరిసిపోవడం ఖాయం..

Green Chillies: ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..

Kidney Health: కిడ్నీ సమస్యలు ఉన్నవారు బెల్లం తింటే ఏమవుతుంది..

Updated Date - Apr 01 , 2025 | 02:56 PM