Green Chillies: ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..
ABN , Publish Date - Mar 31 , 2025 | 06:36 PM
Green Chillies: రోజూ ఏదొక రూపంలో పచ్చిమిర్చిని క్రమం తప్పకుండా తింటున్నారా.. ఈ అలవాటు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మీకు తెలుసా. ఇంతకీ, డైలీ పచ్చిమిర్చి తినడం మంచిదా.. కాదా.. ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు.

Daily Intake Green Chillies: పచ్చిమిర్చి వాడకుండా వంట చేయడం అంత సులువు కాదు. ఎండుమిర్చితో పోలిస్తే పచ్చిమిర్చిలో ఘాటు కాస్త తక్కువే ఉంటుంది. అందుకని చాలామంది కారం కోసం పచ్చిమిర్చినే అధికంగా వినియోగిస్తుంటారు. సమోసాలు లాంటి స్నాక్స్ తీసుకునేటప్పుడు అదేపనిగా తినేస్తుంటారు. క్రమం తప్పకుండా ప్రతి రోజూ కాకపోయినా కనీసం వారానికి ఐదు రోజులైనా దాదాపు ప్రతిఒక్కరూ పచ్చిమిర్చిని కచ్చితంగా ఏదొక రూపంలో తీసుకుంటూనే ఉంటారు. కానీ, ఇలా మీరు ప్రతిరోజూ పచ్చిమిరపకాయలు తినడం ఆరోగ్యకరమేనా.. ఈ వ్యాసం ద్వారా ఇలా తినడం మంచిదో.. కాదో.. స్పష్టంగా తెలుసుకోండి.
పచ్చిమిర్చి తింటే కలిగే ప్రయోజనాలు
పచ్చిమిర్చి (గ్రీన్ చిల్లీ) మీ ఆహారానికి కారం రుచిని అందిస్తాయి. ఇందులో యాంటియాక్సిడెంట్లు, విటమిన్లు, క్యాప్సైసిస్ అనే పదార్థం ఉంటాయి. పచ్చిమిర్చిలోని విటమిన్ సి మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యాప్సైసిస్ శరీరంలో ఉష్ణోగ్రతను పెంచి జీర్ణక్రియ ప్రక్రియ వేగవంతమయ్యేలా చూస్తుంది. బరువు తగ్గేందుకు, నరాలు నొప్పులు, కీళ్ల నొప్పుల బాధల నుంచి ఉపశమనం కలిగేందుకు ఎంతో సహాయపడుతుంది. ఇంకా క్యాన్సర్ ప్రమాదాన్ని అడ్డుకుంటుంది.
రోజూ పచ్చి మిరపకాయలు తినాలా? వద్దా?
ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం వల్ల మీ బరువు వేగంగా తగ్గవచ్చు. ఇది మీ జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది మీ శరీరం నుండి కేలరీలను బర్న్ చేయడానికి పనిచేస్తుంది. బరువు తగ్గే వారికి మిరపకాయలు ప్రయోజనకరంగా ఉంటాయి.
పచ్చిమిర్చి మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. దీనివల్ల కడుపు సంబంధిత సమస్యలు, మలబద్ధకం తగ్గుతాయి.
పచ్చిమిరపకాయలు కళ్ళ ఆరోగ్యానికి చాలామంచిది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఎ ఉంటుంది. ఇది తింటే కళ్ళలో చికాకు తగ్గుతుంది. కంటి చూపు బలహీనంగా ఉన్నవారికి పచ్చిమిర్చి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇందులోని విటమిన్ సి మీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. తద్వారా మీ శరీరం త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడదు. జలుబు, ఇతర ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.
పచ్చి మిరపకాయ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మీ రక్త నాళాలలో రక్తం గడ్డకట్టకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
పచ్చిమిర్చిలోని విటమిన్ సి, యాంటీ-ఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి. మచ్చలను నివారిస్తాయి.
రోజుకు ఎన్ని తినాలి?
పచ్చిమిర్చి అతిగా తింటే కడుపులో మంట, అల్సర్ లేదా అసిడిటీ సమస్యలు వస్తాయి. కొందరికి ఇది తింటే అలర్జీ రావచ్చు. మీకు అధికంగా మసాలాలు తినే అలవాటు లేకపోతే తక్కువ మొత్తంలోనే తినాలి. పోషకాహార నిపుణుల ప్రకారం రోజూ 2 లేదా 3 పచ్చిమిరపకాయలు తినడం సురక్షితం. మరొక్క విషయం ఏంటంటే, ఖాళీ కడుపుతో ఎట్టి పరిస్థితుల్లో పచ్చిమిరపకాయలు తినకూడదని గుర్తుంచుకోండి.
Read Also: Headache relief: టీ లేదా కాఫీ తాగితే నిజంగా తలనొప్పి తగ్గిపోతుందా.. ప్రతిసారీ ఇదే
Kidney Health: కిడ్నీ సమస్యలు ఉన్నవారు బెల్లం తింటే ఏమవుతుంది..
Summer Tips: వేసవిలో రోజుకు ఎంత నీరు తాగాలి.. తక్కువ తీసుకుంటే ఏ సమస్యలు వస్తాయి..