-
-
Home » Mukhyaamshalu » Today Breaking News Live Updates in Telugu News Friday 7th March 2025 Siva
-

Breaking News: నామినేషన్ వేసిన నాగబాబు..
ABN , First Publish Date - Mar 07 , 2025 | 10:40 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-03-07T14:06:55+05:30
ఢిల్లీ వెళ్తున్నాం..: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నాం.
ఎల్లుండి హై కమాండ్ తో చర్చిస్తాం.
ఎల్లుండి ఉదయం ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తాం.
సామాజిక సమీకరణాలతోనే అభ్యర్థులను ప్రకటిస్తాం.
ఈ నెల చివరి వరకు అన్ని పదవులు ప్రకటిస్తాం.
మతం తప్పా బీజేపీ నాయకులకు ఏం తెలియదు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉండదు.
కేటీఆర్, హరీష్, కవిత తలో దిక్కు చూస్తున్నారనే భయంతోనే కేసీఆర్ మీటింగ్ పెట్టారు.
వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసి ఉండాలని కేసీఆర్ కోరడం తప్పా మీటింగుకి ప్రాధాన్యత లేదు.
-
2025-03-07T14:02:33+05:30
నామినేషన్ వేసిన నాగబాబు..
అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదల నాగబాబు నామినేషన్.
నాగబాబు అభ్యర్థిత్వాన్ని బలపరచనున్న మంత్రి నారా లోకేష్, పల్లాశ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు.
నాగబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, పల్లాశ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, బొలిశెట్టి శ్రీనివాస్.
రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాలు అందచేసిన కొణిదల నాగబాబు.
-
2025-03-07T11:47:12+05:30
అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు గుడ్ న్యూస్..
అమరావతి: ఏపీలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రభుత్వం శుభవార్త.
వారి రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచుతూ GO జారీ చేసిన ప్రభుత్వం.
రిటైర్మెంట్ తరువాత గ్రాట్యుటీ ను కూడా పెంచిన ప్రభుత్వం.
అంగన్వాడీ హెల్పర్లకు 1 లక్ష రూపాయలు, వర్కర్లకు 40 వేల గ్రాట్యుటీ చెల్లించాలని నిర్ణయించిన ప్రభుత్వం.
ఈ మేరకు GO నంబర్ 8 ను జారీ చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి.
-
2025-03-07T11:28:15+05:30
ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం.
సమావేశంలో కేటీఆర్, హరీష్, కవిత, మధుసూదనాచారీ, జగదీష్ రెడ్డి, తలసాని, నిరంజన్ రెడ్డి, పద్మారావు గౌడ్, పువ్వాడ అజయ్, శ్రీనివాస్ గౌడ్, దాసోజు శ్రవణ్ తదితరులు.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంపిక చేయనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
రెండు స్థానాల్లో అభ్యర్థులను నిలబట్టేలా కేసీఆర్ వ్యూహరచన.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెనక్కి రప్పించేలా కేసీఆర్ ప్రయత్నాలు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కూడగట్టేలా బీఆర్ఎస్ ప్రణాళికలు.
-
2025-03-07T10:51:50+05:30
కొడాలి నానికి బిగ్ షాక్..
గుడివాడ: మాజీ మంత్రి కొడాలి నాని అత్యంత సహితులకు 41ఎ నోటీసులు జారీ చేసిన గుడివాడ పోలీసులు.
వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించడం.. లిక్కర్ గోడౌన్ వ్యవహారంలో బెదిరింపుల కేసులలో కొడాలి నాని షాడోగా పేరుపొందిన దుక్కిపాటి శశిభూషన్, సన్నిహిత మిత్రుడు పాలడుగు రాంప్రసాద్, గుడివాడ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీనులకు 41ఎ నోటీసులు జారీ చేసిన గుడివాడ పోలీసులు.
ఈ రెండు కేసులలో మాజీ మంత్రి కొడాలి నాని, అప్పటి ఏపీ బెవరేజేస్ ఎండీ వాసుదేవరెడ్డి, జె.సి మాధవీలతరెడ్డి తదితరులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన గుడివాడ పోలీసులు.
ఈ కేసులలో కోర్టుకు వెళ్లడంతో 41ఏ నోటీసులిచ్చి విచారణ చేయాలని ఆదేశించిన హైకోర్టు.
దీంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో 41 ఏ నోటీసులు అందుకున్న కొడాలి నాని సన్నిహితులు.
-
2025-03-07T10:40:36+05:30
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త.
2.5 శాతం డిఏ ప్రకటించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
డిఎ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై 3.6 కోట్లు అదనపు భారం.
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డిఏలు తక్షణమే చెల్లించేందుకు సర్కార్ నిర్ణయం.
డిఏల పెంపుతో 30 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ది చేకూరుస్తున్నట్లు వెల్లడి.
మహిళా దినోత్సవ సందర్భంగా రేపు ఇందిరా మహిళా శక్తి బస్సుల ప్రారంభం.
మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా మొదటి దశలో 150 బస్సులు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీలోకి.
తరువాత దశలో 450 బస్సులు మొత్తం 600 బస్సులు మహిళా సంఘాల ద్వారా అద్దె ప్రాతిపదికన ఒప్పందం.
రేపు లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.